Site icon HashtagU Telugu

Jagan Warning :ఎమ్మెల్యేలకు జగన్ హెచ్చరిక..పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తాం

Jagan Warning

Jagan Warning

ఏపీలో రాజకీయాలు ఎంతలా వేడెక్కాయి చూపాల్సిన పనిలేదు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest ) తర్వాత రాష్ట్ర రాజకీయాలన్నీ వన్ సైడ్ గా మారాయి. చంద్రబాబు అరెస్ట్ ను యావత్ ప్రజలు ఖండిస్తూన్నారు..ఇదే క్రమంలో వైసీపీ (YCP) ఫై వ్యతిరేకత భారీగా పెరిగింది. అంతే కాకుండా రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన (TDP-Janasena) కలిసి పోటీ చేయబోతున్నట్లు అధికారికం అయ్యింది. దీంతో వైసీపీ సర్కార్..ఎమ్మెల్యేల ఫై దృష్టి సారించారు. నేడు మంగళవారం సీఎం జగన్..ఎమ్మెల్యేలతో గడప గడపకూ సమీక్ష (Gadapa Gadapaku Samiksha) సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోని 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు పనిచేయాలని, ఎమ్మెల్యేల పనితీరు బట్టే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని జగన్ సూచించారు. టికెట్ రాని వాళ్ళు అసంతృప్తికి గురికావద్దని ముందే జగన్ చెప్పేశారు. వై…ఏపీ నీడ్స్ జగన్ అనే కొత్త కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా పాల్గొనాలని తెలిపారు. రాబోయే రోజులు చాల కీలకమని , గేర్ మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనంలోకి తీసుకువెళ్లాలని సీఎం సూచించారన్నారు. ఈ నెల 29న జగనన్న సురక్ష కార్యక్రమం సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. 45 రోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇక తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జరిగిన ఈ స‌మావేశానికి వైసీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్లు, జిల్లా అధ్య‌క్షులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌తో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరయ్యారు.

Read Also : AP : జైల్లో దోమలు కుట్టక..రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా? – చంద్రబాబు ఫై నాని సెటైర్లు