Jagan : లక్ష మందిని చంపటమే జగన్ లక్ష్యం – లోకేశ్ ట్వీట్

Jagan's aim is to kill one lakh people - Nara Lokesh Tweet : 'అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపి, 5 ఊర్ల నామరూపాలు లేకుండా చేశారు.

Published By: HashtagU Telugu Desk
Lokesh Prakasham Jagan

Lokesh Prakasham Jagan

Jagan’s aim is to kill one lakh people – Nara Lokesh Tweet : ప్రకాశం బ్యారేజ్ గేట్లను (Prakasam Barrage Gates Damaged) బోట్లు ఢీకొట్టిన ఘటనలో పెద్ద కుట్ర దాగి ఉందని అధికార పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కావాలనే బోట్లను బ్యారేజ్ లోకి వదిలినట్లు నేతలు అంటున్నారు. ఈ ఘటన కు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. రాంమోహన్, ఉషాద్రి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ బోట్లు తమవేనని ఇప్పటివరకూ ఎవరూ రాకపోవడంతో ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని పోలీసులు సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు నివేదిక అందించారు. బ్యారేజు ఢీకొట్టిన పడవలు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ (MLC Talasila Raghuram ), మాజీ ఎంపీ నందిగం సురేష్​ (Ex MP Nandigam Suresh) అనుచరుల బోట్లుగా గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్​, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకున్నారని నివేదికలో పేర్కోవడం జరిగింది. దీనిపై జగన్ నోరు విప్పాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)ట్విట్టర్ వేదికగా కీలక ట్వీట్ చేసారు. ప్రకాశం బ్యారేజీ కూల్చి లక్ష మందికిపైగా ప్రజలను చంపటమే జగన్ లక్ష్యమని లోకేష్ ఆరోపించారు. ‘అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపి, 5 ఊర్ల నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేసి, విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాలు లేకుండా చేయాలని పన్నిన కుట్ర బట్టబయలైంది’ అని ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ ఫై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Read Also : Car Safety: ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు.. ఎలాంటి దొంగ అయినా మీ కారు దొంగలించలేడు?

  Last Updated: 10 Sep 2024, 02:16 PM IST