YCP MLAs: చేతులెత్తేస్తున్న వైసీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు. ఓ వైపు సీఎం జగన్ వైనాట్ 175 అంటూ సవాళ్లు విసురుతుండగా.. మిగతా ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభం కాకముందే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. 81 వేల మెజారిటీతో గెలిచిన ఓ ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకున్నారు

YCP MLAs: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు. ఓ వైపు సీఎం జగన్ వైనాట్ 175 అంటూ సవాళ్లు విసురుతుండగా.. మిగతా ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభం కాకముందే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. 81 వేల మెజారిటీతో గెలిచిన ఓ ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకున్నారు. ఒక ఎమ్మెల్సీ తన నాలుగేళ్ల పదవీ కాలాన్ని వదులుకుని జగన్‌కు పట్టం కట్టారు. జగన్ పై ఎమ్మెల్యేలకు నమ్మకం పోయిందా? వైకాపాలో ఏం జరుగుతోంది.

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు 2019 ఎన్నికల్లో 81 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచి జగన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మెజారిటీ సాధించడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో కష్టపడి పనిచేస్తున్న ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన నేతలు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయానంటూ సన్నిహితుల ఎదుట అన్నా రాంబాబు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో పలుచన కావడం కంటే పోటీ నుంచి తప్పుకోవడమే మేలని అన్నారాంబాబు భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

మరో నాలుగేళ్లు మండలి సభ్యుడిగా ఉన్నా పట్టించుకోకుండా వైసీపీకి గుడ్ బై చెప్పారు విశాఖ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న వంశీకృష్ణకు భారీగా నష్టం వాటిల్లింది. బీసీలను ప్రోత్సహిస్తున్నానని చెప్పి ఆ సామాజికవర్గానికి చెందిన వంశీని ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయికి దించారు జగన్. విశాఖ మేయర్ పదవి ఇస్తానని నమ్మించి కార్పొరేటర్ గా పోటీ చేశారు. గెలిచిన తర్వాత ఆయనకు మేయర్ పదవి ఇవ్వలేదు. ఇదే అడిగే ప్రయత్నం చేసిన వంశీకి జగన్ అపాయింట్‌మెంట్ కూడా దక్కలేదు. విశాఖ తూర్పు నియోజక వర్గంలో సీటును తప్పించి ఎమ్మెల్సీతో సరిపెట్టుకోవాలని వంశీకృష్ణ భావిస్తున్నారు. వంశీకి కనీసం 2024లో టికెట్ ఇవ్వాలని కోరగా వైసీపీ నేతలు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సీటు ఇచ్చారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వైసీపీతో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కంటే టీడీపీని కార్నర్ చేసేందుకు ఆర్కే ఎక్కువ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లేనిపోని కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తూ చంద్రబాబును ఒక రకంగా వేధింపులకు గురిచేశారు. రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వైఎస్‌ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని వెల్లడించారు.

Also Read: Cars : ఆ కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 2 లక్షల తగ్గింపుతో కళ్ళు చెదిరే ఆఫర్స్..