కర్మ ఫలమో, కక్షో అర్థం కావడం లేదు. క్వి డ్ ప్రో కో కింద చంద్రబాబు (Chandrababu) మీద కేసు నమోదు అయింది. ఆయన ఉంటున్న ఉండవల్లి ప్రాంతంలోని ఇళ్లు ను అటాచ్ చేసింది జగన్ (CM Jagan) ప్రభుత్వం. కరకట్టపై చంద్రబాబు గెస్ట్‌హౌస్ అటాచ్ చేసిన ప్రభుత్వం క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో చర్యలు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని అభియోగం. చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలిందని అధికారులు చెబుతున్నారు. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగం మోపారు.
వ్యాపారి లింగమనేని అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై అభియోగం నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. చట్టం ప్రకారం ఆయన ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ చేశామని తెలిపింది.
Also Read: UP civic body polls 2023: వారణాసి మేయర్ పీఠం బీజేపీదే
క్విడ్ ప్రోకో కేసులు జగన్ మీద అప్పట్లో మోపారు. ఆయన ఆస్తులన్ని క్విడ్ ప్రోకో రూపంలో సంపాదించారని సీబీఐ విచారణ జరుగుతుంది. ఇదే విషయాన్ని పుస్తకాల రూపంలో టీడీపీ అప్పట్లో ప్రచురించింది. లక్ష కోట్లు క్విడ్ ప్రో కో చేసి సంపాదించారని టీడీపీ ఆరోపణ. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. ఇదే సమయంలో చంద్రబాబు మీద క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయడం కక్ష్య సాధింపు అంటూ టీడీపీ చెబుతుంది. చట్టం అందరికి ఒకటే అంటూ జగన్ సర్కార్ అంటుంది. ఇది కక్ష్య ? లేక కర్మ ఫలమోగానే ఏపీ పాలన పలు విమర్శలు ఎదుర్కొంటుంది.