Site icon HashtagU Telugu

AP : పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు – సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

Cm Jagan Kakinada

Cm Jagan Kakinada

ఏపీ సీఎం జగన్ (Jagan) సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రల రాజకీయాలు చేస్తున్నారని .. కుటుంబాలను చీల్చుతున్నారని పరోక్షంగా షర్మిల అంశాన్ని ప్రస్తావించారు. తాను దేవుడిని..ప్రజలను నమ్ముకున్నానని, తన ధైర్యం ప్రజలేనని జగన్ చెప్పుకొచ్చారు. బుధువారం వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక (YSR Pension Kanuka) పెంపు కార్యక్రమం చేపట్టిన జగన్..అనంతరం కాకినాడ (Kakinada)లో రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్‌ రూ.58వేలు మాత్రమే ఇచ్చారని.. ప్రస్తుత ప్రభుత్వంలో రూ.లక్షా 47వేలు అందిస్తున్నామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్‌ పెంచామని, పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే సందర్బంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు. చంద్రబాబు అవినీతిలో పవన్‌ కు కూడా భాగం ఉందన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిలో పార్ట్‌నర్‌ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు” అంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.

చంద్రబాబు, పవన్‌ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు అవినీతి గురించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించాయని..కోర్టులు నిర్దారించాయని జగన్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారని.. పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని , కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే అని చెప్పుకొచ్చారు.

Read Also : BRS Booklet: కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ బుక్ లెట్, 420 హామీలు అంటూ ప్రచారం!