Site icon HashtagU Telugu

AP : థియేటర్ లో జగన్ యాడ్ కనిపించగానే చెప్పులు విసురుతున్నారు …

Jagan's Ad Is Seen In The Theatre, They Are Throwing Sandals

Jagan's Ad Is Seen In The Theatre, They Are Throwing Sandals

ఏపీ ప్రజలు జగన్ ఫై ఎంత కసిగా ఉన్నారో..ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే అర్ధం అవుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తెలుగు ప్రజలకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమధ్య లేనప్పటికీ ప్రతి ఒక్కరు ..ప్రతి రోజు ఏదో సందర్భంలో రాజశేఖర్ రెడ్డి ను తలుచుకుంటుంటారు. అలాంటి వైస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే ఆయనపై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకుంటారో చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో అలాగే ఏపీ ప్రజలు నమ్మకం పెట్టుకొని ఓటు వేశారు. ఎన్నికల హామీలు చేయడం..వైస్ పాలన ను అందిస్తానని చెప్పడం తో అంత నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత అంత మారిపోయింది.

అధికారంలోకి వచ్చిన జగన్..పరదాలు చాటుకే అంకితం అయ్యారు. ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు కానీ అవేవి కూడా ప్రజలకు అందలేకపోయాయి. ఇక అభివృద్ధి గురించి ఎంత చెప్పిన తక్కువే..రోడ్లు సరిగా లేవు..నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు..కొత్త పరిశ్రమలు రాలేదు..ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి…రాష్ట్రం అప్పుల్లో కురుకపోయింది..ఇలా జగన్ పాలన అస్తవేస్తంగా ఉండడం తో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా..ఎప్పుడెప్పుడు ఓట్ల రూపంలో ప్రతీకారం చూపిద్దామా..అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా వారు ఎంత ఆగ్రహంగా ఉన్నారో..సింపుల్ గా ఈ కింది వీడియోస్ చూస్తే అర్ధం అవుతుంది. త్వరలో ఎన్నికలు రాబోతుండడం తో వైసీపీ..ప్రచారాన్ని ముమ్మరం చేసింది..ఏ ఫ్లాట్ ఫామ్ ను వదిలిపెట్టకుండా కోట్లాది రూపాయిలు ప్రచారానికి వాడుతున్నారు. ఇక థియేటర్లను సైతం వదిలిపెట్టడం లేదు. సినిమా కు ముందు , ఇంటర్వెల్ టైం లలో ప్రభుత్వం అభివృద్ధి అంటూ యాడ్స్ వేస్తుంది. ఇవి రాగానే ప్రేక్షకులు చెప్పులు విసిరేస్తూ తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Read Also : Income Tax: దేశంలో రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం పొంద‌తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఎంతంటే..?