Site icon HashtagU Telugu

AP: కార్మికులకు ఏపీ సర్కార్ తీపికబురు…భారీగా వేతనాల పెంపు..!

వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో అభివ్రుద్ధి పథకాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన పథకాల ద్వారా చాలామంది లబ్దిపొందారు. ఇప్పుడు మరో శుభవార్తను చెప్పింది ఏపీ సర్కార్. ఏపీలోని మున్సిపాల్టీల్లో పనిచేసే పారిశుద్ద్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పారిశుధ్య కార్మికులకు OHAకు సంబంధిచిన ఉత్తర్వులను సర్కార్ జారీ చేసింది.

కాగా మున్సిపల్ కార్మికులకు 15వేల వేతనానికి అదనంగా 6వేలు ఓహెచ్ఏను సర్కార్ చెల్లించనుంది. దీంతో పారిశుద్య కార్మికుల వేతనాలు రూ. 21వేలకు పెరగనున్నాయి. తాజా ఉత్తర్వులతో 43వేల మందికిపైగా కార్మికులు లబ్ది పొందనున్నారు. ఈ ఉత్తర్వులు విడుదల చేయడంతో కార్మికులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version