Site icon HashtagU Telugu

Jagan warning : 18 మంది ఎమ్మెల్యేలు ఔట్, గ్రాఫ్ ఉంటేనే టిక్కెట్..!

Jagan Warning

Jagan Warning

ఎమ్మెల్యేల‌తో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క స‌మావేశం ముగిసింది. గ్రాఫ్ బాగాలేక‌పోతే జాత‌కం తారుమారు అవుతుంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan warning)హెచ్చ‌రించారు. రాబోవు ఎన్నిక‌ల్లో స‌ర్వేల ప్ర‌కారం టిక్కెట్ల ఉంటాయ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. మొహమాటంలేకుండా గ్రాఫ్ బాగుంటేనే టిక్కెట్ ఇస్తాన‌ని చెప్పేశారు. ఈ స‌మావేశానికి కొంద‌రు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. గ‌డ‌ప‌,గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి 18 మంది దూరంగా ఉన్నార‌ని తేల్చారు.

ఎమ్మెల్యేల‌తో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క స‌మావేశం (Jagan warning )

గ్రాఫ్ పెంచుకోవ‌డానికి చివ‌రి ఛాన్స్ ఇవ్వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan warning) సిద్ద‌మ‌య్యారు. అంతేకాదు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ను వ్య‌క్తిగ‌తంగా అంద‌రికీ పంపించే ఏర్పాట్లు చేశారు. అబో యావ‌రేజ్ కంటే ఎక్కువ‌గా ఉన్న వాళ్ల‌ను మాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌న్న సంకేతం ఇచ్చేశారు. వాళ్ల‌కు మాత్ర‌మే టిక్కెట్ ఉంటుంద‌ని తేల్చాశారు. టిక్కెట్ రాలేద‌ని త‌న‌ను బాధ్యుడ్ని చేయొద్ద‌ని సున్నితంగా మంద‌లించారు.

జ‌గ‌న్ సుర‌క్ష ప‌థ‌కాన్ని రూప‌క‌ల్ప‌న

జ‌గ‌న్ సుర‌క్ష ప‌థ‌కాన్ని రూప‌క‌ల్ప‌న చేశారు. ఆ ప‌థ‌కంకు గురించి చెప్ప‌డానికి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని ఆదేశించారు. ఇదే చివ‌రి అవ‌కాశంగా చెప్పేశారు. ఈ ప‌థ‌కాన్ని తీసుకెళ్ల‌డంలో వెనుక‌బ‌డితే టిక్కెట్ రావడం క‌ష్ట‌మ‌ని తేల్చేశారు. ఈనెల 23వ తేదీ నుంచి ప్ర‌తి ఇంటికి ఎమ్మెల్యేలు వెళ్లాల‌ని దిశానిర్దేశం చేశారు. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో క‌నీసం 50 నుంచి 70 మంది ప‌నితీరు సంతృప్తిక‌రంగా లేద‌ని స‌ర్వే రిపోర్ట్ లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. వాటిని మీటింగ్ లో ఇవ్వ‌కుండా వ్య‌క్తిగ‌తంగా పంపిస్తామ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan warning)ఎమ్మెల్యేల‌కు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఎమ్మెల్యేల్లో క‌నీసం 50 నుంచి 70 మంది ప‌నితీరు సంతృప్తిక‌రంగా

ఇటీవ‌ల మూడుసార్లు మీటింగ్ లు పెట్టిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యే ప‌నితీరు మార‌లేద‌నే అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం ప్రోగ్రామ్ ద్వారా గ్రాఫ్ పెరిగింద‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. అయితే, కొంద‌రు సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌డంతో కొంద‌రి గ్రాఫ్ బాగాలేద‌ని(Jagan warning) భావిస్తున్నారు. క‌నీసం జ‌గ‌న్ సుర‌క్ష పథ‌కం ను ప్ర‌మోట్ చేయ‌డానికి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని ఆదేశించారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటోన్న 18 మంది ఎమ్మెల్యేల‌ను పిలుచుకుని మాట్లాడ‌డానికి సిద్ద‌మ‌య్యారు. కానీ, వాళ్లు దూరంగా ఉన్నార‌ని తెలుస్తోంది.

Also Read : Jagan’s brother in law : బామ్మ‌ర్ది మీద బ్ర‌ద‌ర్ అనిల్ రివ‌ర్స్ పాలిట్రిక్స్

ప్ర‌స్తుతం జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. దానిలో భాగంగా జూలై 1వ తేదీన పౌర‌సేవ‌ల‌కు సంబంధించిన 11 ర‌కాల సేవ‌ల‌ను తీర్చ‌డానికి సిద్ద‌మ‌య్యారు. ఆ రోజున వార్డు, గ్రామ వ‌లంటీర్లు, కార్య‌ద‌ర్శులు అంద‌రూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ ప‌రిష్క‌రించ‌బోతున్నామ‌ని ఎమ్మెల్యేల‌కు వివ‌రించారు. ఈనెల 24న ఈ సేవ‌ల మీద అవ‌గాహ‌న క‌లిగించ‌డానికి వ‌లంటీర్లు, స‌చివాల‌యం ఉద్యోగులు వెళతార‌ని చెప్పారు. నాలుగు వారాల పాటు ప్ర‌త్యేక క్యాంపుల‌ను నిర్వ‌హించ‌డం ద్వారా 11 ర‌కాల సేవ‌ల‌ను త‌క్ష‌ణం ప‌రిష్క‌రించ‌బోతున్నామ‌ని వెల్ల‌డించారు.

Also Read : CBN-Jagan : చంద్ర‌బాబుపై జ‌గ‌న్ మాన‌సిక దాడి

కుల, నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్లతో పాటు ఆదాయ ధ్రువీకరణ, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, మరణ ధ్రువీకరణ, మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌, మ్యుటేషన్‌ ఫర్‌ కరక్షన్స్‌, మ్యారేజ్, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌, కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ), కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో సభ్యుల పేర్ల తొలగింపు త‌దిత‌ర 11 సేవ‌లు ఈ క్యాంపులలో ఉచితంగా అందజేస్తారు. వినతుల స్వీకరణ, రిజిస్ట్రేషన్లు, వెరిఫికేషన్, సర్వీసు రిక్వెస్టులకు వేరువేరు డెస్క్‌లను ఏర్పాటు చేస్తారు. అయితే, మ్యుటేషన్‌ ఆఫ్‌ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్‌ పుస్తకాల జారీకి స్టాట్యుటరీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

తొమ్మిది నెల‌ల్లోనే ఎన్నిక‌లు రాబోతున్నాయ‌ని ఆయ‌న ఎమ్మెల్యేల‌కు దిశానిర్దేశం (Jagan warning)

మ‌రో తొమ్మిది నెల‌ల్లోనే ఎన్నిక‌లు రాబోతున్నాయ‌ని ఆయ‌న ఎమ్మెల్యేల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ తొమ్మిది నెల‌ల పాటు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ప్ర‌జ‌ల‌కు వీలున్నంత ఎక్కువ‌గా అందుబాటులో ఉండాల‌ని ఆదేశించారు. అదే స‌మ‌యంలో ఎవ‌రు ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటారో వాళ్ల‌కు టిక్కెట్ ఇవ్వలేన‌ని(Jagan warning) స్ప‌ష్టత‌నిచ్చారు. ఇక మీ ఇష్ట‌మంటూ ముక్తాయించ‌డం ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న బ‌య‌లుదేరింది.

Also Read : Jagan Once more :`మ‌రో ఛాన్స్`దిశ‌గా జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్