Site icon HashtagU Telugu

Jagan Sketch : కొడాలికి YCP పిడి! గుడివాడ నుంచి ఔట్‌? `వంగ‌వీటి`కి వ‌ల‌..!

Jagan Sketch

Jagan Sketch

మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ కొడాలి నాని స్వ‌ప‌క్షానికి టార్గెట్ (Jagan Sketch) అయ్యారు. ఆయ‌న వాల‌కం సాక్షాత్తు వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా న‌చ్చ‌డంలేదు. గ్రాఫ్ ప‌డిపోయిన ఎమ్మెల్యేల్లో ఆయ‌న ప్ర‌ముఖంగా ఉన్నారని తేల్చారు. స్వ‌చ్చంధంగా త‌ప్పుకోవాల‌ని కొంద‌రికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రివ్యూ మీటింగ్ లో చెప్పేశార‌ట‌. వాళ్ల‌లో కొడాలి(Kodali Nani) నాని కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. తేడా వ‌స్తే ఎవ‌ర్నీ ఉపేక్షించ‌లేని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు మాజీ మంత్రి కొడాలిని ఇంటికి పరిమితం చేయ‌బోతున్నార‌ని టాక్.

కొడాలి నాని స్వ‌ప‌క్షానికి టార్గెట్ (Jagan Sketch)

అతి సామాన్య జీవ‌నం నుంచి మంత్రి హోదాకు ఎదిగిన కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు కు(Kodali Nani) ఊపిరి నంద‌మూరి కుటుంబం. ఆ కుటుంబంలోని స్వ‌ర్గీయ హ‌రికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ల‌లో టాలీవుడ్ అగ్ర హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ముఖులు. జూనియ‌ర్ మీద ఈగ వాల‌కుండా చూసుకునే వాళ్ల‌లో కొడాలి నాని పేరు మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. ఆ విష‌యం అందిరికీ తెలుసు. నంద‌మూరి కుటుంబంలోని కొన్ని అభిప్రాయ‌భేదాలు ప‌రోక్షంగా 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి (Jagan Sketch) బాగా అందొచ్చింది. జూనియ‌ర్ మామ నార్నే శ్రీనివాస‌రావు వైసీపీలో చేరారు. ఆయ‌న స్వ‌యాన చంద్ర‌బాబుకు బామ్మ‌ర్థి. పైగా జూనియ‌ర్ మామ కావ‌డంతో ఆనాడున్న రాజ‌కీయాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సానుకూలంగా మ‌లుచుకున్నారు.

Also Read : Jagan-KCR : తెలుగు రాజ‌కీయ సోద‌ర చ‌ద‌రంగం! పొంగులేటి,జ‌గ‌న్ భేటీ సీక్రెట్ ..!

వైనాట్ 175 దిశ‌గా వెళుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో 30 ఏళ్లు తానే అధికారంలో ఉండాల‌ని(Jagan Sketch) కోరుకుంటున్నారు. అందుకే, జూనియ‌ర్ ను రాజ‌కీయాల‌కు శాశ్వ‌తంగా దూరంగా ఉంచాల‌ని ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. ఆ కార‌ణంగా జూనియ‌ర్ కు అనుచరుడుగా ఉండే కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావును(Kodali Nani) పొమ్మ‌న‌లేక పొగ పెడుతున్నార‌ట‌. స్వామి భ‌క్తిని పదేప‌దే ప్ర‌ద‌ర్శిస్తున్న‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా కొడాలిని రాజ‌కీయంగా న‌రుక్కుంటూ వ‌స్తున్నార‌ని ఆయ‌న అభిమానుల్లో అనుమానం మొద‌ల‌యింది. అందుకు నిద‌ర్శ‌నం సోమ‌వారంనాటి రివ్యూ మీటింగ్ లో డైరెక్ట్ గా కొడాలిని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టార్గెట్ చేశార‌ని చెప్పుకుంటున్నారు.

కొడాలితో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గేమాడార‌ని…

ఫ‌క్తు రాజ‌కీయ కుటుంబం నేప‌థ్యం ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అదే త‌ర‌హాలో రాజ‌కీయ అడుగులు(Jagan Sketch) వేసుకుంటూ వెళుతున్నారు. ఆనాడున్న ప‌రిస్థితుల్లో 2014, 2019 ఎన్నిక‌ల్లో అనివార్యంగా కొడాలి నానికి గుడివాడ నుంచి టిక్కెట్ ఇవ్వ‌డం జ‌రిగింది. ఆ త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తొలి క్యాబినెట్ లో కొడాలికి స్థానం క‌ల్పించారు. దీంతో చంద్ర‌బాబు, టీడీపీ పార్టీ మీద నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతూ స్వామిభ‌క్తిని చాటుకున్నారు. క‌మ్మ సామాజిక‌వ‌ర్గం వెలివేసేంత వ‌ర‌కు నోరుపారేసుకున్నారు. ఆ త‌ర‌హా డ్యామేజ్ సొంత సామాజిక‌వ‌ర్గంలో కావాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేసిన వ్యూహంలో కొడాలి ప‌డిపోయార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. త‌ప్పు మీద తప్పులు చేసే వ‌ర‌కు కొడాలికి మ‌ద్ధ‌తు ఇస్తూ వ‌చ్చారు. బ‌రితెగించి క్యాసినో పెట్టే వ‌ర‌కు అండ‌గా నిలిచారు. స‌మ‌యం చూసి క్యాబినెట్ నుంచి గెంటేశారు. అయిన‌ప్ప‌టికీ కుక్కిన పేనులా గొడ్ల చావిడిలో ప‌డేలా కొడాలితో ఒక ఆట ఆడుకున్నారు. స్వ‌త‌హాగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గంలో ఉన్న సానుభూతి మొత్తం తీసే వ‌ర‌కు కొడాలితో(Kodali Nani) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గేమాడార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌.

వంగవీటి రాధా విష‌యంలోనూ ఆచితూచి…(Kodali Nani)

తొలి నుంచి నంద‌మూరి కుటుంబానికి ఉన్న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం మీద ప‌ట్టు సాధించిన కొడాలి (Kodali Nani)ఈసారి వెనుక‌బ‌డ్డార‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని స‌ర్వేల ద్వారా తెలుసుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యామ్నాయ ఎత్తుగ‌డ‌ను ర‌చించార‌ని స‌మాచారం. రాబోవు ఎన్నిక‌ల్లో అక్క‌డ నుంచి కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన లీడ‌ర్ ను ఎంపిక చేయాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలో వంగ‌వీటి కుటుంబీకుల్లో ఎవ‌రో ఒక‌ర్నీ ప్ర‌మోట్ చేయాల‌ని ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు, వంగవీటి రాధా విష‌యంలోనూ ఆచితూచి చూస్తున్నార‌ట‌. ఎన్నిక‌ల స‌మ‌యానికి రాధా క‌నుక టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి ఉంటే గుడివాడ నుంచి పోటీ చేయించాల‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని భావ‌న‌గా ఉంద‌ని వినికిడి. మొత్తం మీద కొడాలి నాని కోర‌లు పీకేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Sketch) ఇక మూల‌న‌పడేయ‌డ‌మే త‌రువాయిగా స్కెచ్ వేశార‌ట‌. ఇదే త‌ర‌హాలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బ‌ల‌మైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్ల‌ను బ‌ల‌హీన‌ప‌రిచే ఎత్తుగ‌డ వైసీపీ అధిష్టానం వ‌ద్ద ఉంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని కొంద‌రు ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో వాయిస్ గా ఉంది.

Also Read : Jagan : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 100 అబ‌ద్ధాలు! కాలం చెల్లిన `వైఎస్` విశ్వ‌స‌నీయ‌త !!