Jagan : ఏపీ అప్పులపై..జగన్ చెప్పిన లెక్కలు

కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్న బడ్జెట్ ప్రవేశపెట్టలేని అధ్వాన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. పూర్తి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదు అని ఎద్దేవా

  • Written By:
  • Publish Date - July 26, 2024 / 02:42 PM IST

ఏపీ అప్పులపై కూటమి vs వైసీపీ వార్ (TDP vs YCP) నడుస్తుంది. గడిచిన ఐదేళ్లలో వేలకోట్లు వైసీపీ అప్పు చేసిందని సీఎం చంద్రబాబు (Chandrababu) ఆరోపిస్తుంటే..చంద్రబాబు దొంగ లెక్కలు చెప్పి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మాజీ సీఎం జగన్ (Jagan) ఆరోపిస్తున్నారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి చంద్రబాబు పలు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ..గత వైసీపీ సర్కార్ ఫై విమర్శలు చేస్తున్న తరుణంలో..జగన్ ఈరోజు తాడేపల్లిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు కూటమి సర్కార్ ఫై నిప్పులు చెరిగారు.

కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు, నేరాలు , దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. రాష్ట్రం పురోగతివైపు పోతోందా? లేదా రివర్స్ పోతుందా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఆలోచలన చేయాల్సిన అవసరం ఉందని , బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని..ఇంత జరుగుతున్న అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని జగన్ నిప్పులు చెరిగారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్న బడ్జెట్ ప్రవేశపెట్టలేని అధ్వాన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. పూర్తి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదు అని ఎద్దేవా చేసారు. సాధారణ బడ్జెట్ పెడితే హామీలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుందని.. హామీలకు నిధులు కేటాయించకపోతే ప్రజలు రోడ్డెక్కుతారని చంద్రబాబు పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం లేదని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల టైమ్‌లో ఏపీ అప్పులు రూ.14 లక్షల కోట్లంటూ చంద్రబాబు ప్రచారం చేసారు..అదే సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఎలా హామీ ఇచ్చారణ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పుల గురించి ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇటీవల గవర్నర్ ప్రసంగంలో అప్పులను రూ.10 లక్షల కోట్లకు తగ్గించారని చెప్పారని.. గవర్నర్ ప్రసంగంలో చెప్పించిన అప్పు కూడా పూర్తిగా అబద్ధమన్నారు.

సీఎం గా చంద్రబాబు బాధ్యతలు తీసుకునే నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ఉన్న అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్లు మాత్రమేనన్నారు జగన్. 2014లో రాష్ట్రానికి రూ.లక్షా 18 వేల కోట్ల అప్పు ఉంటే.. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ప్రభుత్వానికి నేరుగా ఉన్న అప్పు రూ. 2 లక్షల 71 వేల 798 కోట్లకు పెరిగిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఆ అప్పు రూ. 5 లక్షల 18 వేల కోట్లు అయిందన్నారు.

ఇక విద్యుత్ సంస్థలకు బకాయిల విషయానికి వస్తే… చంద్రబాబు 2014లో అధికారంలోకి రాకముందు అప్పు రూ.26 వేల కోట్లుగా ఉంటే.. ఆయన దిగిపోయేనాటికి (2019) రూ.64 వేల 676 కోట్లకు చేరిందన్నారు. ఇక ఐదేళ్ల పాల‌న పూర్తిచేసుకొని వైసీపీ దిగిపోయే నాటికి ఆ అప్పు రూ.లక్షా 11 వేల 864 కోట్లకు పెరిగిందన్నారు జగన్. 2019లో తాను అధికారంలోకి వచ్చే నాటికే ఏపీకి రూ.4 లక్షల 8 వేల కోట్ల అప్పు ఉందని, ఐదేళ్ల త‌రువాత వైసీపీ ప్ర‌భుత్వం దిగిపోయే నాటికి రూ.7 లక్షల 48 వేల కోట్లు అప్పులున్నాయన్నారు. 2014 – 19 మధ్య అప్పుల గ్రోత్‌ 21 శాతంగా ఉంటే.. తన హయాంలో అది కేవలం 12.90 శాతం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు కంటే తమ హయంలోనే తక్కువ అప్పులు చేశామని ఫైనల్ గా జగన్ చెప్పుకొచ్చారు.

Read Also : Almond: బాదం పప్పులను నానబెట్టి మాత్రమే ఎందుకు తినాలో తెలుసా?

Follow us