Varma : చంద్రబాబు, పవన్‌ సమక్షంలో జగన్‌ టీడీపీలో చేరుతారు..వర్మ కీలక వ్యాఖ్యలు

Svsn Varma: మాజీఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ(tdp) నియోజకవర్గ ఇంచార్జ్‌ ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ సోమవారం పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌(jagan)పై కీలక వ్యాఖలు చేశారు. పిఠాపురంలో వైసీపీ(ycp)కి ఓటమి ఖాయమని.. కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తి అయ్యాక చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమక్షంలో జగన్ టీడీపీలో చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే […]

Published By: HashtagU Telugu Desk
Jagan Will Join Tdp In The

Jagan will join TDP in the presence of Chandrababu and Pawan.. Verma key comments

Svsn Varma: మాజీఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ(tdp) నియోజకవర్గ ఇంచార్జ్‌ ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ సోమవారం పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌(jagan)పై కీలక వ్యాఖలు చేశారు. పిఠాపురంలో వైసీపీ(ycp)కి ఓటమి ఖాయమని.. కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తి అయ్యాక చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమక్షంలో జగన్ టీడీపీలో చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయిన వర్మ.. పవన్ కల్యాణ్ కోసం ఈ సారి తన సీటును త్యాగం చేసిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారంటూ వస్తోన్న వార్తలపై ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోకి వెళ్తున్నట్లు జరగుతోన్న ప్రచారమంతా అవాస్తవమని కొట్టిపారేశారు. పార్టీ మారుతున్నట్లు వైసీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను చంద్రబాబు మనిషినని తేల్చి చెప్పారు. 2014 నుండి తనను వైసీపీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. కానీ అది జరగని పని స్పష్టం చేశారు.

Read Also: Akshay Kanti Bam : బీజేపీలో చేరిన కాంగ్రెస్ అభ్యర్థి.. నామినేషన్ విత్‌డ్రా

కాగా, పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఎస్వీఎస్ఎన్ వర్మ భావించారు. కానీ, పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. ఇక్కడ్నించి బరిలో దిగుతున్నట్టు పవన్ ప్రకటించగా, వర్మ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నచ్చచెప్పడంతో వర్మ శాంతించారు. ఈ నేపథ్యంలో ఇటివల పవన్‌తో వర్మ భేటీ అయ్యారు.

  Last Updated: 29 Apr 2024, 01:59 PM IST