Site icon HashtagU Telugu

Memantha Siddham : చంద్రబాబుకు శవరాజకీయాలు, కుట్రలు అలవాటే – జగన్

CM Jagan

Jagan Proddutur

మీమంతా సిద్ధం (Memantha Siddham) సభలో వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫై ఘాటైన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. శవరాజకీయాలు, కుట్రలు చేయడం చంద్రబాబుకు అలవాటు అని..ఇవి చాలవన్నట్లు.. నా చెల్లెలిద్దరిని తీసుకొచ్చుకున్నారని జగన్ ఆరోపించారు. ఆ దేవుడు, ఆ ప్రజల్నే నమ్ముకున్నా.. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నానని .. పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా అని జగన్ ప్రశ్నించారు.

త‌న ఒక్క‌డిపై యుద్ధానికి ప్ర‌తిప‌క్షాల‌న్నీ కలిసి కట్టుగా వస్తున్నాయ‌ని .. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు.. వైయ‌స్ వివేకానంద‌రెడ్డి చిన్నాన్నను చంపారు.. నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారని మండిప‌డ్డారు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైసీపీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడేనని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా అని స్పష్టం చేశారు. విశాఖ డ్రగ్స్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరీ కుంటుంబ సభ్యులే ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

విశాఖ డ్రగ్స్ కేసులో వైసీపీ నాయకులు హస్తం లేకున్నా టీడీపీ, బీజేపీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని జగన్ మండిపడ్డారు. ఎవరెన్ని కష్టాలు పెట్టినా సరే తమ వెంట వైఎస్సార్ జిల్లా ప్రజలు ఉన్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోన్న ప్రభుత్వం తమదని వెల్లడించారు. ఎక్కడ లంచాలు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వ ఎజెండా మన జెండా. 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అన్నారు. ఈ జెండా మరే జెండాతో జత కట్టడంలేదు. ప్రజలే ఎజెండా ఈ జెండా రెపరెపలాడుతుందన్నారు. మే 13న ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి మనందరి పార్టీని గెలిపించండి. పేదల వ్యతిరేక పార్టీలను ఓడించడానికి మీరంతా సిద్దమేనా అని పిలుపునిచ్చారు. ఈ సభ సక్సెస్ కావడం తో వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సహం , గెలుపు ఫై ధీమా పెరిగింది.

Read Also : Viveka Murder Case : వివేకా హత్య ఫై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు