మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ తిరుమల టూర్ టెన్షన్ పెడుతుంది. తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ వివాదం సాగుతున్న క్రమంలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ (Jagan) తిరుమల సందర్శనకు వస్తుండడం ఏంజరుగుతుందో అనే ఆందోళన నడుస్తుంది. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 27న సాయంత్రం మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసారు. ఈరోజు సాయంత్రం రేణుగుంట కు వచ్చి..అక్కడి నుండి తిరుపతికి చేరుకొని మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఈ తరుణంలో వైసీపీ కీలక ఆరోపణ చేసింది. తిరుపతి లో జగన్ ఫై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. శ్రీవారి దర్శనార్థం ఈరోజు సాయంత్రం తిరుమలకి జగన్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో ఆయనపై దాడికి భానుప్రకాశ్ రెడ్డి (బీజేపీ), కిరణ్ రాయల్ (జనసేన), టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు వైసీపీ తన ట్వీట్‌లో పేర్కొంది. జగన్ వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోందని పేర్కొంది. తిరుమలలో జగన్ పర్యటనతో లడ్డు ఇష్యూలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్రబాబు? అంటూ వైసీపీ ప్రశ్నించింది. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
మరోపక్క తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిందని విమర్శించారు. జగన్ తిరుమల రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అర్హత జగన్‌కు లేదని తెలిపారు. జగన్ పర్యటనను నిరసిస్తూ ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలుపుతామని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఆలయాలను అపవిత్రం చేశారని విమర్శించారు. కాగా, తిరుపతిలో సేవ్ తిరుమల.. సేవ్ టీటీడీ సమావేశం జరిగింది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు స్వామీజీలు డిమాండ్ చేశారు. మరోపక్క వైసీపీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున తిరుపతి కి చేరుకుంటున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఇరు పార్టీలు పెద్ద ఎత్తున నువ్వా..నేనా అంటూ సై అంటుండడం తో ఏంజరుగుతుందో అనే టెన్షన్ పెరుగుతుంది.
Read Also : Saif Ali Khan : ఆయన ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు: సైఫ్ అలీఖాన్