Jagan triple game : సింహం సింగిల్ కాదు..త్రిబుల్ ! వై నాట్ 175 లెక్కే వేరు.!!

ఏపీ రాజ‌కీయాల్లో ఒకే ఒక్క‌డు (Jagan triple game)క్లారిటీగా ఉన్నాడు. .

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 02:56 PM IST

ఏపీ రాజ‌కీయాల్లో ఒకే ఒక్క‌డు (Jagan triple game)క్లారిటీగా ఉన్నాడు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సింగిల్ గా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యారు. బీజేపీ అండ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ ఈసారి సింగిల్ గా వెళ్తానంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అంతే, ధైర్యం ప్ర‌తిప‌క్షాల‌కు ఉందా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. వై నాట్ 175 అంటూ నిన‌దిస్తున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందా? అంటూ నిల‌దీస్తున్నారు. ఇక జ‌న‌సేన ఒక పార్టీ కాద‌నే రీతిలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు. ఆ పార్టీ టీడీపీ కోసం పుట్టింద‌ని ఆరోపిస్తున్నారు. ఆయ‌న ఎందుకు వై నాట్ 175 నినాదం తీసుకున్నారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ రాజ‌కీయాల్లో ఒకే ఒక్క‌డు (Jagan triple game)

సంక్షేమ ప‌థ‌కాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌మ్ముకున్నారు. ఆ ప‌థ‌కాల‌ను తీసుకుంటున్న ల‌బ్దిదారులు 3.90ల‌క్ష‌ల మంది ఉన్నార‌ని అంచ‌నా వేస్తున్నారు. వాళ్ల‌లో 87 శాతం మంది ప్ర‌జ‌లు వైసీపీ ఉన్నార‌ని స‌ర్వేల చెబుతున్నాయ‌ట‌. అందుకే, వై నాట్ 175 అంటూ నినాదాన్ని అందుకున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. ప్రస్తుతం సామాజిక పెన్ష‌న్ల‌ను తీసుకుంటోన్న ల‌బ్దిదారులు 65 ల‌క్ష‌ల మంది ఉన్నారు. అలాగే, అమ్మ ఒడి లబ్ది దారులు 45 లక్షలు. రైతు భరోసా ల‌బ్దిదారులు 24 లక్షలు, పేదలకు ఇళ్ల పథకంలో 31 లక్షల మంది ల‌బ్దిదారులు ఉన్నార‌ని లెక్క వేస్తున్నారు. వీటితో పాటు వాహన మిత్ర, లా నేస్తం, జగనన్న చేదోడు త‌దిత‌ర ప‌థ‌కాల‌ లబ్దిదారులు ఉన్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ప్ర‌స్తుతం సానుకూలంగా (Jagan triple game)  ఉన్నాయ‌ని విశ్వ‌సిస్తున్నారు.

87 శాతం మంది ప్ర‌జ‌లు వైసీపీ వైపు ఉన్నార‌ని లెక్క‌లు

ఇలాంటి లెక్క‌ల్ని 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ వినిపించింది. ప్ర‌తి వేదిక‌పైనా చంద్ర‌బాబునాయుడు 80శాతం మంది ప్ర‌జ‌లు టీడీపీ వైపు ఉన్నార‌ని ప్ర‌క‌టించారు. తాను వేసిన రోడ్లపై తిరుగుతూ, తానిచ్చిన మంచినీళ్లు తాగుతూ, తాను ఇస్తోన్న ప‌థ‌కాల‌ను అనుభ‌విస్తూ ఓట్లు ఎందుకు వేయరు? అంటూ ప్ర‌శ్నించారు. సీన్ క‌ట్ చేస్తే, 23 మంది ఎమ్మెల్యేల‌కు టీడీపీ ప‌రిమితం అయింది. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా 87 శాతం మంది ప్ర‌జ‌లు వైసీపీ వైపు ఉన్నార‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. అధికారులు గ‌తంలో చంద్ర‌బాబునాయుడికి చెప్పిన‌ట్టే ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చెబుతున్నారు. ఫ‌లితాలు ఎలా ఉంటాయి?  (Jagan triple game)  అనేది ఆస‌క్తిక‌రం.

 Also Read : Jagan warning : 18 మంది ఎమ్మెల్యేలు ఔట్, గ్రాఫ్ ఉంటేనే టిక్కెట్..!

ఏపీలోని విప‌క్షాల మ‌ధ్య ఐక్య‌త‌లేదు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోయేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. అందుకోసం బీజేపీ, బీఆర్ఎస్ అండ‌ను తీసుకుంటోంది. తెర‌వెనుక వైసీపీ, బీజేపీ, బీఆర్ఎస్ ఒక‌టే. ఆ విష‌యం స‌ర్వ‌త్రా తెలిసిందే. పైకి పొత్తులు లేక‌పోయిన‌ప్ప‌టికీ తెర వెనుక ఇచ్చిపుచ్చుకునే స్నేహం ఆ మూడు పార్టీల మ‌ధ్య ఉంది. వాటి ద్వారా జ‌నసేన పార్టీని పొత్తుకు వెళ్ల‌కుండా ఆపాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. అదే జ‌రిగితే, ముక్కోణ‌పు పోటీ ఉంటుంది. ఫ‌లితంగా రెండోసారి సీఎం కావ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అవ‌కాశం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ కూడా అదే కావాల్సింది. సో..జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లోగానీ, రాబోయే ఎన్నిక‌ల్లోగానీ సింహం సింగిల్ గా వెళ్ల‌డంలేదు. ప‌రోక్షంగా బీఆర్ఎస్, బీజేపీ మ‌ద్ధ‌తు (Jagan triple game) ఉంద‌న్న‌మాట‌. అందుకే, వై నాట్ 175 అంటూ ఆశ‌లు పెట్టుకున్నారు.

Also Read : BJP-YCP : చ‌క్ర‌బంధంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్