Site icon HashtagU Telugu

Jagan Sketch: ఆ నలుగురిపై జగన్ స్కెచ్

Jagan Sketch On Those Four

Jagan Sketch On Those Four

Jagan Sketch : రెబెల్స్ కు ధీటుగా ఉండే నలుగురిని వైసీపీ సెలెక్ట్ చేసింది. ఉదయగిరి నియోజకవర్గం మినహా మిగిలిన చోట్ల స్పష్టత వచ్చింది. అక్కడ మాత్రం ప్రస్తుతం పరిశీలకునిగా ఉన్న ధనుంజయ్య రెడ్డి కి ఇవ్వడమా? లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శిష్యుడు మెట్టుకూరు చిరంజీవి రెడ్డికి అప్పగించాలా?అనేది చర్చ నడుస్తోంది.

మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయగిరిలో ధనుంజయరెడ్డి అనే వ్యక్తిని వైసీపీ నియోజకవర్గ పరిశీలకుడుగా గతంలో నియమించింది. ఈ విషయంలో మేకపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన ధనుంజయ్ రెడ్డి అనే వ్యక్తిని తన నియోజకవర్గంలో పరిశీలకుడిగా పెట్టడమేంటని మండిపడ్డారు. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ధనుంజయ్ రెడ్డి వైసీపీ కొత్త ఇంచార్జిగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతిని ఉదయగిరి నియోజకవర్గ ఇంచార్జిగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రాంనారాయణరెడ్డిలతోపాటు ఇప్పుడు మరో ఇద్దరు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండకు మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయగిరికి కొత్త ఇంచార్జులను వైసీపీ అధిష్టానం నియమించనుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే గా ఉన్న తాడికొండకు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ను సమన్వయకర్తగా నియమించింది. ఆ తర్వాత ఆయనను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది. దీంతో తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్తగా కత్తెర సురేష్ కుమార్ ను నియమించింది. కత్తెర సురేష్ భార్య హెనీ క్రిస్టీనా ప్రస్తుతం గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఆ క్రమంలో తన నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే గా ఉండగా అదనపు సమన్వయకర్త పేరుతో ఇంకో వ్యక్తిని నియమించడాన్ని ఉండవల్లి శ్రీదేవి గతంలోనే తప్పుబట్టారు. ఈ విషయంలో ఆమె అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పూర్తి గా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వచ్చే ఎన్నికల్లో కత్తెర సురేష్ లేదా డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నలుగురు ఎమ్మెల్యేల్లో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రాంనారాయణరెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర ఉన్నారు.

ఫోన్ ట్యాపింగ్ నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రాంనారాయణరెడ్డి తమ సొంత ప్రభుత్వంపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం వారిద్దరిని నియోజకవర్గాల ఇంచార్జులుగా తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గాని కి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ని ఇంచార్జి గా నియమించింది. అలాగే ఆనం రాంనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ఇంచార్జి గా నియమించింది.

నెల్లూరు రూరల్ వెంకటగిరి తాడికొండలకు గతంలోనే నియోజకవర్గ ఇంచార్జిలను ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఉదయగిరికి కొత్త ఇంచార్జిని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి నేడో రేపో వైసీపీ అధిష్టానం ఫైనల్ చేయబోతోంది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి ఇవ్వాలని దాదాపుగా అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుస్తుంది. అక్కడ గ్రూప్ లు ఉన్న క్రమంలో వాటికి చెక్ పెట్టేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద నాలుగు రెబెల్స్ కు ధీటైన అభ్యర్థులను వైసీపీ సిద్ధం చేసింది.

Also Read:  YCP-CBN : జ‌గ‌న్ `స్వ‌ర‌`ల‌హ‌రి, టీడీపీ బ‌హుప‌రాక్‌!