Site icon HashtagU Telugu

AP: సీఎం జగన్ గుడ్ న్యూస్… ఆ ఉద్యోగులంతా EHS పరిధిలోకి..!!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త అందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) పరిధిలోకి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇటీవలే గ్రామ, వార్డు, సచివాలయ శాఖ కమిషర్ ఏపీ సర్కార్ కు లేఖ రాశారు. తమ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో జగన్ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ హెల్త్ కార్డుల జారీతో సుమారు 1.34 లక్షల మంది ఉద్యోగులు EHS పరిధిలోకి రానున్నారు.