Site icon HashtagU Telugu

AP : ఉద్యోగులకు జగన్ భారీ షాక్ ..

Jagan Meeting

Jagan Meeting

మరో పది రోజుల్లో ఎన్నికల పోలింగ్..ఎన్నికల సమయంలో ఉద్యోగులు (Employees) కీలక పాత్ర పోషిస్తారు..ఇలాంటి టైం లో వారికీ భారీ షాక్ ఇచ్చాడు జగన్ (Jagan). ప్రభుత్వం కల్పించిన అకామిడేషన్‌లో కరెంటు బిల్లులు ఎక్కువ రావడంతో.. అపార్టమెంట్లలో ఉన్న వారి వద్ద నుంచే వసూలు చేయాలంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ తో పాటుపలు కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి షేరింగ్‌‌పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. వీరు ఉంటున్న ప్లాట్‌ల విద్యుత్‌ బిల్లులు పరిమితికి మించి వస్తుండడంతో బిల్లులు చెల్లించాలని జీఏడీ అకామిడేషన్ విభాగాన్ని విద్యుత్ శాఖ కోరింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో పరిమితికి మించి 2లక్షల 79వేల 23 రూపాయలు విద్యుత్ వాడిన ఉద్యగులకు జీఏడీ అకామిడేషన్ షాక్ ఇచ్చింది. పరిమితికి మించి విద్యుత్ వినియోగించుకున్న ఉద్యోగులకు ప్రభుత్వం బిల్లు చెల్లించదని స్పష్టం చేసింది. పరిమితికి మించి వచ్చిన విద్యుత్ బిల్లులను ఆయా ప్లాట్‌లలో ఉన్న ఉద్యోగుల నుంచే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో వారి విద్యత్ కనెక్షన్ తొలగించే ప్రమాదం ఉందని పేర్కొంటూ సర్వీస్ అసోషియేషన్‌లకు ప్రభుత్వం తరపు నుంచి లేఖ పంపించింది. దేనిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ వస్తే..కట్టాలని , తక్కువ వస్తే కట్టనవసరం లేదని చెప్పడం ఎంతవరకు సబబు అని అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని..లేదంటే తీవ్ర పరిణామం ఎదురుకుంటారని హెచ్చరిస్తున్నారు. చూద్దాం ఏంచేస్తారో..!!

Read Also : Aarogyasri : వైసీపీ పార్టీకి మరో పెద్ద చిక్కు వచ్చి పడింది..

Exit mobile version