Site icon HashtagU Telugu

AP : జగన్ కు షాకిచ్చిన ఈసీ…ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్ర ఉండకూడదంటూ ఆదేశాలు..!!

Polavaram

Jagan Imresizer

ఏపీలోని జగన్ సర్కార్ కు మరో షాకిచ్చింది ఈసీ. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వాలంటీర్ల పాత్ర ఉండకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరిగే గ్రాడ్యుయేషన్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రమేయం ఉండకూడదని ఈసీ ఆఫీసర్ ఎంకే మీనా స్పష్టం చేశారు.

ఈ మేరకు ఈసీ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అభ్యర్థులు కంచర్ల శ్రీకాంత్ చౌదరి, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించి ఈ సూచనలను చేసింది. దీంతో జగన్ ప్రభుత్వానిక గట్టి దెబ్బ తగిలినట్లయ్యింది. ఈసీ నిర్ణయంపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.