Site icon HashtagU Telugu

Vallabhaneni Vamsi : వంశీ కుటుంబంలో జగన్ చిచ్చు..?

Vamshi Wife

Vamshi Wife

గన్నవరం నియోజకవర్గ (Gannavaram Constituency) రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. పలు కేసుల కారణంగా అరెస్టుల పాలయ్యిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) స్థానాన్ని భర్తీ చేయడమే కాకుండా, ఆయన కుటుంబంలోనే చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. వంశీ స్థానంలో ఆయన భార్య పంకజశ్రీ (Vallabhaneni Vamsi Wife)కి గన్నవరం ఇంచార్జ్ పదవి ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు లీక్ చేశాయి. “వంశీకి అన్యాయం కాకుండా చూసేందుకు” అనే నెపంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Real Estate : చంద్రన్న ‘పవర్’ కు ఏలూరు లో ఊపందుకున్న రియల్ ఎస్టేట్

ఇలాంటి విధానం జగన్ గతంలో కూడా అనుసరించిన ఉదాహరణలు ఉన్నాయి. దువ్వాడ శీను కుటుంబంలో కూడా ఇదే విధంగా చిచ్చు పెట్టారని, నందిగం సురేష్ భార్యకు కూడా హోం మినిస్టర్ స్థాయిలో సంకేతాలిచ్చారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వంశీ భార్యను రాజకీయాల్లోకి తీసుకురావడాన్ని ఆయనకు ఇష్టం లేదని, వారిద్దరి మధ్య విభేదాలున్నాయని, గతంలో ఆమె వంశీపై కేసు కూడా పెట్టిందన్న ప్రచారం కొనసాగుతోంది. ఇలాంటి వాస్తవాలను బట్టి చూస్తే, వంశీ స్థానంలో భార్యకు పదవి ఇవ్వడం రాజకీయ కుట్రగా అభివర్ణించబడుతోంది.

ప్రస్తుతం వంశీపై ఉన్న కేసుల్లో చాలా వరకు బెయిలు లభించాయి. కేవలం ఒకే ఒక్క కేసు మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. వంశీని పక్కకు తొలగించి, భార్యకు పదవి ఇవ్వడం వెనుక రాజకీయ లబ్ధి కోణమేనని వంశీ అనుచరులు భావిస్తున్నారు. నిజంగా పంకజశ్రీని నియమిస్తారా? లేక ఇదంతా ఫేక్ నా అన్నది చూడాలి.