Jagan Vote for Note : `కాపునేస్తం`లో చంద్ర‌బాబు జైలు!!

Jagan Vote for Note : బ‌ట‌న్ నొక్కే కాపునేస్తం కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు జైలు అంశాన్ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌స్తావించారు.

  • Written By:
  • Updated On - September 16, 2023 / 01:36 PM IST

Jagan Vote for Note : బ‌ట‌న్ నొక్కే కాపునేస్తం కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు జైలు అంశాన్ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌స్తావించారు. లండ‌న్ ప‌ది రోజుల ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన త‌రువాత తొలిసారిగా ఈ ప్ర‌స్తావ‌న తెచ్చారు. ఆధారాల్లేని కేసు పెట్టార‌ని స‌ర్వ‌త్రా ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ టీడీపీకి సానుభూతి వ‌స్తుంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం పాత కేసుల‌ను కూడా తిర‌గ‌తోడుతున్నారు. ప్ర‌ధానంగా తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన నోటుకు నోటు కేసును బ‌య‌ట‌కు తీశారు. ఆ కేసులోని పూర్వ ప‌రాల‌ను `కాపునేస్తం` బ‌ట‌న్ నొక్కే ప్రోగ్రామ్‌లో రివీల్ చేయ‌డం గ‌మ‌నార్హం.

నోటుకు నోటు కేసు పూర్వ ప‌రాల‌ను `కాపునేస్తం` ప్రోగ్రామ్‌లో ..(Jagan Vote for Note)

ప‌క్కా ఆధారాల‌తో దొరికిన దొంగ చంద్ర‌బాబు అంటూ ఓటుకు నోటు కేసును (Jagan Vote for Note) బ‌య‌ట పెట్టారు. వాస్త‌వంగా ఆ కేసు తెలుగుదేశం పార్టీ మ‌నుగ‌డ‌ను మార్చేసింది. అప్ప‌టి వ‌ర‌కు తెలంగాణలో టీడీపీ బ‌లంగా ఉండేది. హ‌ఠాత్తుగా ఏపీకి చంద్ర‌బాబు మ‌కాం మార్చారు. హైద‌రాబాద్ ను వ‌దిలేశారు. ఉమ్మ‌డి రాజ‌ధానికిగా హైద‌రాబాద్ 2024 వ‌ర‌కు ఉన్న‌ప్ప‌టికీ వ‌దిలి వెళ్లారు . ఆ కేసు న‌మోదు అయ్యే వ‌ర‌కు మూడు రోజులు హైద‌రాబాద్, మూడు రోజులు విజ‌య‌వాడ‌, ఒక రోజు ఢిల్లీలో ఉండేలా షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నారు. కానీ, ఆ కేసు త‌రువాత విజ‌య‌వాడ‌కు చంద్ర‌బాబు పరిమితం అయ్యారు. తెలంగాణ‌లో పార్టీని దాదాపుగా వ‌దిలేశారు. ఏదో నామ‌మాత్రంగా మాత్ర‌మే ఉంద‌ని అనిపించారు. ఆ కేసులో ఏమి జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే.

చంద్ర‌బాబుకు అనుకూల న్యూస్ సంస్థ‌ల‌పై సీఐడీ

పాత కేసును (Jagan Vote for Note) బ‌య‌ట‌కు తీస్తూ స్కిల్ డ‌వ‌లెప్మెంట్ కేసు కూడా నిజ‌మైన‌దే అనే భావాన్ని క‌లిగించే ప్ర‌య‌త్నం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్నారు. అంతేకాదు, ఈ కుంభ‌కోణం ద్వారా ఒక సెక్ష‌న్ ఆఫ్ మీడియా ల‌బ్దిపొందింద‌ని బాంబ్ పేల్చారు. అదే ఇప్పుడు చంద్ర‌బాబు త‌ప్పును కూడా ఒప్పుగా చూపిస్తోందని ఆరోపించారు. ఆ మీడియా సంగ‌తి కూడా చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా చంద్ర‌బాబుకు అనుకూలంగా న్యూస్ ను ప్ర‌జెంట్ చేస్తోన్న సంస్థ‌ల‌పై ఏపీ స‌ర్కార్ క‌న్నేసింది. ఏపీ సీఐడీ నోటీసుల‌ను జారీ చేయ‌డానికి సిద్ద‌మ‌యింది.

Also Read : Congress : కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక కేసీఆర్ చ‌ర్ల‌ప‌ల్లి జైలుకే : మాజీ మంత్రి పొన్నాల

ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్ర‌మే స్కిల్ కేసులో చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌డాన్ని స‌మ‌ర్థిస్తూ మాట్లాడారు. ఇప్పుడు నేరుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌హిరంగ వేదిల‌పై స్పందించ‌డం రాజ‌కీయాన్ని వేడిక్కిస్తోంది. ఒక వైపు స్కిల్ కేసులో ప‌స‌లేద‌ని టీడీపీ చెబుతోంది. ప‌క్కా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌క్ష పూరితంగా పెట్టిన కేసుగా ప్రొజెక్ట్ చేస్తోంది. అందుకోసం జాతీయ మీడియా వ‌ద్ద‌కు కూడా వెళ్లింది. పేరుమోసిన జాతీయ ఛాన‌ళ్ల వ‌ద్ద నిజాయితీని ప్ర‌జెంట్ చేసేందుకు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ప్ర‌త్యేకంగా వెబ్ సైట్ క్రియేట్ చేసి స్కిల్ స్కీమ్ లోని నిజాల‌ను బ‌య‌ట పెడుతోంది. ఫ‌లితంగా సామాన్యులు కూడా అక్ర‌మ కేసుగా చ‌ర్చించుకుంటున్నారు. ఈ ప‌రిణామాన్ని గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌హిరంగ వేదిల‌పై ప్ర‌స్తావిస్తూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో  (Jagan Vote for Note) ఇదే ప్ర‌ధానాంశంగా మ‌లుచుకుంటున్నారు. అందుకోసం ఓటుకు నోటు కేసును అస్త్రంగా ప్ర‌యోగించ‌డం కొస‌మెరుపు.

Also Read : AP : టీడీపీ-జనసేన పొత్తుపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు