Jagan Tapping : ఏపీ పోలీస్ కు ఇర‌కాటం,జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి`ట్యాపింగ్ `సంక‌టం!

నిఘా వ్య‌వ‌స్థ(Jagan Tapping) ప్రాణంలాంటిది. తేడా వస్తే, ప్ర‌భుత్వాలు క‌దిలిపోతాయి.

  • Written By:
  • Updated On - February 1, 2023 / 01:47 PM IST

ప్ర‌భుత్వాల‌కు నిఘా వ్య‌వ‌స్థ(Jagan Tapping) ప్రాణంలాంటిది. అక్క‌డ ఏ మాత్రం తేడా వస్తే, ప్ర‌భుత్వాలు క‌దిలిపోతాయి. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి ఏపీ ప్ర‌భుత్వంలో క‌నిపిస్తోంది. లా అండ్ ఆర్డ‌ర్ (Law and Order) రాష్ట్రంలో లేద‌ని రెండేళ్ల క్రిత‌మే హైకోర్టు జ‌స్టిస్ రాకేష్ కుమార్ చెప్పారు. రూల్ ఆఫ్ లా ఎక్క‌డ క‌నిపించ‌డంలేద‌ని ఆందోళ‌న చెందారు. ఆ త‌రువాత ఆయ‌న బ‌దిలీ అయ్యారు. సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ను కూడా త‌ప్పుబడుతూ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లేఖ రాసిన విష‌యం విదిత‌మే. సొంత పార్టీ ఎమ్మెల్యేలు నోరుపారేసుకుంటున్న స‌మ‌యంలో వ‌స్తోన్న వ్య‌తిరేక‌త‌ను ప‌సిగ‌ట్టాల్సిన నిఘా వ్య‌వ‌స్థ దాదాపుగా ప‌డ‌కేసింది. ఫ‌లితంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ ప‌డిపోయింది. ఆ విష‌యాన్ని తాజాగా ఇండియా టుడే సీ-ఓట‌ర్‌, ఐ ప్యాక్ కూడా చెప్పేసింద‌ని తెలుస్తోంది.

నిఘా వ్య‌వ‌స్థ దాదాపుగా ప‌డ‌కేసింది..(Jagan Tapping)

సాధార‌ణంగా ప్ర‌తిరోజూ ఉద‌యం ఇంటిలిజెన్స్ చీఫ్(Jagan Tapping) ఇచ్చే నివేదికను పాల‌నాధిప‌తులు ప‌రిశీలిస్తారు. స‌మీక్ష చేసిన త‌రువాత దైనందిన పాల‌న‌కు వెళ‌తారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత నిఘా వ్య‌వ‌స్థ స‌రిగా లేద‌ని గ‌త మూడేళ్ల పాల‌న బేరీజు వేసుకుంటే అర్థ‌మ‌వుతోంది. ఛ‌లో విజ‌య‌వాడ సంద‌ర్భంగా టీచ‌ర్లు, ఉద్యోగుల ధ‌ర్నా, ఆందోళ‌న నిఘా వ‌ర్గాల వైఫ‌ల్యాన్ని (Law and Order) ప్ర‌స్పుటం చేసింది. న‌ష్ట నివార‌ణ‌లో భాగంగా ఆనాడున్న డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ను మార్చేశారు. సొంత సామాజిక‌వ‌ర్గం, క‌డ‌ప జిల్లాకు చెందిన రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ఆ ప‌ద‌విని అప్ప‌గించారు. అప్ప‌టి వ‌ర‌కు ఏసీబీ చీఫ్ గా ఉన్న సీతారాంజ‌నేయుల‌ను ఇంటిలిజెన్స్ చీఫ్ గా నియ‌మించారు. స్వ‌త‌హాగా ముక్కుసూటి ఐపీఎస్ అధికారి సీతారామాంజ‌నేయులు. తెలుగుదేశం పార్టీ హ‌యాంలో ఎస్పీగా ప‌నిచేసిన ఆయ‌న టీడీపీ ఫ్యాక్ష‌నిస్ట్ ల‌ను టార్గెట్ చేశారు. ఆ రోజుల్లో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్ప‌టికీ ఏ మాత్రం వెర‌వ‌కుండా ప‌ల్నాడు టీడీపీ లీడ‌ర్ల‌ను ఒక ఆట ఆడుకున్నారు.

Also Read : Jagan : కోడిక‌త్తి కేసు కీల‌క మ‌లుపు! జ‌గ‌న్‌ హాజ‌రు కావాల‌ని ఎన్ఐఏ కోర్టు ఆదేశం!!

ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో సీతారామాంజ‌నేయులు నిఘా వ్య‌వ‌స్థ అధిప‌తిగా ఉన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌త్యేక విమానం లోపాలు బ‌య‌ట‌ప‌డిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీరియ‌స్ గా ఉన్నారు. నిఘా వ్య‌వ‌స్థ మీద మండిప‌డ్డార‌ని తెలుస్తోంది. అంతేకాదు, డీజీపీని కూడా మార్చేస్తార‌ని టాక్ తాడేప‌ల్లి వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న రాజేంద్ర‌నాథ్ స్థానంలో సీఐడీ చీఫ్ గా చేసిన సునీల్ కుమార్ ను నియ‌మిస్తార‌ని తాజాగా వ‌స్తోన్న ప్ర‌చారం. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. అంతేకాదు, సీతారామాంజనేయులు టార్గెట్ గా వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి వాయిస్ వినిపించారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టార‌ని దుమారం

తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా ఫోన్ ట్యాపింగ్ వ్య‌వహారం న‌డుస్తోంది. ఇజ్రాయిల్ దేశం నుంచి అన‌ధికారికంగా కొనుగోలు చేసిన‌ ప్ర‌త్యేక పరిక‌రాన్ని ఉప‌యోగించి ట్యాపింగ్ జ‌రుగుతుంద‌ని ఓటుకునోటు కేసు బ‌య‌ట‌పడిన‌ప్ప‌టి నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్మేల కొనుగోలు అంశంలోనూ ఫోన్ ట్యాపింగ్ బ‌య‌ట ప‌డింది. దానిపై తెలంగాణ హైకోర్టులో కేసు న‌డుస్తోంది. అంతేకాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై ట్యాపింగ్ ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. అందుకే, ఎమ్మెల్యేల క‌ద‌లిక‌లు అన్నీ కేసీఆర్ కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుస్తున్నాయ‌ని ప్ర‌త్యర్థులు చెబుతుంటారు. ఇప్పుడు ఏపీలోనూ కేసీఆర్ బ్ర‌ద‌ర్ గా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టార‌ని దుమారం రేగుతోంది.

Also Read : Jagan : కోడిక‌త్తి కేసు కీల‌క మ‌లుపు! జ‌గ‌న్‌ హాజ‌రు కావాల‌ని ఎన్ఐఏ కోర్టు ఆదేశం!!

ఫోన్ ట్యాపింగ్‍ ఆధారాలు బయటపెడుతున్న వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ‌య‌ట పెట్టారు. అంతేకాదు, ఇంటెలిజెన్స్ చీఫ్ నాతో మాట్లాడార‌ని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఆడియో కూడా నిఘాధిప‌తి పంపారని అంటున్నారు. ఫ్రెండ్స్ తో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింద‌ని కోటంరెడ్డి వెల్డించారు. `ఇది ఫోన్ ట్యాపింగ్ కాదా? ఫోన్ ట్యాపింగ్ ఒక్క ఎమ్మెల్యేతో ఆగిపోదు. మంత్రులు, న్యాయమూర్తులు ఐఏఎస్ ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తారు. ఆధారాలు లేకుండా నేను మాట్లాడను` అంటూ మీడియాకు చెప్పారు.

ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు నెంబర్

అంతేకాదు, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు నెంబర్ ను మీడియా సమావేశంలో కోటంరెడ్డి వెల్ల‌డించారు. `ఇంటెలిజెన్స్ చీఫ్ నాతో మాట్లాడారు. నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు చెప్పారు.ఆడియో కూడా నాకు పంపారు – నేను నా ఫ్రెండ్ తో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఇది ఫోన్ ట్యాపింగ్ కాదా?.` అంటూ నిల‌దీశారు. ఇదే విష‌యంపై 35 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు మాట్లాడారని త‌మ‌ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని కోటంరెడ్డి చెప్ప‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. దేనికైనా నేను సిద్ధమ‌ని స‌వాల్ చేస్తూ టీడీపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నా, చంద్రబాబు ఇష్టం ప్రకారం పోటీ చేస్తానంటూ కోటంరెడ్డి వెల్ల‌డించ‌డం స‌రికొత్త ఏపీ రాజ‌కీయానికి నాంది ప‌లుకుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ముక్కుసూటిగా ఉండే సీతారామాంజ‌నేయులు ఎలా రియాక్ట్ కానున్నారు? అనేది ఆస‌క్తిక‌రం.

Also Read : Delhi Jagan : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ `కేస్` స్ట‌డీ ! వివేకా మ‌ర్డ‌ర్ విచార‌ణ మ‌ర్మం!!