AP : చంద్రబాబు అండ్ కోపై యుద్దానికి నేను సిద్ధం..మీరు సిద్ధమా..? – జగన్

  • Written By:
  • Updated On - February 4, 2024 / 05:33 PM IST

దెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో మరోసారి సీఎం జగన్ (CM Jagan) ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకపడ్డారు. తోడేళ్లన్నీ ఏకమయ్యాయి..ఒంటరి వాడైనా జగన్ ను ఓడించాలని చూస్తున్నాయి..కానీ వాటికీ తెలియదు జగన్ వెనుక ప్రజా సైన్యం ఉందని..ప్రజా సైన్యం ముందు ఎన్ని తోడేళ్ళు కలిసిన ఏమి చేయలేవని..రాబోయే ఎన్నికల యుద్ధంలో మీరు (ప్రజలు) కృష్ణుడైతే నేను అర్జునుడిని. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే ఆయుధాలుగా కౌరవ సైన్యంపై యుద్ధం చేద్దాం. నా కుటుంబ సైన్యమంతా ఇక్కడ కనిపిస్తోంది. పెత్తందారులు ఎవరిపై దాడి చేస్తున్నారో ఆలోచించండి. రామాయణం, మహాభారతంలో విలన్లు చంద్రబాబు (Chandrababu) , (Pawan kalyan ) అండ్ కో రూపంలో ఉన్నారు. వారికి ఉన్న సైన్యం పొత్తులు అయితే.. నాకున్న తోడు, ధైర్యం, బలం.. పైనున్న దేవుడు, ప్రజలు’ అని సీఎం జగన్ ఓ రేంజ్ లో మాట్లాడి ఆకట్టుకున్నారు.

మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 175 కు 175 సాధించాలని జగన్ (Jagan) పట్టుదలతో ఉన్నారు..ఇందుకోసం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓ పక్క అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోపక్క ప్రచారం మొదలుపెట్టారు. సిద్ధం (Siddham ) పేరుతో వరుసగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు శనివారం దెందులూరులో సభ జరిగింది. దాదాపు 110 ఎకరాల్లో ఏర్పటు చేసిన ఈసభకు ప్రజలు పోటెత్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సభలో ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు..ఓ వైపు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే ప్రతిపక్ష పార్టీలు టిడిపి , జనసేన , కాంగ్రెస్ , బిజెపి లపై విరుచుకపడ్డారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా అంటూ జగన్ ప్రజల్లో ఉత్తేజం నింపారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్‌ కో రూపంలో ఉన్నారు. వాళ్లు.. ఆ తోడేళ్ల మంద వైపు నుంచి చూస్తే ఈ సీన్‌ చూస్తుంటే జగన్‌ ఒంటరి వాళ్లలా కనిపిస్తాడు. కానీ, నిజం ఏంటంటే.. ఇక్కడ జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు అయితే.. నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న దేవుడు.. ఈ ప్రజలు అని జగన్‌ భావోద్వేగంగా పేర్కొన్నారు.

అబద్ధాల పునాదుల మీద వాళ్ల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఎన్నికలు ఎందుకు ముఖ్యమో.. అవసరమో.. ప్రతీ ఒక్కరికీ మీరే(పార్టీ కేడర్‌ను ఉద్దేశించి..)చెప్పాలి. ”కేవలం ఒక ఎమ్మెల్యే, ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాదు. ప్రతీ ఒక్కరూ ఈ విషయం గమనించండి. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఈ 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలివి” ప్రతీ ఒక్కరికీ చెప్పాలని పార్టీ కేడర్‌కు సీఎం జగన్‌ సూచించారు.

ఇప్పటికే రూ. 3 వేలు చేసిన పెన్షన్.. 1వ తేదీ ఉదయాన్నే ఈ 3 వేల పెన్షన్ అందాలన్నా, భవిష్యత్లో ఇది పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా.. భవిష్యత్ లో పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, మీ ఊరికే మీ ఇంటికే వైద్యం అందాలన్నా, వైద్యం కోసం ఏ పేదవాడూ అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదన్నా, అది మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ఇంటింటి వెళ్లి చెప్పండి. ఇదిజరగాలి అంటే ఇందుకోసం మన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు అందుకుంటున్న వారు ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని జగన్ చెప్పుకొచ్చారు.

Read Also : Maldives Vs India : ఇండియాను వివరణ కోరిన మాల్దీవ్స్.. ఎందుకో తెలుసా ?