Site icon HashtagU Telugu

Jagan Script : ఒక జ‌డ్జిమెంట్ బోలెడు కోణాలు.!

Jagan Script

Babu Jagan

Jagan Script : నంద్యాలలో ఆరోజు గుర్తుందా? అక్కడే అతను అన్నాడు. ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా మనం తీసుకోగలగాలి. అప్పుడే తిరిగి మనం అంతకన్నా గట్టిగా కొట్టగలం. ఇవి అతని మాటలు అప్పట్లో! ఇప్పుడు అదే నంద్యాల కేంద్రంగా పెద్దాయన్ని అంతే గట్టిగా లాగి కొట్టాడు. కట్ చేస్తే, రాజమండ్రి జైల్లో పడ్డాడు. అది కూడా ఆయన పెళ్ళి రోజు గొప్ప కానుక ఇచ్చాడు. ఇదే జ‌గ‌న్మోహ‌న్ స్క్రిఫ్ట్.

హమ్మయ్య విదేశ పర్యటన విజయవంతం. జ‌గ‌న్ కళ్ళల్లో ఆనందం. అధికార పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. ప్రతిపక్ష పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం, ఉద్వేగం. ఆయన అభిమానుల్లో ఆందోళన. పైన పెద్ద ఎన్టీఆర్ సంతోషం. ఆయన సతీమణి ఇక్కడ ఉల్లాసం. తోడల్లుడు అపోలో లో చికిత్స పొందుతూ ఆనందం తో లేచి కూర్చున్నాడు. మొత్తానికి పెద్దాయన కు 14 రోజులు రిమాండ్. జైలుకు పంపించాలనే కోరిక సఫలం. ఉత్కంఠ న‌డుమ‌ సిట్ కార్యాలయం నుంచి రాజమండ్రి జైలుకు తరలింపు దృశ్యం (Jagan Script) మ‌రిచిపోలేనిది.

రాజమండ్రి జైలుకు తరలింపు దృశ్యం (Jagan Script)

రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా పరిగణించాలని కోరినా ఆమె అంగీకరించ లేదు. మరో రెండు పిటిషన్లు వేశారు. వయసు, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఇంటి భోజనం, మందులు వైద్య సదుపాయాలు కల్పించాలని, ప్రత్యేక గది కేటాయించాలని, సొంత కాన్వాయ్ లో రాజమండ్రి కి తరలించాలని కోరుతూ ఇచ్చిన పిటిషన్ లపై వాదనలు జరిగాయి. మిగతా అన్ని ఓకే, గృహ నిర్భంధం కోరిక కుదరదని (Jagan Script)తేల్చి చెప్పేసారు ఆవిడ‌.

సలహాదారుల షాడో ముఖ్యమంత్రి కట్టుదిట్ట చర్యలు తీసేసుకున్నారు. అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు. సభలు, నిరసనలు, ర్యాలీ లు రద్దు. అయినా పచ్చ పార్టీ శ్రేణులు బంద్ కు పిలుపు. ప‌వ‌న్ మద్దతు ప్రకటించేసాడు. ఇంతకీ కేంద్ర పార్టీ ఎటు వైపో తెలియదు! “గోపి” అయి ఉండొచ్చు. కాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైప‌ని తేలింది.

సలహాదారుల షాడో ముఖ్యమంత్రి కట్టుదిట్ట చర్యలు

సీఐడీ కోరిది. అలా 14 రోజుల తరువాత కూడా పొడిగించుకుంటూ వెళ్తారో, బెయిల్ వచ్చేలా వీళ్ళు చేస్తారో ఏమో చెప్పలేం. 16 నెలలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లోపలే ఉన్నాడు కాబట్టి, ఈయన్ని ఎన్నాళ్ళు లోపల ఉంచుతారో తెలియదు. ఒకవేళ వచ్చినా మళ్ళీ అరెస్ట్ చేసేయడానికి వాళ్ళ అంబులపొది లో రెడీ గా మరో ఏడు అత్యవసర కేసులు ఉన్నాయి.

నంద్యాల నుంచి విజయవాడ తీసుకు రావడానికి హెలికాప్టర్ కూడా సిద్ధం చేశారు. పెద్దాయన ఎక్కలేదు పావురాల గుట్ట వైపు వెళుతుందని. ఆయనకు అసలే కేసులు, జైలు అంటే భలే భయం పాపం. ఎప్పుడూ నిప్పు అని చెప్పుకుంటూ ఉంటాడు. సరే, జైల్లో జాగ్రత్త స్వామి. ఏమయినా జరగ వచ్చు. ఏమో గుర్రము ఎగురావచ్చు. అస‌లే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టైమ్ (Jagan Script) న‌డుస్తోంది.

ఏది ఏమయినా ఛానెల్స్ మరచిపోయిన విషయం ఏమిటంటే, ఆయనకు రిమాండ్ మాత్రమే విధించారు. స్కామ్ లో ఆయన పాత్ర వున్నదని ఆధారాలు ఉన్నాయని నమ్మించగలిగారు. అవి ఆరోపణలు మాత్రమే. ఆయన బయట ఉంటే ఆధారాలు మాయం చేస్తాడనో, ప్రభావితం చేస్తాడనో, విచారణ చేయాల్సి ఉండటం… ఇత్యాది కారణాలతో రిమాండ్ కు పంపించారు. అంతేగాని కేసు గురించి తీర్పు ఇవ్వలేదు. అయినా ఈ కేసులో ఆయన A37 అంతే. ఇలాంటి కేసుల్లో అంత త్వరగా తీర్పులు వస్తే, ఎన్నో కేసులున్న మన రాజకీయ నాయకులు అందరూ జైళ్లలో  (Jagan Script)  ఉంటారు పార్టీలతో ప్రమేయం లేకుండా. ఇది జస్ట్ రిమాండ్. ఇది టీజర్ మాత్రమే. సినిమా ఇంకా చాలా ఉంది. అబ్బాయి వెళ్ళాలి లోపలకు. ఆ తరువాత పెద్ద పేపరాయన క్యూ లో వున్నారు. ఏది ఏమయినా ఒక్క విషయం బయట పడింది. ఇన్నాళ్లు పెద్దాయన కోర్టులను మ్యానేజ్ చేస్తాడనేది ఒట్టి బుస్సు అని అర్ధమైంది. ఇక నుంచి ఈ మాట అనే హక్కు ఎవ్వరికీ లేదు. ఇది పచ్చ పార్టీ కి గుడ్డి లో మెల్ల లాంటి చిన్న ఉపశమనం.

Also Read : Jagan Case : జ‌గ‌న్ అరెస్ట్ పై టీడీపీ ఊహాగానం! బినామీల‌పై య‌న‌మ‌ల బాంబ్!!

ఇక రోజూ సినిమా అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జైలు మేట్ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ మీడియా ముందుకొచ్చేశారు. మంత్రి రోజాకు ఇక రోజూ పండ‌గే. మాజీ మంత్రి కొడాలి నానికి క‌సి తీరింది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కు క‌ళ్లు చ‌ల్ల‌బ‌డ్డాయి. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌సి తీరింది. మంత్రి అంబ‌టి రాంబాబు నోటి చ‌లువ తీరింది. మొత్తంగా ఫ్యాన్ బ్యాచ్ హాపీ. ప‌చ్చ బ్యాచ్ లో తెలియ‌ని ఆందోళ‌న‌. హిమ‌బిందు జ‌డ్జిమెంట్ లో ఎన్నో కోణాలు ఇవి.

Exit mobile version