ఆంధ్రప్రదేశ్‌లో అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలని అన్ని రాజకీయ పక్షాలూ అంటున్న నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan) ఓ ఉదాహరణగా నిలిచారు. తాజాగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో పాక్ చేతిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీనాయక్ (Murali Nayak) కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. జవాన్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 లక్షల సహాయాన్ని ప్రశంసించారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, వారిని ధన్యవాదాలు తెలియజేశారు.
Indias Best Friends: ‘ఆపరేషన్ సిందూర్’ వేళ భారత్‌కు బెస్ట్ ఫ్రెండ్స్.. ‘‘ఆ నలుగురు’’ !
జగన్ మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలకు రూ. 50 లక్షలు ఆర్థిక సహాయం అందించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించామని తెలిపారు. తాము ప్రారంభించిన మంచి పనిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఇది సానుకూల పరిణామంగా పేర్కొంటూ, అమరవీరుల సేవలను గౌరవించడంలో రాజకీయాలు అనవసరమని చెప్పే ప్రయత్నం చేశారు.
అలాగే వైసీపీపార్టీ తరఫున కూడా రూ. 25 లక్షల సహాయాన్ని ప్రకటించిన జగన్, జవాన్ తల్లిదండ్రులకు భవిష్యత్తులో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం మొత్తం ఒక వైపు రాజకీయ శత్రుత్వాలకు అతీతంగా మానవీయతను గుర్తు చేస్తుంది. మరోవైపు కూటమి ప్రభుత్వానికి కూడా ప్రతిపక్షం నుంచి వచ్చిన ఈ ప్రశంస రాజకీయ సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.