Jagan strategy :డిసెంబ‌ర్లో AP ఎన్నిక‌లు?

ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి చివ‌రి ఛాన్స్ ఇస్తాన్నా అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యేల‌కు (Jagan trategy) వార్నింగ్ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 01:00 PM IST

తొమ్మిది నెల‌లు మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు టైమ్ ఉంది. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి చివ‌రి ఛాన్స్ ఇస్తాన్నా అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యేల‌కు (Jagan strategy) వార్నింగ్ ఇచ్చారు. కొంద‌రికి టిక్కెట్లు ఇవ్వ‌లేన‌ని తేల్చేశారు. కేవ‌లం 18 మంది మాత్ర‌మేకాదు, మ‌రో 30 మంది లిస్ట్ కూడా ఉంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌నీసం 50 మందికి త‌గ్గ‌కుండా కొత్త మొఖాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌యారు చేశార‌ని వినికిడి. స‌ర్వేల ఆధారంగా అభ్య‌ర్థుల జాబితాను త‌యారు చేసిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌.

చివ‌రి ఛాన్స్ ఇస్తాన్నా అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యేల‌కు వార్నింగ్ (Jagan strategy)

ప్ర‌త్య‌ర్థులు తేరుకోక ముందే ఎన్నిక‌ల‌కు ముగించాల‌న్న ప్లాన్ తో (Jagan strategy) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నార‌ని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ ఎన్నిక‌ల‌కు కూడా ఉంటాయ‌ని అత్యంత విశ్వ‌స‌నీయంగా అందుతోన్న స‌మాచారం. ఇప్ప‌టికే ఢిల్లీ నుంచి క్లియ‌రెన్స్ తీసుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలంగాణ‌తో పాటు ఎన్నిక‌ల‌కు వెళ‌డానికి ఛాన్స్ ఉంది. ఆ విష‌యాన్ని వారాహి వాహ‌నం మీద యాత్ర చేస్తోన్న ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు కూడా ప‌లు సంద‌ర్భాల్లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశారు.

రెండోసారి సీఎం కావ‌డానికి కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డలాగే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం , జ‌గ‌నన్న‌కు చెబుతాం, జ‌గ‌న్ సుర‌క్ష కార్య‌క్ర‌మాలు ముగిసిన త‌రువాత ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నారు. ఆ మేర‌కు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతుంద‌ని తెలుస్తోంది. ఎక్కువ టైమ్ ప్ర‌తిప‌క్షాల‌కు ఇవ్వ‌కుండా డిసెంబ‌ర్లో ఎన్నిక‌లు ముగించాల‌ని యోచిస్తున్నార‌ని వినికిడి. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం ముంద‌స్తు లేద‌ని సంకేతాలు ఇస్తున్నారు. పైకి ఆయ‌న ఆ విధంగా చెబుతున్న‌ప్ప‌టికీ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం అవుతున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. రెండోసారి సీఎం కావ‌డానికి కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డలాగే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan sstrategy) వేయ‌బోతున్నార‌ట‌.

Also Read : Jagan warning : 18 మంది ఎమ్మెల్యేలు ఔట్, గ్రాఫ్ ఉంటేనే టిక్కెట్..!

ప్ర‌భుత్వంలోని అవినీతి, కుంభ‌కోణాల మీద 2018 ఎన్నిక‌ల‌కు ముందుగా కేసీఆర్ మీద ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డ్డాయి. అసెంబ్లీ లోప‌ల‌, వెలుప‌ల హోరెత్తించాయి. ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకుందామంటూ ప్ర‌భుత్వాన్ని హ‌ఠాత్తుగా ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు కేసీఆర్ వెళ్లారు. ప్ర‌తిప‌క్షాలు తేరుకునేలోపు ఎన్నిక‌లను ముగించారు. రెండోసారి సీఎం అయ్యారు. స‌రిగ్గా ఇలాంటి వ్యూహాన్ని అనురిస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  (Jagan trategy)  ముందస్తు ఏర్పాట్లు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

ఒకేసారి తెలంగాణ‌, ఏపీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తే  వ‌ల‌స ఓట‌ర్ల‌ను నివారించ‌డానికి

స‌ర్వేల ప్ర‌కారం ఏపీలో ఉన్న పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంక్షేమ ప‌థ‌కాల‌ను పొందుతున్నారు. వాళ్లు ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్నారు. రాష్ట్రం నుంచి ఉద్యోగ‌, ఉపాథి కోసం వ‌ల‌స వెళ్లిన వాళ్లు మాత్రం ఎక్కువ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద వ్య‌తిరేకంగా ఉన్నారు. ప్ర‌త్యేకించి తెలంగాణ‌కు ఎక్కువ మంది ఏపీ ఓట‌ర్లు వ‌ల‌స వెళ్లారు. వాళ్లంద‌రూ ఎన్నిక‌ల నాటికి రాష్ట్రానికి వ‌స్తే న‌ష్టం ఎక్కువ‌గా ఉంటుంద‌ని వైసీపీకి స‌ర్వే సంస్థ‌లు ఇచ్చిన రిపోర్ట్ గా చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే, ఒకేసారి తెలంగాణ‌, ఏపీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తే చాలా వ‌ర‌కు వ‌ల‌స ఓట‌ర్ల‌ను నివారించ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

తెలంగాణ‌తో ఏపీ ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌ని స‌ర్వేల సారాంశం (Jagan strategy)

సుమారు 10ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఇత‌ర ప్రాంతాల్లో ఏపీ ఓట‌ర్లు నివ‌సిస్తున్నారు. రాష్ట్రంలో ఆస్తులు, నివాసం ఉన్న‌ప్ప‌టికీ ఉపాథి కోసం తెలంగాణ‌కు వ‌చ్చిన వాళ్లు ల‌క్ష‌ల్లోనే ఉన్నారు. ప్ర‌త్యేకించి హైద‌రాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్లు ఎక్కువ‌గా ఏపీ సెటిల‌ర్లు. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు వేస్తూ ఇటీవ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌నిపించారు. అలాంటి వెసుల‌బాటు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నిక‌ల‌కు నిర్వ‌హించ‌డం ద్వారా అటు కేసీఆర్ ఇటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan strategy(లాభ‌ప‌డే ఛాన్స్ ఉంద‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, తెలంగాణ‌తో ఏపీ ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌ని విశ్వ‌సిస్తున్న వాళ్లు ఎక్కువ‌గా ఉన్నారు.

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!

రాష్ట్రంలోని 175 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫైన‌ల్ చేశారు. ఆ జాబితా తాడేప‌ల్లి వ‌ర్గాల వ‌ద్ద ర‌హ‌స్యంగా ఉంద‌ని తెలుస్తోంది. అందుకే, టిక్కెట్ ఇవ్వ‌లేద‌ని బాధ‌ప‌డ‌కండంటూ బుధ‌వారం నిర్వ‌హించిన ఎమ్మెల్యేల స‌మావేశంలో స్ప‌ష్టంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పేశారు. అధికారికంగా 18 సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు ఇచ్చేది లేద‌ని స‌మావేశంలోనే తేల్చేశారు. గ్రాఫ్ బాగాలేని మ‌రికొంద‌రు జాబితా కూడా ఉంది. వ్య‌క్తిగ‌తంగా ఇళ్ల‌కు గ్రాఫ్ వివ‌రాల‌తో పాటు టిక్కెట్ ఎందుకు ఇవ్వ‌డంలేదో తెలియ‌చేస్తూ తాఖీదులు త్వ‌ర‌లోనే ఎమ్మెల్యేలు అందుకోబోతున్నారు. జాబితాలో కనీసం 50 మందికి త‌గ్గ‌కుండా ఉంటార‌ని తెలుస్తోంది. ఇలా ప‌గ‌డ్బందీగా అభ్య‌ర్థిత్వాల విష‌యంలోనూ స్ప‌ష్టంగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan strategy) డిసెంబ‌ర్లో ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Also Read : Jagan’s brother in law : బామ్మ‌ర్ది మీద బ్ర‌ద‌ర్ అనిల్ రివ‌ర్స్ పాలిట్రిక్స్