AP Govt Helps : జనసేన సైనికుడికి…జగన్ సాయం

చంద్రశేఖర్ అనే జనసైనికుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్సకు సాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ అభిమాని Xలో ట్వీట్ చేశారు

Published By: HashtagU Telugu Desk
Cm Jagan Comments On Chandr

Cm Jagan Comments On Chandr

ఎన్నికలు (Elections ) వస్తున్నాయంటే చాలు నేతలకు (Political Leaders) అందరు గుర్తొస్తారు..ఓటర్లపై ఎక్కడాలేని ప్రేమ పుట్టుకొస్తది..మూతి తుడవడం దగ్గరి నుండి ముండి కడగడం వరకు అన్ని చేస్తారు..అంతేనా ప్రతి ఇంటికి తిరుగుతూ ఏమికావాలలో అడిగి తెలుసుకో అవి ఇస్తుంటారు..ఇక హామీల గురించి చెప్పాల్సిన పనే లేదు. నోటికి ఏది వస్తే అది ఇచ్చుకుంటూపోతారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి పోలింగ్ మూగేసేవరకు ఓటర్లను బంగారుబాతుల్లా చూసుకుంటారు. అందుకే ఓటర్లు సైతం ఎన్నికల సమయంలోనే వారి కోరికల్ని తీర్చేసుకుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఇప్పుడు ఏపీ(APలో ఎన్నికల సందడి హోరాహోరీగా ఉంది. గత ఎన్నికలు వేరు..ఈసారి జరగబోయే ఎన్నికలు వేరు. వైసీపీ (YCP) ని ఎలాగైనా గద్దె దించాలని కూటమి పార్టీలు ఎన్నో వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటు వైసీపీ కూడా ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. అభ్యర్థులు ఖర్చుకు ఏమాత్రం భయపడకుండా భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారు. ఎన్నికలకు ఇంకా 50 రోజులు ఉన్నప్పటికీ..ఇప్పటి నుండే ప్రచారాన్ని స్పీడ్ చేసారు. ప్రతి రోజు నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

తాజాగా జనసైనికుడి సాయం చేసి జగన్ (CM Jagan) తన గొప్ప మనసు చాటుకున్నాడు. చంద్రశేఖర్ అనే జనసైనికుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్సకు సాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ అభిమాని Xలో ట్వీట్ చేశారు. దీనికి సీఎం జగన్ స్పెషల్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ ఇన్ఛార్జ్ డాక్టర్ హరికృష్ణ స్పందించారు. ‘బాధితుడికి వైజాగ్ KGHలో చికిత్స అందిస్తున్నాం. మా టీమ్ ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడింది. చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు CMRF కింద చెల్లిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసి సదరు రోగి తో పాటు జనసేన సైనికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇదంతా ఓట్ల కోసమే అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆపదలో ఉన్న వారికీ సాయం చేయడం గొప్ప విషయమే కదా.

Read Also : Bandaru Satyanarayana : ఆసుపత్రిలో బండారు సత్యనారాయణమూర్తి 

  Last Updated: 24 Mar 2024, 04:53 PM IST