Birth Day: సొమ్ము ప్ర‌జ‌ల‌ది, వేడుక‌లు జ‌గ‌న్ వి! అంబ‌రాన్నంటిన‌ సంబురం!

ఢిల్లీ నుంచి గ‌ల్లీ, అమెరికా నుంచి ఆంధ్రా వ‌ర‌కు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన(Birth day).

  • Written By:
  • Updated On - December 21, 2022 / 03:32 PM IST

ఢిల్లీ నుంచి గ‌ల్లీ, అమెరికా నుంచి ఆంధ్రా వ‌ర‌కు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన(Birth day) వేడుకుల‌ను జ‌రుపుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు భ‌క్తిని చాటుకుంటూ సంద‌డి చేస్తున్నారు. ఇదంతా ఆయ‌న మీద ఉన్న వ్య‌క్తిగ‌త అభిమానం అనుకోవ‌చ్చు. కానీ, మునుపెన్న‌డూ ఏ రాష్ట్ర సీఎంకు చేయ‌ని విధంగా సంబురాల‌ను(celebrations) చేయ‌డమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున నిధుల‌ను కేటాయిస్తూ ఆయ‌న పుట్టిన రోజును(Birth Day) స‌ర్ణోత్స‌వంగా జ‌రిపించుకోవ‌డం విప‌క్షాల‌కే కాదు స‌గ‌టు పౌరునికి ఆగ్ర‌హం క‌లిగిస్తోంది.

జగన్ పుట్టినరోజు సందర్భంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను(celebrations)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ గ‌త కొద్ది రోజులుగా జ‌రుపుతోంది. అన్ని జిల్లాల్లోని వేదిక‌ల‌పై మంత్రి రోజా డాన్సులు అద‌ర‌గొట్టారు. ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం విదిత‌మే. జిల్లాల వారీగా మంత్రి రోజా వివిధ కళారూపాల ప్రదర్శనలతో సంబ‌రాల‌ను హైలెట్ చేశారు. అందుకోసం రెండు కోట్ల రూపాయలను ప్ర‌భుత్వం కేటాయించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా అయింది.

జన్మదిన వేడుక‌ల‌ను..(Birth day)

ప్ర‌తి ఏడాది డిసెంబ‌ర్ 21వ తేదీన జగన్ జన్మదిన వేడుక‌ల‌ను ఆయ‌న అభిమానులు జ‌రుపుతారు. ఆ సంద‌ర్భంగా ఏవో కొన్ని కార్య‌క్ర‌మాల‌ను పెట్టుకుంటారు. కానీ, ఈ ఏడాది స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌లంటూ హంగామా చేశారు. ఈనెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వ‌హించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈనెల 20 న పెట్టారు. 21వ తేదీన సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు అధిష్టానం షెడ్యూల్ ఇచ్చింది. ఆయ‌న 50వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా రూ. 10లకు పోస్ట్ కార్డ్ ను అభిమానులు విడుద‌ల చేశారు. దీంతో జగన్ జన్మదినం సందర్భంగా కేవలం పది రూపాయలు చెల్లిస్తే త‌పాలాశాఖ జగన్ కి శుభాకాంక్షలు పంపే ఈ పోస్ట్ కార్డ్ ద్వారా అవకాశాన్ని క‌ల్పించారు. మ‌రో వైపు ర‌క్త‌దానం చేస్తూ కొన్ని సామాజిక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. మొత్తానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదినం భారీ కార్యక్రమాలతో అమెరికా నుంచి ఆంధ్రా వ‌ర‌కు సంద‌డి క‌నిపించింది.

సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,59, 564 మంతి విద్యార్థులకు, 57,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్ లు పంపిణీ జ‌రిగింది. మొత్తం 9,703 పాఠశాలల్లో వారం రోజుల్లో ట్యాబ్ ల పంపిణీ పూర్తి చేసేలా షెడ్యూల్ పెట్టారు. 8వ తరగతిలోకి అడుగు పెట్టే ప్రతీ విద్యార్థికి బైజూస్ కంటెంట్ తో త‌యారు చేసిన ట్యాబ్ అందించారు. పుట్టిన రోజు సంద‌ర్భంగా పంచి పెడుతున్న ట్యాబ్ లు కాదంటూనే ప్ర‌తి ఏడాది ఇదే డేట్ న ట్యాబ్ లు పంచుతామ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

 ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు

సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారుల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌ల్లో పాల్గొనేలా వైసీపీ ప్లాన్ చేసింది. ఫ‌క్తు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం మాదిరిగా పుట్టిన రోజు వేడుక‌ల‌ను డిజైన్ చేశారు. అందుకు నిధుల‌ను కూడా ప్ర‌భుత్వం ఇవ్వ‌డం అధికార దుర్వినియోగానికి ప‌రాకాష్ట‌గా విప‌క్షాలు భావిస్తున్నాయి. పుట్టిన రోజు సందర్భంగా సొంత మీడియాకు చెందిన సాక్షి పత్రిక, సాక్షి టీవికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పేరుతో భారీగా యాడ్స్ ఇచ్చుకున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆరోపించారు. ఈ ప్రకటనల పేరుతో రూ.50 కోట్లు అక్రమంగా ఆర్జించారని ధ్వ‌జ‌మెత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ తన సంక్షేమమే ప్రజా సంక్షేమమని జగన్‌రెడ్డి గట్టిగా భావిస్తున్నాడ‌ని చెప్ప‌డానికి పుట్టిన రోజు వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు చేయ‌డాన్ని ప్ర‌త్య‌క్ష ఉదాహరణగా యనమల ఎత్తిచూపుతున్నారు.

బ‌హుశా భార‌త దేశ చ‌రిత్ర‌లో సీఎం హోదాను ఉప‌యోగించుకుని పుట్టిన రోజు వేడుక‌ల‌ను చేసుకున్న సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే మిగిలిపోతారేమో. ఇదే విష‌యాన్ని విప‌క్షాలు చెబుతూ ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు వేడుక‌ల‌కు ఖ‌ర్చు పెట్టిన ప్ర‌జాధ‌నం వివ‌రాల‌ను చెబుతున్నారు. ఏపీలోని రోడ్ల దుస్థితి, జీతాలు స‌కాలంలో ఇవ్వ‌లేని ప్ర‌భుత్వ వాల‌కాన్ని నిల‌దీస్తున్నారు. ఆర్థిక ప‌రిస్థితులు బాగాలేవ‌ని చెబుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత `భ‌జ‌న` కోసం ప్ర‌జాధ‌నాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖ‌ర్చు పెట్ట‌డం చ‌రిత్ర‌లో నిలిసిపోయే ఈవెంట్ గా పోల్చుతున్నారు. కొత్త ఒర‌వ‌డిని రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చిన ఏపీ సీఎంకు `జ‌య‌హో జ‌గ‌న్` అంటూ కితాబు ఇస్తూ విప‌క్షాలు వంగ్యాస్త్రాల‌ను విసురుతున్నారు.

Also Read : YS Jagan Vs Teachers : టీచ‌ర్ల‌తో జ‌గ‌న్ క‌బ`డ్డీ`!