Janasena: ఆత్మకూరు ఉప ఎన్నికకు జ‌న‌సేన దూరం.. పోటీకి సిద్దమైన బీజేపీ

బీజేపీ జ‌న‌సేన పొత్తు ఉన్న‌ప్ప‌టికి ఇరు పార్టీల మ‌ధ్య నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 3, 2022 / 10:34 AM IST

నెల్లూరు: బీజేపీ జ‌న‌సేన పొత్తు ఉన్న‌ప్ప‌టికి ఇరు పార్టీల మ‌ధ్య నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో జ‌న‌సేన పార్టీ పోటీకి నిరాక‌రించింది. అయితే మిత్ర‌ప‌క్షం బీజేపీ మాత్రం పోటీకి సిద్ధ‌మైంది.

ఈ స్థానానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు జి భరత్‌ కుమార్‌ యాదవ్‌ నామినేషన్‌ వేస్తున్నారని, జూన్‌ 4న ఆయన నామినేషన్‌ దాఖలు చేయబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల రాజ్యసభ ఎంపీ జివిఎల్‌ నరసింహారావు విలేకరుల సమావేశంలో తాము ఎంపిక చేసిన అభ్యర్థికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు.

అధికార పార్టీ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు జ‌న‌సేన సహాయంతో బీజేపీ ఒకట్రెండు రోజుల్లోనే తమ అభ్యర్థిని ఎంపిక చేస్తామ‌ని తెలిపారు. బిజెపికి చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒక వర్గం నాయకులు జనసేనను స్వచ్ఛందంగా విస్మరించారని.. అధికార పార్టీకి రహస్య మద్దతునిస్తూ తమ పార్టీ నుండి బలహీనమైన అభ్యర్థిని ఎన్నుకున్నారని జ‌న‌సేన నేత‌లు ఆరోపించారు. వాస్తవానికి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నేతృత్వంలోని కమిటీ ముందుగా ముగ్గురి పేర్లను ప్రతిపాదించగా, జిల్లా అధ్యక్షుడు జి.భరత్‌కుమార్‌ను పోటీకి ఎంపిక చేశారు. అతను 2014-19లో కావలి మున్సిపాలిటీకి వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.

చైర్‌పర్సన్ పి అలేఖ్య న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు కొంతకాలం ఛైర్మన్ పదవిని నిర్వహించారు. అలాగే మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మేనల్లుడు బిజివేముల రవీంద్రనాథ్‌రెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నికలో ప్రచారం ప్రారంభించారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయనకు టిక్కెట్టు కోరినా నిరాకరించారు. జూన్‌ 6వ తేదీలోపు ఆయ‌న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏదిఎమైన‌ప్ప‌టికీ బీజేపీ జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంలో ఇరు పా