Site icon HashtagU Telugu

Jagan : ప్రొద్దుటూరు లో జగన్ మొదటి ఎన్నికల సభ..

Jagan Meeting

Jagan Meeting

ఇప్పటివరకు సిద్ధం (Siddam) అంటూ భారీ సభల ద్వారా దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan)..ఇప్పుడు ‘మేమంతా సిద్ధం’(Mimantha Siddam) అంటూ బస్సు యాత్ర తో ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 13 న పోలింగ్ జరగనుండగా..జూన్ 04 న ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఆ తరుణంలో అన్ని పార్టీల నేతలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది.

ఈనెల 27వ తేదీ నుంచి బస్సు యాత్ర చేపడతారని, ఇడుపులపాయ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఈ బస్సు యాత్ర చేపడుతున్నట్లు వివరించారు. ఇడుపులపాయలోని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర రెడ్డి ఘాట్‌ వద్ద పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్‌ నివాళులర్పిస్తారని, అనంతరం బస్సు యాత్ర ప్రారంభం అవుతుందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఐదేళ్ల ప్రజారంజక పాలన తరువాత ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన నేపథ్యంలో తరువాతి అడుగుగా సీఎం జగన్‌ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని ఎన్నికల సమరానికి సన్నద్ధం చేయడం కోసం ఈ యాత్ర నడుస్తుందన్నారు. సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్‌ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడుతున్నట్లు సజ్జల తెలిపారు. మొదటి రోజు మధ్యాహ్నం 3 తరువాత ప్రొద్దుటూరు లో తొలిసభ జరగనుంది. అంచనాలకు మించి ఈ సభలు జరుగుతాయని సజ్జల ధీమా వ్యక్తం చేసారు.

Read Also : Beauty Tips: ముఖంపై ముడతలు రాకుండా యవ్వనంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?