AP : ఈసీకి జనసేన సూటి ప్రశ్న..డీజీపీని మార్చినప్పుడు సీఎస్‌ను ఎందుకు మార్చడం లేదు

ముఖ్యంగా వైసీపీ నేతలు , వారి అనుచరులు విధి రౌడీల్లా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఈసీ మాత్రం సూచిచూడనట్లు ఉండడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది

  • Written By:
  • Publish Date - May 22, 2024 / 09:32 PM IST

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఈసీని ప్రశ్నించింది జనసేన. ఎన్నికల పోలింగ్ రోజు నుండి రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో తెలియంది కాదు…ముఖ్యంగా వైసీపీ నేతలు , వారి అనుచరులు విధి రౌడీల్లా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఈసీ మాత్రం సూచిచూడనట్లు ఉండడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు లేఖ విడుదల చేసింది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రౌడీయిజం, దాడులు ఎక్కువయ్యాయని, ఏపీలో అల్లర్లు, అలజడులను ఆపడంలో సీఎస్ విఫలమయ్యారని లేఖలో పేర్కొంది. డీజీపీని మార్చినప్పుడు సీఎస్‌ను ఎందుకు మార్చడం లేదని ఈసీని జనసేన ప్రశ్నించింది. సీఎస్ జవహర్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

జవహర్ రెడ్డి సీఎస్‌గా ఉంటే కౌంటింగ్‌లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని జనసేన అనుమానాలు వ్యక్తం చేసింది. అందుకే జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామని జనసేన నేత కిరణ్ రాయల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జవహర్ రెడ్డి నిన్న (మంగళవారం) వైజాగ్‌కు రహస్యంగా ఎందుకు వెళ్లారో తెలియడం లేదని కిరణ్ రాయల్ సందేహం వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు సరిగ్గా లేదని, పులివర్తి నానిపై దాడి చేసిన కేసులో అమాయకులను అరెస్టు చేశారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read Also : AP Election Counting : కౌంటింగ్ రోజున ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయో..?