వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) (YSRCP)లోకి వెళ్లే ఆలోచనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ (Jaleel Khan) మనసు మార్చుకుని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) (TDP)లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ టీడీపీ లోక్‌సభ ఇన్‌చార్జి కేశినేని చిన్ని (Keshineni Chinni)తో చర్చించిన జలీల్‌ఖాన్ టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. చిన్ని, జలీల్ ఖాన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)తో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలో కొనసాగాలనే తన నిర్ణయాన్ని తెలుపుతూ, పార్టీలో తన రాజకీయ భవిష్యత్తుపై నారా లోకేష్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తెదేపా విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి ముస్లింల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. జలీల్ ఖాన్ భవిష్యత్ తనదేనన లోకేష్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితుల పైన చర్చించారు. లోకేష్ ఇచ్చిన హామీ..చర్చలో జలీల్ ఖాన్ టీడీపీ గెలుపు కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల మద్దత్తు కూడగట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబెడతానని నారా లోకేష్ కి స్పష్టం చేసారు. దీంతో, జలీల్ ఖాన్ పార్టీ మారుతున్నారనే ప్రచారానికి తెర పడింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటే.. పశ్చిమ బెజవాడలో టీడీపీ టికెట్ కోసం బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీ పడుతున్న నేపథ్యంలో.. మైనారిటీలకు టికెట్ ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ జలీల్ ఖాన్ ఇటవీల వ్యాఖ్యానించారు. అయితే అంతకు ముందు ఆయన నోరు జారారు. టికెట్ ఇవ్వకపోతే తానే ఉరేసుకుంటానని జలీల్ ఖాన్ అనడం చర్చనీయాంశంగా మారింది. ఆ వెంటనే సవరించుకుని.. మైనారిటీలకు గనుక టికెట్ దక్కకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ వివరించారు జలీల్ ఖాన్. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఉరేసుకునేందుకు ప్రయత్నించగా.. తాను వారించి ఆపానని, అంతేకాదు సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని.. చంద్రబాబు ఈ స్థానం నుంచి మైనారిటీలకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు జలీల్ ఖాన్ చెప్పుకొచ్చారు.. అయితే… ఆపై ఓ అడుగు ముందుకేసి పశ్చిమ విజయవాడలో టికెట్ తనదేనంటూ.. ఎన్నికల బరిలో నిలబడతానంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యలు చేయడంతో టీడీపీలో బుద్దా వెంకన్నకు ఆయన కు వార్ మొదలైంది. అలాగే ఈ విషయంపైనే పవన్ కల్యాన్‌ను కలిసి పరిస్థితి వివరించానని.. పొత్తులో భాగంగా ఈ సీటును వదిలేసుకోవాలని జనసేనను కోరారని చెప్పుకొచ్చారు జలీల్ ఖాన్.
Read Also : PM Surya Ghar Muft Bijli Yojana: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
