Jagan’s brother in law : బామ్మ‌ర్ది మీద బ్ర‌ద‌ర్ అనిల్ రివ‌ర్స్ పాలిట్రిక్స్

Jagan's brother in law : రివ‌ర్స్ గిఫ్ట్ జ‌కీయాల్లో మ‌న‌కు వినిపించే మాట‌లు.కేసీఆర్ రివ‌ర్స్ గిప్ట్ చంద్ర‌బాబునుహెచ్చ‌రించారు.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 02:30 PM IST

Jagan’s brother in law : రివ‌ర్స్ గిఫ్ట్, రివ‌ర్స్ టెండ‌ర్ త‌ర‌చూ రాజ‌కీయాల్లో మ‌న‌కు వినిపించే మాట‌లు. తెలంగాణ సీఎం కేసీఆర్ రివ‌ర్స్ గిప్ట్ ఇస్తానంటూ చంద్ర‌బాబును 2019 ఎన్నిక‌ల్లో హెచ్చ‌రించారు. ఆ రోజు నుంచి ఆ ప‌దానికి ప్రాచుర్యం ల‌భించింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రివ‌ర్స్ టెండ‌ర్ అంటూ చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన ప‌నుల‌న్నింటినీ ఆపించేశారు. ఫ‌లితంగా రివ‌ర్స్ టెండ‌ర్ అనే ప‌దం పాపుల‌ర్ అయింది. తాజాగా బ్ర‌ద‌ర్ అనిల్ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద రివ‌ర్స్ అటాక్ మొద‌లు పెట్టారు.

బ్ర‌ద‌ర్ అనిల్ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద రివ‌ర్స్ అటాక్ (Jagan’s brother in law)

బ్ర‌ద‌ర్ అనిల్ (Jagan’s brother in law) సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బామ్మ‌ర్ది. మ‌త ప్ర‌భోద‌కుడు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలుపుకోసం కీ రోల్ పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాస్ట‌ర్ల‌ను ఒక‌చోట‌కు చేర్చ‌డంలో ఆయ‌న పాత్ర కీల‌కం. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు గంప‌గుత్త‌గా ప‌డ‌డానికి ఆయ‌న చేసిన స‌హ‌కారం మ‌రువ‌లేనిది. సాలిడ్ గా క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు వైసీపీ వైపు మ‌ళ్ల‌డానికి చ‌ర్చ్ ల‌ను కేంద్రంగా చేసుకుని ఆయ‌న చేసిన వ్యూహాలు అంద‌రికీ తెలిసిన‌వే. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో 151 మంది ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగారు.

బామ్మ‌ర్దిని టార్గెట్ చేయ‌డానికి మార్గాల‌ను బ్ర‌ద‌ర్ అనిల్ అన్వేష‌ణ

సీన్ క‌ట్ చేస్తే, కుటుంబ ప‌రంగా విభేదాలు వైఎస్ కుటుంబంలో పొడ‌చూపాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. ఆ క్ర‌మంలో బ్ర‌ద‌ర్ అనిల్(Jagans’s brother in law) ప్రోత్సాహంతో ష‌ర్మిల కొత్త పార్టీ పెట్టారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ద్వారా పాద‌యాత్ర‌ను తెలంగాణ వ్యాప్తంగా చేశారు. కానీ, ఫ‌లితం ఆశించిన విధంగా లేదు. దీంతో బామ్మ‌ర్దిని టార్గెట్ చేయ‌డానికి మార్గాల‌ను బ్ర‌ద‌ర్ అనిల్ అన్వేష‌ణ చేశారు. ఆ క్ర‌మంలో ఏపీకి వెళ్లారు. అక్క‌డి ఫాస్ట‌ర్లు కొంద‌రితో స‌మ్మేళ‌నాల‌ను నిర్వ‌హించారు. ఏపీ రాష్ట్రంలోనూ ష‌ర్మిల పార్టీని విస్త‌రింప చేయాల‌ని అనుకున్నారు. ఆ మేర‌కు సంకేతాలు కూడా ఇచ్చారు. ఒకానొక సంద‌ర్భంగా మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను కూడా తీసుకున్నారు. ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌ను అధ్య‌య‌నం చేయ‌డానికి కొన్ని పుస్త‌కాల‌ను కూడా అప్ప‌ట్లో ఉండ‌వ‌ల్లి నుంచి సేక‌రించారు. స్వ‌ర్గీయ వైఎస్ ఆర్ ఆత్మీయుల‌తో భేటీ నిర్వ‌హించారు. ఇదంతా బామ్మ‌ర్దికి రివ‌ర్స్ అటాక్ ఇవ్వ‌డానికేనంటూ ప్ర‌చారం జ‌రిగింది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌వాను అడ్డుకోవడానికి కాంగ్రెస్ మ‌ద్ధ‌తు అవ‌స‌ర‌మ‌ని బ్ర‌ద‌ర్ అనిల్

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని న‌డ‌ప‌లేమ‌ని బ్ర‌ద‌ర్ అనిల్ (Jagan’s brother in law)నిర్థారించుకున్న‌ట్టు తెలుస్తోంది. పైగా ష‌ర్మిల పాద‌యాత్ర‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అడ్డుకుంది. ఆ రోజు నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను బ్ర‌ద‌ర్ అనిల్ అన్వేషించ‌డం మొద‌లు పెట్టార‌ట‌. అప్పుడు వ‌చ్చిన ఆలోచ‌న కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం అంటూ లోట‌స్ పాండ్ వ‌ర్గాల్లోని టాక్‌. అంత‌ర్జాతీయంగా బ్ర‌ద‌ర్ అనిల్ కు క్రిస్టియ‌న్ లాబీయింగ్ ఉంది. దాని ద్వారా సోనియాగాంధీ సెంట్రిక్ గా పార్టీ విలీనం బీజం ప‌డింద‌ని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాబోవు రోజుల్లో ష‌ర్మిల‌కు కీల‌క ప‌ద‌వుల‌ను ఇవ్వ‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీ బ‌లం పెంచుకోవాల‌ని ఆ పార్టీ చూస్తోంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌వాను అడ్డుకోవడానికి కాంగ్రెస్ మ‌ద్ధ‌తు అవ‌స‌ర‌మ‌ని బ్ర‌ద‌ర్ అనిల్ భావించిన‌ట్టు స‌మాచారం. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ చెప్పే రివ‌ర్స్ టెండ‌ర్ త‌ర‌హాలో రివ‌ర్స్ పాలిట్రిక్స్ చేయ‌డానికి బామ్మ‌ర్ది సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

Also Read : Jagan manifesto : ఫోన్‌, టీవీ రీచార్జి ఫ్రీ మేనిఫెస్టో? జ‌గ‌న్ కు రిల‌యెన్స్ స‌హ‌కారం!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీల‌క ప‌ద‌విని ష‌ర్మిల కోరుకుంటున్నారు. బ్ర‌ద‌ర్ అనిల్ కూడా అదే ఆలోచ‌న‌తో ఉన్నారు. అయితే, ఏపీ ఎన్నిక‌ల్లో మాత్రం ష‌ర్మిల‌ను కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌చారానికి పంప‌డానికి సిద్ద‌ప‌డ్డార‌ట‌. అదే జ‌రిగితే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఉన్న సాలిడ్ ఓటు బ్యాంకు బ‌ద్ద‌లుగా చీలిపోయే అవ‌కాశం క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది. అప్పుడు రివ‌ర్స్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద బ్ర‌ద‌ర్ అనిల్ (Jagan’s brother in law) క‌సితీర్చుకున్న‌ట్టు అవుతోంది. అందుకే, బామ్మ‌ర్ది మీద  బ్ర‌ద‌ర్ అనిల్ రివ‌ర్స్ అటాక్ కోసం అడుగులు వేస్తున్నార‌ని క్రిస్టియ‌న్ స‌మాజంలోని టాక్‌.

Vijayawada:కేశినేని YCPలోకి?బెజ‌వాడ రాజ‌కీయ ర‌చ్చ‌