AP : జగన్ లో ఓటమి భయం మొదలైందనడానికి ఆయనే మాటలే నిదర్శనం

ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోందని వ్యాఖ్యానించారు

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 10:53 PM IST

ఏపీ(AP)లో గత నెల క్రితం వరకు ఓ లెక్క ఉండేది..ఇప్పుడు ఓ లెక్కగా మారింది. ఇది మీము చెప్పడం లేదు వైసీపీ అభ్యర్థులు ..ఏకంగా జగనే (Jagan) చెపుతున్న మాట. మొన్నటి వరకు 175 కు 175 కొట్టబోతున్నాం అంటూ ఎవరికీ వారే ధీమా చేస్తూ వచ్చారు..కానీ ఇప్పుడు ఆ మాటే కాదు కదా..అసలు గెలుపు మాటే మరచిపోయారు. ఎంతసేపు కూటమి (AP NDA Alliance) నేతలు మోసం చేస్తున్నారు..జగన్ ను లేకుండా చేయాలనీ చూస్తున్నారు..అబద్దాలు ఆడుతున్నారు..ప్రభుత్వ అధికారులను బదిలీ చేస్తున్నారని చెప్పడం మొదలుపెట్టారు. ఈరోజు ఏకంగా జగన్ సైతం ఇవే మాటలు చెప్పి తనలో భయం మొదలైందని చెప్పకనే చెప్పాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మచిలీపట్నంలో జగన్ పర్యటించారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోందని వ్యాఖ్యానించారు. అమల్లో ఉన్న సంక్షేమ పథకాల నిధులను అడ్డుకుంటున్నారని.. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని , కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని.. ప్రజలకు మంచి చేసే తనను ఉండకుండా చేయాలనేదే వాళ్ల లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు విన్న వారంతా జగన్ లో ఓటమి భయం మొదలైందని..ఆ భయం స్పష్టంగా జగన్ లో కనిపిస్తుందని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా అనడం చేసాడు. జగన్ నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేసిన..కూటమి విజయాన్ని ఆపలేవు..ఇక రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని తెలిపాడు. ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలను కూటమి నేతలు సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.

Read Also : Prudhvi Raj : శ్యామల కనపడితే కొడతారంటూ పృద్వి ఘాటైన వ్యాఖ్యలు