Jagan Ruling : CBN 6 వ‌జ్రాలు, జ‌గ‌న్ మ‌ర‌చిన‌ 130 హామీలు

మ‌హానాడు సంద‌ర్భంగా టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన 6 వ‌జ్రాల మీద ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ సాగుతోంది.

  • Written By:
  • Publish Date - May 30, 2023 / 01:47 PM IST

మ‌హానాడు సంద‌ర్భంగా టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన 6 వ‌జ్రాల మీద ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ సాగుతోంది. బట‌న్ నొక్కుడు సీఎం(Jagan Ruling) కార‌ణంగా రాష్ట్రం దివాళా తీసింద‌ని చెబుతోన్న చంద్ర‌బాబు వాటిని ఎలా అమ‌లు చేస్తార‌ని వైసీపీ ప్ర‌శ్నిస్తోంది. ప్ర‌తిగా శాస్త్రీయ‌బ‌ద్ధంగా వివ‌ర‌ణ ఇచ్చేందుకు టీడీపీ మీడియా డిబేట్ల‌ను చేస్తోంది. ట్రైల‌ర్ కే వైసీపీ (YCP) వ‌ణికిపోతుంద‌ని అస‌లు సినిమా ముందుంద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. గ‌త నాలుగేళ్లుగా టీడీపీకి దూరంగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు ఇప్పుడు తొలి మేనిఫెస్టో మీద చ‌ర్చ స‌వాల్ విసర‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు 6 వ‌జ్రాల సంద‌డి (Jagan Ruling)

ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన హామీల‌ను పొందుప‌రుస్తూ నాలుగేళ్ల పాల‌న మీద ఆగ్ర‌హిస్తున్నారు. ప్ర‌ధానంగా సీపీఎస్ ర‌ద్దు, మ‌ద్య‌పాన నిషేధం, ప్ర‌త్యేక హోదా అంశాల‌పై హైలెట్ చేస్తూ మ‌డిమ తిప్పిన నాయ‌కునిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని టీడీపీ నిల‌దీస్తోంది. ఆయ‌న ఇచ్చిన హామీల‌ను గుర్తు చేస్తూ మేల్కో ఆంధ్రుడా అంటూ పిలుపునిస్తోంది. ఏపీ బాగుకొరే శ్రేయోభిలాషులు, మేధావులు మడం తిప్పిన, మాట‌త‌ప్పిన‌ మోసకారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని చొక్కా పట్టుకుని నిలదీయండి, తిరిగి అవకాశం ఇవ్వకుండా తరిమి కొట్టండి ఏపీ ని కాపాడుకోండి అంటూ 2019 ఎన్నిక‌ల నాటి ఆయ‌న హామీల‌ను టీడీపీ లిస్ట్ చేసింది. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించి 4 ఏళ్ళు అయిన సందర్భంగా, ఆయ‌న ఇచ్చిన హామీలు అమ‌లు కాకుండా ఉండేవాటిని టీడీపీ విడుద‌ల చేసింది. ఆ జాబితా ఇలా ఉంది.

జ‌గ‌న్ వ‌దిలేసిన హామీలు

1. సీపీఎస్ రద్దు
2. ప్రత్యేక హోదా
3. మద్య నిషేధం
4. 30 లక్షల ఇళ్ల నిర్మాణం
5. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ
6. వృధ్యాప్య పెన్షన్ రూ.3,000
7. వికలాంగుల పెన్షన్ రూ.3,000
8. 45 ఏళ్ళు దాటితే పెన్షన్
9. మెగా డీఎస్సీ
10. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్
11. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా
12. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం
13. జబ్బు చేసిన వ్యక్తి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే, ఆర్ధిక సాయం
14. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్
15. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తాం
16. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.50,000 లాభం
17. సన్న బియ్యం పంపిణీ
18. ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ మాఫీ
19. ప్రతి మండలంలో వృద్ధాశ్రమం
20. ప్రతి నియోజక్వర్గంలో కోల్డ్ స్టోరేజ్
21. రైతుల కోసం పగటిపూట 9 గంటల విద్యుత్
22. పది రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్
23. నగరిలో టెక్స్ టైల్ పార్కు

Also Read : Delhi Jagan : చీక‌ట్లో ఆ 2గంట‌లు సీక్రెట్‌, జ‌గ‌న్ హ‌స్తిన అవ‌లోక‌నం
24. రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి
25. రూ.3 వేల కోట్లతో ధరల స్థీరీకరణ నిధి
26. గిట్టుబాటు ధర గ్యారంటీ
27. ఉచితంగా బోర్లు
28. కౌలు రైతులకు రైతు భరోసా
29. ప్రతి రైతుకి రూ.12,500/-
30. పోలవరం పూర్తి చేస్తాం
31. వెలిగొండ పూర్తి చేస్తాం
32. గుండ్రేవుల పూర్తి చేస్తాం
33. రామతీర్థం పూర్తి చేస్తాం
34. గుండ్లకమ్మ పూర్తి చేస్తాం
35. రాజోలు ప్రాజెక్టును పూర్తి చేస్తాం
36. సోమశీల కాలువను పూర్తి చేస్తాం
37. రాళ్లపాడు ప్రాజెక్టు పూర్తి చేస్తాం
38. కుందూ నదిపై లిఫ్ట్ ఏర్పాటు
39. సోమశిల ఎత్తిపోతల రెండేళ్లలో పూర్తి
40. వెలిగొండ ప్రాజెక్టు రెండేళ్లలోనే పూర్తి
41. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం
42. ప్రతి నియోజకవర్గంలోనూ డీఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు
43. ప్రతి ఇంటికీ రక్షిత మంచి నీరు

Also Read : TDP Manifesto: చంద్రబాబు ఎన్నికల శంఖారావం! తొలి మేనిఫెస్టో ఇదే
44. ఇంటి నిర్మాణం మీద పావలా వడ్డీకే రుణం
45. పేదలకు ఇళ్ళకు రూ.3 లక్షలు మాఫీ
46. చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా భరిస్తాం
47. పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తగ్గిస్తాం
48. కరెంటు చార్జీలు తగ్గిస్తాం
49. బస్సు చార్జీలు తగ్గిస్తాం
50. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ బధ్రత
51. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ బధ్రత
52. వైద్య మిత్రలకు ఉద్యోగ భద్రత
53. ఏఎన్ఎంల ఉద్యోగాలు రెగ్యులరైజ్
54. బ్రాహ్మణ కార్పొరేషన్ కి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం
55. కాపుల కోసం, ఏడాదికి రూ.2000 కోట్ల ఇస్తాం
56. రూ.2వేల కోట్లతో యాదవ కార్పొరేషన్
57. బీసీలకు ఏడాదికి రూ.15 వేల కోట్లు
58. దూదేకుల ఫెడరేషన్ కు ఏటా రూ.40 కోట్లు.
59. ప్రభుత్వ ఉగ్యోగులకు పీఆర్‌సీ
60. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి అధిక నిధులు
61. చెరువుల నిర్మాణం చేపడతాం
62. అర్చకులకు ఇళ్ల నిర్మాణం

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!
63. అర్చకులకు, రూ.10 వేల నుంచి రూ.35 వేలు ఇస్తాం
64. ఇమాంలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తాం
65. ఇమామ్, మౌజమ్ లకు, రూ.15 వేల గౌరవ వేతనం
66. ప్రభుత్వ కాంట్రాక్టులు, నిరుద్యోగులకు
67. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
68. ఉద్యోగాల విప్లవం
69. 3 ఏళ్ళలో కడప స్టీల్ ప్లాంట్
70. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తా
71. ఉద్యోగుల హెల్త్ కార్డులు
72. నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 శ
73. ప్రమాద భీమా రూ.10 లక్షలు
74. గొర్రెలు, మేకలు చనిపోతే రూ. 6 వేల పరిహారం
75. పేదలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
76. ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధంగా వెళతాం
77. నాపరాయి పరిశ్రమకు విద్యుత్ ఛార్జీలు యూనిట్ రూ. 3.70 కు తగ్గింపు
78. రజకులను ఎస్సీలుగా గుర్తిస్తాం
79. టమాటా జ్యూస్ పరిశ్రమ ఏర్పాటు
80. జర్నలిస్టులకు పెన్షన్ అంశాన్ని పరిశీలిస్తాం
81. ప్రైవేట్ టీచర్ల కోసం ప్రత్యేక చట్టం
82. ప్రైవేట్ టీచర్లకు కనీస వేతనం
83. ప్రైవేట్ టీచర్లకు ఈఎస్ఎ వర్తించేలా నిబంధనలు
84. ప్రైవేట్ టీచర్ల కోసం అసెంబ్లీలో తీర్మానం.
85. ధర వచ్చే వరకు కోల్డ్ స్టోరేజీలో ఉచితంగా నిల్వ ఉంచుకునే సదుపాయం
86. అప్పులిచ్చిన వారు ఆ కుటుంబాలను పీడించకుండా చట్టం
87. ప్రభుత్వ రంగంలో మూతబడిన డెయిరీలను తెరిపిస్తాం
88. మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తాం
89. నల్లబెల్లం అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తాం
90. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు టమాటా జ్యూస్ పంపిణీ
91. రైతుల తరహాలో చేనేతలకు బీమా
92. బీడీ కార్మికులకు గిట్టుబాటు కూలీ లభించేలా చర్యలు
93. అమరావతిలో పది ఎకరాల్లో యాదవ భవన్
94. నూలు కొనుగోలుపై రూ.2వేల సబ్సిడీ
95. దుల్హన్ పథకం కింద యువతులకు రూ. లక్ష సాయం
96. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు
97. కృష్ణా జలాలను పర్చూరుకు తీసుకొస్తాం.
98. పశువులను కొనుగోలు చేసి పేదలకు పంపిణీ.
99. చీమకుర్తి గ్రానైట్ పాలిషింగ్ యానిట్లకు రాయల్టీని 40% తగ్గిస్తాం.
100. గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ కు రూ.7.35 ఉన్న విద్యుత్తు చార్జీ రూ.3.75కు

Also Read : Delhi CBN : చంద్ర‌బాబుపై NDA, UPA `హాట్ లైన్ `ఆప‌రేష‌న్‌
101. కార్మికుల కోసం చీమకుర్తి ప్రాంతంతో ఈఎస్ఎ హాస్పటల్ ఏర్పాటు
102. మూగ, చెవిటి పిల్లలందరికీ ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు.
103. చేనేత మహిళలకు 45 ఏళ్లకే నెలకు రూ.2వేల పింఛన్
104. వైఎస్సార్ పెళ్లికానుక కింద ప్రతి వధువుకు రూ. లక్ష.
105. దళితులపై అక్రమ కేసులు ఎత్తివేత
106. కొల్లేరు భూములు రీసర్వే చేసి కాంటూరు పరిధి నిర్ణయించి తగిన న్యాయం
107. ప్రతి గ్రామంలో చెరువుల నిర్మాణం
108. చేపల చెరువులకు నీళ్ళిస్తాం
109. రైతుల ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు
110. ఆశావర్కర్లకు తెలంగాణ కంటే రూ. 1,000 అధిక జీతం
111. 500 జనాభా కలిగిన తండాలు, గిరిజన గూడెంలు పంచాయితీలుగా మార్పు
112. గిరిజనులకు పూచీకత్తు లేకుండా పావల వడ్డీకే రుణాలు
113. గిరిజనులకు బ్యాక్ లాక్ పోస్టులు
114. పోలవరం నిర్వాసితుల ఇళ్ల స్థలం విస్తీర్ణం పెంపు
115. రొయ్యలు, చేపలకు మద్దతు ధర.
116. ఆక్వాకు రూ. 1.50 కే యూనిట్ విద్యుత్
117. కాలువల పక్కనే ప్రతి ఊరిలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు
118. ప్రతి ఊరిలో మినరల్ వాటర్ ప్లాంట్
119. అల్లికలపై ఆధారపడ్డ మహిళలకు ప్రతినెలా రూ. 2 వేల పెట్టుబడి సబ్సిడి
120. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1,100 కోట్ల విడుదల
121. బీసీల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు ఎమ్మెల్సీ పదవులు
122. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఉచితంగా స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణం.
123. ప్రభుత్వ స్కూళ్లలో అవసరమైన మేరకు టీచర్ల నియామకం
124. చేనేతలకు జీఎస్టీ భారం తగ్గించేందుకు కృషి
125. కులవృత్తులకు స్వర్ణయుగం తెస్తాం
126. జిల్లాకో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
127. చేనేత కార్మికులకు వడ్డీ లేకుండా రూ 1 లక్ష రుణం.
128. చేనేతలకు ఇళ్లు, మగ్గాలకు షెడ్లు నిర్మిస్తాం.
129. చేనేత కార్మికులకు 5 శాతం జీఎస్టీ తగ్గిస్తాం.
130. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి ఏ నగరంలో ఆపరేషన్ చేయించుకున్నా ప్రభుత్వమే భరిస్తుంది

త్వ‌ర‌లో టీడీపీ రెండో విడ‌త మేనిఫెస్టో (Jagan Ruling)

ఇలా మొత్తం 130 హామీల‌ను సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Ruling) అమ‌లు చేయ‌కుండా గాలికి వ‌దిలేశార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ, చంద్ర‌బాబు ప్ర‌కటించిన 6 వ‌జ్రాల‌ను తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తామ‌ని హామీ ఇస్తోంది. కేవ‌లం మ‌హిళా శ‌క్తి ప‌థ‌కంలో భాగంగా కొన్ని అంశాల‌ను మాత్రం టీడీపీ ప్ర‌స్తావించింది. ఇంకా చాలా ఉన్నాయ‌ని చెబుతోంది. మ‌హిళ‌లు, రైతులు, బీసీలు, యువ‌త‌ను ఆక‌ర్షించ‌డంతో పాటు పేద వ‌ర్గాల‌ను ధ‌నికులుగా మార్చే ఫార్ములాను ప్ర‌క‌టించింది. పూర్తి స్థాయి మేనిఫెస్టో త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి టీడీపీ సిద్ద‌మ‌వుతోంది. ఆ లోగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎగ్గొట్టిన హామీల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌డానికి సిద్ద‌మైయింది.

Also Read : Jagan Delhi : ఢిల్లీ అపాయిట్మెంట్ నో, తాడేప‌ల్లి వైపు సీబీఐ?