Site icon HashtagU Telugu

BJP bye to Janasena?: జై చంద్రబాబు, పవన్ ఆప్షన్ అదే.! జనసేనకు బీజేపీ బై?

Jai Chandrababu And Pawan Are The Same Option! Bjp Bye To Janasena

Jai Chandrababu And Pawan Are The Same Option! Bjp Bye To Janasena

అర్థంకాని బీజేపీ, జనసేన పొత్తు వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. ఎంఎల్సీ ఫలితాల తరువాత ఆ రెండు పార్టీల మధ్య గాప్ పెరిగింది. ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని బీజేపీ గుర్రుగా ఉంది. కలిసిరావటం లేదని జనసేన మీద బీజేపీ లీడర్ మాధవ్ ఆరోపించారు. దీంతో బీజేపీ, జనసేన మధ్య కటీఫ్ అనే టాక్ వస్తుంది. పైగా టీడీపీ మద్దతు లేకుండా ఒక్క సీట్ కూడా గెలవలేమనే భావనకు జనసేన వచ్చేసింది. రాజకీయ వీరమరణం పొందటం ఇష్టంలేక బీజేపీకి దూరం కానుందని తెలుస్తుంది. అలాగని టీడీపీ ఓపెన్ ఆఫర్ జనసేనకు ఇచ్చే పరిస్థితి లేదు. ఉభయ కమ్యూనిస్టులతో కలిసి వెళ్లాడానికి సిద్ధం అవుతుంది. ఎంఎల్సీ ఫలితాల తరువాత టీడీపీ వ్యూహాన్ని మార్చిందని సమాచారం. ఒంటరిగా ఎన్నికలకు పోవాలని యోచిస్తోంది. ఆ దిశగా దూకుడు పెంచింది. దీంతో జనసేన తొందర పడుతూ టీడీపీకి దగ్గర అవుతుంది. ఆ క్రమంలో బీజేపీ కి దూరం జరుగుతూ రాజకీయాలు చేస్తుంది. గమనించిన BJP వ్యహాత్మకంగా జనసేన ను వదిలించుకుని ఒంటరి పోరాటం చేయాలని భావిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. కానీ జనసేన తీరు అలా కాదు వచ్చే ఎన్నికల్లో తాము మూడవ ఫోర్స్ గా ఎదగాలని చూస్తోంది. పొత్తులతో భాగంగా అధికార వాటా కోరుకుంటోంది. అలా రాయబేరాలు ఒక దశలో ఉండగానే ఎమ్మెల్సీ ఎన్నికల రూపేణా టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పొత్తుల విషయంలో ఏమి చేస్తుంది అన్నదే చర్చగా ఉంది. మంగళగిరి మీటింగులలో పవన్ మూడు ఆప్షన్లు తనకు ఉన్నాయని చెప్పుకున్నారు. అందులో మొదటికి టీడీపీ బీజేపీ జనసేన కలసి పోటీ చేయడం. ఆ ఆప్షన్ అన్నది కుదరదు అన్నది ఇప్పటికే తేలిపోయింది. రెండవది జనసేన టీడీపీ పోటీ చేయడం ఈ ఆప్షన్ అలాగే ఉంది. మూడవది ఒంటరిగా జనసేన పోటీ చేయడం. ఈ విషయంలో సైతం పవన్ మనోభావాలు ఏమిటో ‘రాజకీయ వీరమరణం’ వ్యాఖ్య తేల్చింది.

ఎచ్చెరలో జరిగిన యువత సభలో పవన్ ఒంటరిగా పోటీ చేయాలంటే గెలుపుపైన నమ్మకం ఉండాలని అలా ఓటేసి గెలిపిస్తామని నమ్మకం ఉంటేనే దిగుతామని చెప్పారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో సైతం ఆయన సర్వేలలో తమ పార్టీ గెలుపు గురించి ఏమైనా ఆశావహమైన సమాచారం ఉంటే ఒంటరి పోరుకు వెనకాడబోమని చెప్పారు. అయితే పవన్ ఒంటరిగా పోటీ చేయడం కంటే పొత్తుల వైపే చూస్తున్నారు. ఈసారి అటు చంద్రబాబు ఇటు జగన్ కూడా ధీటుగా సరిసాటిగా అన్నింటా ఉంటారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎంతవరకూ నెగ్గుకువస్తారన్న చర్చ కూడా ఉంది. దాంతో తెలుగుదేశంతో పొత్తులు అన్న ఒక ఆప్షన్ అలా ఉండనే ఉంది. పవన్ జనసేన టీడీపీతో పొత్తులకు వెళ్లాలీ అంటే గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలని కండిషన్ పెట్టారు. దీనితో కామ్రేడ్లతో కలిసి పోటీ చేయాలని భావిస్తోంది.

మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ 150 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని భావిస్తోంది. అదే విధంగా పొత్తులకు ఆ మిగిలిన పాతిక సీట్లు వదిలేయాలన్నదే టీడీపీ ఆలోచన. అందులోనే కామ్రేడ్స్ కానీ BJP కానీ జనసేన కానీ సర్దుకోవాల్సి ఉంటుంది. మరి యాభై సీట్ల దాకా తమకు ఇస్తేనే పొత్తులు అని జనసేన అంటే అసలు కుదిరే వ్యవహారమేనా అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం.

అయితే వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని జనసేన కూడా ఒక మెట్టు దిగే అవకాశాలు ఉన్నాయా అన్నదే అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక పొత్తులతో పోటీ చేసి అసెంబ్లీలో తమ సత్తాను చాటడం జనసేనకు ఉన్న ఆప్షన్. అది కాదు అనుకుంటే ఒంటరిగానే బరిలోకి దిగి సత్తా తేల్చుకోవాలి. అపుడు ట్రయాంగిల్ ఫైటింగ్ లో రాజకీయ వీరమరణం కనిపిస్తుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత పవన్ నుంచి వస్తున్న ప్రకటనలు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగానే ఉండడాన్ని గమనించ వచ్చు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల మీద దాడిని జన సేనాని గట్టిగా ఖండించారు. జీవో నంబర్ 1 మీద తెలుగుదేశం సభ్యులు కోరిన విధంగా ఎందుకు చర్చ జరపాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిని బట్టి చూస్తూంటే పవన్ ఆ ఆప్షన్ నే ఎంచుకున్నారని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లలో జనసేన టీడీపీ పొత్తులలో వెళ్తే మాత్రం ఏపీలో అది పెను రాజకీయ సంచలనమే అవుతుంది. వైసీపీకి కూడా చుక్కలు కనిపిస్తాయని ఒక అంచనా. జనసేన పొత్తు నష్టమని మరో అంచనా కూడా ఉంది.

అధినేత పవన్ కళ్యాణ్ గత ఏడాది పలుమార్లు మంగళగిరిలోని తన పార్టీ ఆఫీసుకు వచ్చినపుడు క్యాడర్ తో మాట్లాడుతూ చేసిన ప్రసంగాలు ఇచ్చిన సంకేతాలు ఇపుడు మరో మారు చర్చకు వస్తున్నాయి. ఏపీలో ఇపుడు రాజకీయ సన్నివేశం బాగా మారింది. ఇప్పటిదాక ఏపీలో బలమైన పార్టీగా వైసీపీ ఉంది. విపక్షాలకు ఒంటరిగా ఢీ కొట్టేందుకు బలం సరిపోదు అని అంటూ వచ్చారు. అయితే మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకుని తెలుగుదేశం వైసీపీని గుక్క తిప్పుకోనేయకుండా చేసింది.

అందునా వైసీపీకి హార్డ్ కోర్ సబ్ రీజియన్ అయిన రాయలసీమలోనే గట్టి ఝలక్ ఇచ్చేసింది. ఈ పరిణామం ఏపీ రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది అని చెప్పాలి. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ధీటుగా టీడీపీని జనాలు ఎంచుకుంటారు అన్న మేసేజ్ జనంలోకి సక్సెస్ ఫుల్ గా వెళ్లిపోయేలా చేయడంలో నాలుగేళ్ళ పాటు పరిశ్రమించి చంద్రబాబు రచించిన వ్యూహాలు ఫలించాయి అని చెప్పాలి. ఒంటరిగా టీడీపీ అధికారం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిణామాలు 20 స్థానాలను కూడా జనసేనకు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించే పరిస్థితి లేదు. అందుకే అటు BJP ఇటు టీడీపీ కి కాకుండా జనసేన ఒంటరయ్యే ఛాన్స్ ఉంది.

Also Read:  Mumbai Indians: చివరి మ్యాచ్ లోనూ ఓడిన బెంగళూరు