Site icon HashtagU Telugu

Jagan Target : అధినేతల ఓటమి పైనే సీఎం జగన్ ఫోకస్ అంత..

Jagan Target

Jagan Target

ఏపీ ఎన్నికలపైనే అందరి దృష్టి. ఈసారి ఏపీలో ఎవరు విజయం సాదిస్తారనేదానిఫై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సంక్షేమ పథకాలు జగన్ ను గట్టెక్కిస్తాయా..? అభివృద్ధి చంద్రబాబు ను గెలిపిస్తుందా..? అనేదానిపై అంత మాట్లాడుకుంటున్నారు. ఇక ఇరు పార్టీలు సైతం గెలుపు ఫై ధీమా గా ఉంటూనే అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. జగన్ ను ఓడించాలంటే సింగిల్ గా వెళ్తే సరిపోదని పొత్తులతో బరిలోకి దిగుతున్నారు చంద్రబాబు..ఇటు జగన్ సైతం ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు పదును పెడుతూ..ప్రత్యర్థి పార్టీల అడుగుజాడలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా ఈసారి ప్రతిపక్ష పార్టీల అధినేతలను టార్గెట్ (Jagan Target) గా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఎలాగైతే జనసేన అధినేత (Pawan Kalyan) ను రెండు చోట్ల ఓడించామో..ఈసారి కూడా ఆయన ఎక్కడ నిల్చుంటే అక్కడ బలమైన నేతలు బరిలోకి దింపు ఓడగొట్టాలని చూస్తున్నారు. అలాగే చంద్రబాబు (Chandrababu) ను సైతం ఈసారి ఓడించి చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు. ఇక మంగళగిరి లోని మరోసారి లోకేష్ (Lokesh) ను ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఇన్చార్జిని‌ మార్చేసింది.

గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్య పేరుని‌ ప్రకటించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ తొలుత భీమవరం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరగడం తో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి కి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు పవన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని..భీమవరం కాకుండా పిఠాపురం నుండి పోటీ చేయాలనీ చూస్తున్నాడు. దీంతో అక్కడ కాపు నేత ముద్రగడ ను బరిలోకి దింపేందుకు చూస్తున్నారు జగన్. మొత్తం మీద జగన్ ప్రతిపక్ష పార్టీల అధినేతలను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి జగన్ లక్ష్యం తీరుతుందో లేదో చూడాలి.

Read Also : Rameswaram Cafe : పున: ప్రారంభమైన ‘రామేశ్వరం కేఫ్’ సర్వీసులు