Cabinet : మంత్రివ‌ర్గానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్లాస్‌! ప్ర‌క్షాళ‌న సంకేతాలు!

అక్ర‌మాల‌పై మంత్రుల‌కు(Ministers) సీఎం క్లాస్ పీకార‌ని తెలుస్తోంది. మంత్రివ‌ర్గం(Cabinet)లో ప‌లు అంశాల‌కు ఆమోదం తెల‌ప‌డంతో పాటు దిశానిర్దేశం చేశారు.

  • Written By:
  • Updated On - December 14, 2022 / 03:53 PM IST

అవినీతి, అక్ర‌మాల‌పై మంత్రుల‌కు(Ministers) సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్లాస్ పీకార‌ని తెలుస్తోంది. మంత్రివ‌ర్గం(Cabinet) స‌మావేశంలో ప‌లు అంశాల‌కు ఆమోదం తెల‌ప‌డంతో పాటు రాబోవు ఎన్నిక‌ల నాటికి ఎలా సిద్ధం కావాలో దిశానిర్దేశం చేశారు. ఆ క్ర‌మంలో భూ క‌బ్జాలు, రియ‌ల్ ఎస్టేట్ మాఫీయాల‌కు దూరంగా ఉండాల‌ని సూచించార‌ని స‌మాచారం. ఇటీవ‌ల మంత్రి జ‌యరామ్ భూ మ‌ఫియా వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం అందరికీ తెలిసిందే. విశాఖ కేంద్రంగా కొంద‌రు మంత్రులు(Ministers), మాజీ మంత్రుల మీద భూముల ఆక్ర‌మ‌ణ‌ల ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జ‌గ‌న‌న్న కాల‌నీలు ఏర్పాటు సంద‌ర్భంగా ప‌లు జిల్లాల్లో మ‌ట్టి, భూ మాఫియా న‌డిపిన ప‌లువురు వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం ర‌చ్చకెక్కిన విష‌యం స‌ర్వ‌త్రా తెలిసిందే. తాజా స‌ర్వేల ఆధారంగా వాళ్ల గ్రాఫ్ ప‌డిపోయిన విష‌యాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్ర‌హించార‌ట‌. అందుకే, మంత్రివ‌ర్గ(Cabinet) స‌మావేశంలో కొంద‌రు మంత్రుల‌ను ఉద్దేశించి క్లాస్ పీకార‌ని స‌చివాల‌య వ‌ర్గాల్లోని టాక్.

జిల్లా అధ్య‌క్షుల‌ను క‌లుపుకుని మంత్రులు ప‌నిచేయాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంత్రివ‌ర్గం (Cabinet) స‌మావేశంలో దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. అంటే, పార్టీని, ప్ర‌భుత్వాన్ని స‌మాంతరంగా తీసుకెళ్ల‌డానికి ఆయ‌న బాటలు వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వానికి, పార్టీకి మ‌ధ్య స‌మ‌న్వ‌యం లోపించిన విష‌యాన్ని గ‌మ‌నించిన ఆయ‌న ప్ర‌తి ప‌ని జిల్లా వైసీపీ అధ్య‌క్షుల‌కు తెలియ‌చేసి ఆ త‌రువాత చేయాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. అంతేకాదు, మంత్రులు గ‌డ‌ప‌, గ‌డ‌ప‌కు వెళ్లాల‌ని ఆదేశించార‌ట‌. ఇప్ప‌టికే ఆ ప్రోగ్రామ్ ముగిసిన‌ప్ప‌టికీ ప‌లు చోట్ల ఫీడ్ బ్యాక్‌ పాజిటివ్ గా లేద‌ని స‌ర్వేల ద్వారా తెలుసుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆ ప్రోగ్రామ్ ను ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగించాల‌ని మంత్రుల‌కు సూచించార‌ని తెలిసింది. ప్ర‌ధానంగా మంత్రులు నిర్వ‌హించిన బ‌స్సు యాత్ర‌(బీసీ భేరి) ఫెయిల్ అయిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ, రాబోవు రోజుల్లో మంత్రులు యాక్టివ్ గా ఉండాల‌ని దిశానిర్దేశం చేశార‌ని తెలుస్తోంది.

న‌వ‌ర‌త్నాల‌కు సంబంధించిన అంశాల‌కు..

మంత్రులు స్వ‌యంగా నాడు-నేడు కార్య‌క్ర‌మంలో భాగంగా విద్యార్థుల‌కు ట్యాబ్‌ లు పంచాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆయ‌న జ‌న్మ‌దినం రోజు (ఈనెల‌21)న సుమారు 5లక్ష‌ల ట్యాబ్‌ ల‌ను విద్యార్థుల‌కు అంద‌చేసే కార్య‌క్ర‌మాన్ని మంత్రులు స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాల‌ని డైరెక్ష‌న్ ఇచ్చార‌ని తెలుస్తోంది. న‌వ‌ర‌త్నాల‌కు సంబంధించిన అంశాల‌కు ఆమోదం తెలిపారు. పెన్ష‌న్ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి 2,750 రూపాయ‌లు చేస్తూ మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. ఉపాధ్యాయుల‌ను బోధ‌నేత‌ర విధులకు దూరంగా ఉంచుతూ కీల‌క ఆమోదం మంత్రివ‌ర్గం తెలిపింది. పెన్ష‌న్ పెంపు, ఆస‌రా ప‌థ‌కాల పంపిణీ కార్య‌క్ర‌మాల్లో విధిగా మంత్రులు పాల్గొనాల‌ని ఆదేశించారు.

ప‌లు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు, క‌డ‌ప స్టీల్ ప్లాంట్ ను జిందాల్ తో క‌లిసి నిర్మించ‌డానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆదానీ, షిర్డీసాయి ప్రాజెక్టుల ఏర్పాటు, క‌డప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ల్యాండ్ అండ్ ప‌ట్టాదార్ పాస్ బుక్ చ‌ట్టాన్ని స‌వ‌రిస్తూ క్యాబినెట్‌ నిర్ణ‌యం తీసుకుంది. నాడు-నేడు కార్య‌క్ర‌మంలో భాగంగా స్కూల్స్ కు టీవీలు, 8వ త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు ఈ కంటెంట్ అంద‌చేయ‌డానికి మంత్రివర్గంలో నిర్ణ‌యం తీసుకున్నారు. బాప‌ట్ల‌, ప‌ల్నాడు అర్బ‌న్ డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

వైసీపీ పార్టీని స‌మ‌న్వ‌యం చేసేలా..

సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలుపుతూ ప్ర‌భుత్వాన్ని , వైసీపీ పార్టీని స‌మ‌న్వ‌యం చేసేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. రాబోవు రోజుల్లో మంత్రుల న‌డవ‌డిక ఎలా ఉండాలో క్లాస్ తీసుకున్నార‌ని తెలుస్తోంది. అంటే, మూడోసారి క్యాబినెట్ విస్త‌ర‌ణ ఉండే అవ‌కాశం ఉంద‌న్న సంకేతాలు ప‌రోక్షంగా ఇచ్చారు. ఇప్పుడున్న కొంద‌రు మంత్రుల తీరుపై ఆయ‌న అసంతృప్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది. స‌ర్వేల ఆధారంగా దారుణంగా గ్రాఫ్ ప‌డిపోయిన మంత్రులు న‌లుగురు ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

వాళ్ల న‌లుగురిని సాగ‌నంప‌డానికి వ‌చ్చే ఏడాది మ‌రోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేసే అవ‌కాశం ఉంద‌ని మంగ‌ళ‌వారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంత్రుల‌కు తీసుకున్న క్లాస్ ఆధారంగా అర్థమ‌వుతోంది. సంక్రాంతి త‌రువాత మూడోసారి క్యాబినెట్ విస్త‌ర‌ణ ద్వారా ఎన్నిక‌ల టీమ్ ను సిద్ధం చేసుకోవాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. రెండో విడ‌త విస్త‌ర‌ణ త‌రువాత మూడో విడ‌త ప్ర‌క్షాళ‌న కూడా ఉంటుంద‌ని సూచాయ‌గా ఆయ‌న చెప్పిన విష‌యం విదిత‌మే. వాటికి బ‌లం చేకూరేలా మంగ‌ళ‌వారం జ‌రిగిన మంత్రివ‌ర్గం స‌మావేశంలో ఆయ‌న ఇచ్చిన సంకేతాలు ఎన్నిక‌ల టీమ్ ఏర్పాటుకు త్వ‌ర‌లోనే సిద్ధం అవుతున్నార‌ని గ్ర‌హించ‌వ‌చ్చు.

Also Read:  BRS Alliance : బీఆర్ఎస్, వైసీపీ పొత్తు? కేసీఆర్ కు జై కొట్టిన స‌జ్జ‌ల‌!