Jagan : చండీయాగాన్ని పూర్తి చేసిన జగన్..మరోసారి సీఎం అయినట్లేనా..?

గత 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేప‌ల్లి లోని తన ప్యాలెస్ లో శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం చేస్తూ వచ్చారు

  • Written By:
  • Publish Date - May 15, 2024 / 07:56 PM IST

రాజకీయ నేతలు ఎక్కువగా పూజలు , యాగాలు చేస్తూ..రాజకీయాల్లో రాణించాలని భావిస్తారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (EX CM KCR) కూడా ఎక్కువగా చండీయాగాలు చేస్తుండేది..అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా పలు యాగాలు చేసారు. ఈ యాగాల వల్లే కేసీఆర్ రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారని..అందుకే ఆయనకు తిరుగులేకుండా ఉందని అంత భావించారు. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ను యాగాలు కూడా గెలిపించలేకపోయాయి అని మాట్లాడుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సంగతి పక్కన పెడితే..ఏపీ సీఎం జగన్ (Jagan) సైతం ఇటీవల యాగాలు , పూజలు , వాస్తు మార్పులు వంటివి చేస్తూ రావడం అందర్నీ ఆశ్చర్యం వేస్తుంది. గత 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేప‌ల్లి లోని తన ప్యాలెస్ లో శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం చేస్తూ వచ్చారు. ఈరోజుతో ఈ యాగం పూర్తి అయ్యింది. ఈ సంద‌ర్భంగా జగన్ నివాసంలో జగన్‌కు వేద‌పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అంద‌జేశారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి దంపతులు రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో సహస్ర చండీయాగం నిర్వ‌హించారు.

ఈ యాగంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని, ప్రజాహిత పాలన కొనసాగాలని, జగన్ మరోసారి సీఎం కావాలని కోరుతూ ఈ యాగం చేసారు. అయితే ఈ యాగం వల్ల నిజంగా జగన్ మరోసారి సీఎం కాబోతున్నారా..? ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందా..? అని అంత మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా జగన్ ఇలాంటి యాగాలు చేసినట్లు ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఈసారి జగన్ యాగాలు చేసేసరికి అంత మాట్లాడుకుంటున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎన్నికల ముందు పలు యాగాలు చేసారు. సో మరి ఈ యాగాలు ఎవరికీ విజయం అందిస్తాయో చూడాలి.

Read Also : Vishwambhara : ‘విశ్వంభర’ లో మరో నటి..?

Follow us