Site icon HashtagU Telugu

AP Assembly Elections 2024 : 63 స్థానాల్లో జనసేన పోటీ..క్లారిటీ వచ్చేసిందా..?

Babu Pawan

Babu Pawan

ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) రాబోతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికలు మంచి రసవత్తరంగా ఉండబోతున్నాయి..మొన్నటి వరకు టిడిపి – జనసేన కూటమి vs వైసీపీ మద్యే అసలైన పోరు అనుకున్నారు కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చి పోరుకు మరింత హోరు పెట్టింది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తోనే అన్నపై విమర్శల అస్త్రం సంధించి నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా మాజీ నేతలను కలుస్తూ చర్చలు జరుపుతుంది. దీంతో ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనేది మరింత ఆసక్తిగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ ..టీడీపీ తో కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ పలుమార్లు సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల పంపకాలపై చర్చించారు. జనసేన బలంగా ఉన్న స్థానాల్లో సీట్లు కావాలని చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కి 63 సీట్లు కేటాయించాలని చంద్రబాబు డిసైడ్ చేసినట్లు సమాచారం అందుతుంది. టీడీపీ 112 స్థానాల్లో బరిలోకి దిగనుండగా, పొత్తులో ఉన్న జనసేన 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయని ఓ ప్రకటన వెలువడింది. కానీ దీనిపై టీడీపీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదన్న సదుద్దేశంతో పవన్ కళ్యాణ్..టీడీపీ తో పొత్తు పెట్టుకున్నాడు. గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి వైసీపీ గెలుపుకు కారణమయ్యాడు..ఈసారి ఆ తప్పు జరగకూడని , రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ తో జత కట్టాల్సిందే అని నిర్ణయం తీసుకొని పవన్..పొత్తు పెట్టుకున్నాడు. టీడీపీ తో జనసేన కలవడం ఇష్టం లేక పలువురు జనసేన నేతలు బయటకు రావడం కూడా జరిగింది. కానీ పోయే నేతలకన్నా రాష్ట్ర ప్రజల బాగోగులు ముఖ్యమని బాబు తో పవన్ సంధి కుదుర్చుకున్నాడు. చంద్రబాబు సైతం..కీలక సమయంలో పవన్ ముందు చూపుతో పొత్తు పెట్టుకోవడంతో పవన్ మాటను తీయకుండా ఆయన అడిగిన సీట్లును ఇచ్చేందకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మరి జనసేన ఏ ఏ స్థానాల నుండి బరిలోకి దిగుతుంది…? ఎవరెవర్ని బరిలో దింపుతుందో..? చూడాలి.

Read Also : Viral : పానీపూరి అమ్ముతూ మహీంద్రా థార్ ను కొనుగోలు చేసిన 22 ఏళ్ల యువతీ..