Site icon HashtagU Telugu

Bhanu Prakash : రోజాపై వ్యాఖ్యలు అత్యంత హేయం – వైస్ జగన్

YS Jagan

YS Jagan

టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌ (Bhanu Prakash) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేదికపై సంచలనం రేపాయి. రోజా (Roja) పై అత్యంత హేయంగా చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ (Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఓ మహిళను అవమానించడమే కాదు, ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా చేసిన ఈ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల అసలైన మనస్తత్వాన్ని బయటపెడుతున్నాయి” అని జగన్ మండిపడ్డారు. భానుప్రకాశ్‌ను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Wines Bandh : 24 గంటలపాటు హైదరాబాద్లో వైన్స్ బంద్!

జగన్ ఆరోపణల ప్రకారం.. మహిళలపై వ్యక్తిగత దాడులు, అవమానకర వ్యాఖ్యలు చేయడం టీడీపీ పార్టీ సంస్కృతిగా మారిపోయింది. “అంతకుముందే చంద్రబాబు ఒక మహిళపై తీవ్ర ఆరోపణలు చేసి ఉన్నత పదవి పొందారు. అప్పటి నుంచే మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, వారి గొంతు నొక్కే ప్రయత్నాలు టీడీపీ నాయకుల అలవాటుగా మారాయి” అని జగన్ అన్నారు. ఆర్కే రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆమెపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేయడం రాష్ట్రంలో న్యాయవ్యవస్థ యొక్క విచారకర స్థితిని చూపిస్తున్నదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పటికీ, పోలీసుల నిర్లక్ష్యం, మౌనం చూస్తుంటే మహిళలకు రాష్ట్రంలో ఎలాంటి రక్షణ లేదనిపిస్తోంది అని జగన్ వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి ఇతర మహిళా నాయకులకూ ఎదురవుతుందని, రోజా ఒక్కరే లక్ష్యంగా మారలేదన్నారు.

Royal Enfield Bikes : మైలేజ్‌పై అపోహలకు ‘గుడ్‌బై’..రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కొత్త మోడల్స్‌..ధరలు, వాటి వివరాలు..!

ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండించబడాల్సినవి మాత్రమే కాక, దోషులపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని జగన్ స్పష్టం చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఈ స్థాయికి దిగజారితే, ప్రజాస్వామ్యంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించారు.