Site icon HashtagU Telugu

Dr Sudhakar Issue : జగన్ సర్ ..మీరు చేసిన ఈ పనులు ఏంటి మరి…?

Sudhakar Jagan

Sudhakar Jagan

తెనాలి(Tenali)లో పోలీసుల హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన మాజీ సీఎం జగన్‌(Jagan) చర్యపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. బాధితులకు మద్దతుగా నిలవడంలో సందేహం లేదు గానీ, గతంలో తన ప్రభుత్వ హయాంలో జరిగిన ఇలాంటి సంఘటనలపై ఆయన మౌనం ఇప్పుడు ప్రశ్నలెత్తిస్తోంది. సుధాకర్ ఘటన, కర్నూలులో యువకుడిపై పోలీసుల అఘాయిత్యం, అనంతబాబు కేసు వంటి ఉదాహరణలు ప్రజలకు ఇంకా మరిచిపోలేదు.

Praja Tirpu Dinam : విధ్వంసకారుడు వద్దు, విజనరీ లీడర్ కావాలనుకున్న రోజు

ఇప్పుడు జగన్ విపక్ష నాయకుడిగా బాధితులకు మద్దతుగా నిలవడాన్ని మంచి విషయంగానే చూడొచ్చు. కానీ అదే సమయంలో గత పాలనలో జరిగిన తప్పులను గుర్తుచేసుకుంటూ స్పందించాలన్నది నెటిజన్ల అభిప్రాయం. అప్పట్లో పాలనలో ఉన్నప్పుడు పట్టించుకోని అంశాలపై ఇప్పుడు దృష్టి సారించడాన్ని పకడ్బంధి రాజకీయంగా అభివర్ణిస్తున్నారు. ఇది బాధితులకన్నా రాజకీయ ప్రయోజనానికే ఉపయోగపడుతుందని విమర్శలు వస్తున్నాయి.

AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం..వీటిపైనే ప్రధాన చర్చ

నిజంగా తెనాలి ఘటనపై నిష్పాక్షికంగా స్పందించాలంటే జగన్ హైకోర్టులో పోలీసులు అణచివేతలపై సవాల్ చేయాలన్నది ఒక దారి. లేకపోతే ప్రజాసంఘాలను కలవడం మరో మార్గం. ఈ విధంగా వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న యత్నం ఉంటే ప్రజలు గౌరవిస్తారు. లేదంటే ఇది కేవలం రాజకీయ ప్రదర్శనగా మిగిలిపోతుందన్న అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.