Site icon HashtagU Telugu

Rushikonda : వామ్మో… రుషికొండ జగన్ ప్యాలెస్ లో 26 లక్షల విలువచేసే బాత్ టబ్

Jagan Spent Rs 26 Lakhs On

Jagan Spent Rs 26 Lakhs On

రుషికొండ (Rushikonda )లో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. కేవలం ఆయన మాత్రమే కాదు మీడియా ను సైతం లోనికి తీసుకెళ్లి అక్కడ ఏంజరిగింది..? జగన్ ఎలా నిర్మించారు..? లోపల ఏమేమి ఉన్నాయి..? వంటివి బయటపెట్టారు. వాటిని చూసి లోపలి వెళ్ళినవారు కాదు మీడియాలో వాటిని చూసిన ప్రజలు సైతం ఆశ్చర్యం , షాక్ కు గురయ్యారు.

ఒకప్పుడు రాజులు నిర్మించుకునే ప్యాలెస్‌కు ఏ మాత్రం తీసిపోకుండా భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఎంత గొప్పగా రుషికొండ ఫై జగన్ ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. కొండ దరిదాపుల్లోకి కూడా ఎవ్వర్నీ రానీయకుండా దాదాపు 500 కోట్ల రూపాయలతో భవనాల నిర్మాణం జరిగింది. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు, కార్యకర్తలు ఇక్కడికి వస్తే అడ్డుకొని వారిపై కేసులు పెట్టారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తో అసలు ఆ ప్యాలెస్‌ లో ఏముందో అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు ఆదివారం వెళ్లారు. ఆ ప్యాలెస్‌లో ఫర్నిచర్​, అడుగు అడుగున బంగారు తొడుగులు చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. కేవలం బాత్ టబ్ కే రూ. 26 లక్షలు ఖర్చు చేసారంటే..ప్రజల సొమ్ము వీరు ఎంతలా వాడుకున్నారో అర్ధం అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ..” అసెంబ్లీలోఅమరావతి రాజధానికి జగన్ మద్దతు ఇచ్చి తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని, . పచ్చటి రుషికొండకు బోడిగుండు కొట్టారని ఎద్దేవా చేశారు. అత్యంత రహస్యంగా వీటిని నిర్మించారని, లాభాల్లోని టూరిజం భవనాలను కూల్చి రాజ భవనాలు నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేవని ప్రజావేదిక భవనాన్ని మాజీ సీఎం జగన్ ప్రభుత్వం కూల్చివేసిందని మరి రుషికొండకు ఏం అనుమతులు ఉన్నాయని కట్టారని ప్రశ్నించారు .

సద్దాం హుసేన్, గాలి జనార్దన్ రెడ్డి భవనాలను మించి ప్రజా ధనంతో వీటిని కట్టారని శ్రీనివాస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 61ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారని, వీటిని ఏం చేయాలోముఖ్యమంత్రి చంద్రబాబును అడిగి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Read Also : Ram Charan : క్లీంకారని సినిమాల్లోకి తీసుకురానంటున్న చరణ్.. కారణం ఏంటంటే..!