Site icon HashtagU Telugu

Jagan Shocking : ఒకే రోజు జగ‌న్ కు రెండు షాక్ లు

Jagan Shocking

Jagan Shocking

ఒకేరోజు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రెండు దెబ్బ‌లు (Jagan Shocking) తిగిలాయి. మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో అవినాష్ రెడ్డి(Avinash Reddy) పాత్ర ఉంద‌ని సీబీఐ కోర్టుకు తెలిపింది. మ‌రో వైపు ఏపీ హైకోర్టు జీవో నెంబ‌ర్ 1ను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అహం మీద దెబ్బ తీసింది. తెలంగాణ కోర్టులో సీబీఐ చెప్పిన వాద‌న అవినాష్ రెడ్డి అరెస్ట్ దిశ‌గా అడుగులు వేస్తోంది. దీంతో తాడేప‌ల్లి కోట‌లోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి హీట్ పెరిగింది.

ఒకేరోజు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రెండు దెబ్బ‌లు (Jagan Shocking)

తెలంగాణ సీబీఐ కోర్టులో గురువారం ఉద‌య్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిష‌న్ మీద సీరియ‌స్ వాద‌న‌లు జ‌రిగాయి. ఆ సంద‌ర్భంగా వివేకానంద‌రెడ్డి హ‌త్య(Viveka murder) కేసు డైరీని కోర్టుకు అందించారు. దానికి అనుగుణంగా సీబీఐ త‌ర‌పు న్యాయ‌వాదులు వాదించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద‌య్ కుమార్ రెడ్డిని విడుద‌ల చేస్తే సాక్షుల‌ను బెదిరిస్తార‌ని తెలిపింది.అంతేకాదు, ఎంపీ అవినాష్ రెడ్డి సూత్ర‌ధారిగా ఈ హ‌త్య కేసులో ఉన్నారని చెప్పింది. ఆయ‌న డైరెక్ష‌న్ మేర‌కు హ‌త్య‌తో పాటు ఆధారాలు లేకుండా చేశార‌ని సీబీఐ కోర్టుకు తెలియ‌డం గ‌మ‌నార్హం. వాద‌న‌ల‌ను విన్న సీబీఐ కోర్టు ఈనెల 15వ తేదీకి తీర్పును వాయిదా వేసింది.

తాడేప‌ల్లి కోట వైపు కూడా సీబీఐ అడుగులు

కోర్టుకు అంద‌చేసిన డైరీ ప్ర‌కారం అవినాష్ రెడ్డికి ఇక జైలు త‌ప్ప‌ద‌ని అంచ‌నాకు రావ‌చ్చు. అదే జ‌రిగితే, తాడేప‌ల్లి కోట వైపు కూడా సీబీఐ అడుగులు వేసే(Jagan Shocking) అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే వైఎస్ భార‌తి పీఏ న‌వీన్ ను సీబీఐ విచార‌ణ చేసింది. అలాగే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓఎస్డీగా ఉన్న కృష్ణ మోహ‌న్ రెడ్డిని విచార‌ణ చేసి కొన్ని క్లూ ల‌ను రాబ‌ట్టింది. వాటి ఆధారంగా అవినాష్ ను విచార‌ణ చేసిన సీబీఐ మ‌రింత స‌మాచారం రాబ‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ, విచార‌ణ సంద‌ర్భంగా అవినాష్ రెడ్డి(Avinash Reddy) స‌హ‌కారం అందించ‌డంలేద‌ని సీబీఐ చెబుతోంది. అందుకే, ఆయ‌న్ను క‌స్ట‌డీలోకి తీసుకోవాల‌ని భావిస్తోంది. ఏ రోజైనా ఆయన్ను అరెస్ట్ చేసి విచార‌ణ చేస్తేనే, ఆధారాల‌తో కూడిన డాక్యుమెంట్ ను కోర్టుకు అంద‌చేయ‌డానికి అవ‌కాశం ఉంది. ఈ ప‌రిణామం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి షాక్ క‌లిగించేలా ఉంది.

హైకోర్టు జీవో నెంబర్ 1ను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇక జీవో నెంబ‌ర్ 1 మీద ఏపీలోని విప‌క్షాలు ముక్తకంఠంతో నిర‌సించాయి. అయిన‌ప్ప‌టికీ క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి యంత్రాంగానికి ఆర్డ‌ర్ వేశారు. ఫ‌లితంగా విప‌క్షాలు స‌భ‌లు, స‌మావేశాలు పెట్టుకోవ‌డానికి లేకుండా పోయింది. దీంతో న్యాయ పోరాటం చేశాయి. హైకోర్టు స్టే విధించిన విష‌యం విదిత‌మే. దాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ వెళ్లింది. అయితే, హైకోర్టు ప‌రిధిలో తేల్చుకోవాల‌ని సుప్రీం కోర్టు సూచించింది. ఆ మేర‌కు ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న హైకోర్టు జీవో నెంబర్ 1ను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. విప‌క్షాల‌ను ఆ జీవోతో క‌ట్ట‌డీ చేయాల‌ని భావించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి (Jagan Shocking)ఇదో చేదు అనుభ‌వం.

Also Read : Jagan war : ప‌వ‌న్ పొత్తుపై జ‌గ‌న్ `ప్యాకేజీ` వార్‌

మొత్తం మీద గురువారం అటు సీబీఐ కోర్టు ఇటు ఏపీ హైకోర్టు ఇచ్చిన డైరెక్ష‌న్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan Shocking) షాక్ ఇచ్చేలా ఉన్నాయి. వాటి మీద మ‌ళ్లీ ఏం చేస్తారు? అనేది మాత్రం ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టికే అవినాష్ రెడ్డి(Avinash Reddy) అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత ఆయ‌న అరెస్ట్ ఉంటుంద‌ని ఇటీవ‌ల వినిపించింది. ఇక చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నల‌ను అడ్డుకుంటున్న జీవో నెంబ‌ర్ 1 ర‌ద్దు కావ‌డంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చ‌మ‌ట‌లు ప‌ట్టేలా విప‌క్షాలు ముందుకు క‌ద‌ల‌బోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జ‌గ‌న్ ఏమి చేస్తారు? అనేది చూడాలి.

Also Read : YCP-TDP : జ‌గ‌న్ న‌జ‌ర్,చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌పై జీవో నెంబ‌ర్ 1