Jagan Rule : మ‌తోత్సాహం, ద‌ళిత క్రిస్టియ‌న్లు ఇక ఎస్సీలు!

జగ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Rule) మ‌రో తేనెతుట్టెను క‌దిలించారు.

  • Written By:
  • Updated On - March 24, 2023 / 05:33 PM IST

ఏపీ సీఎం జగ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Rule) మ‌రో తేనెతుట్టెను క‌దిలించారు. ద‌ళిత క్రిస్టియ‌న్ల‌ను ఎస్సీలుగా చేర్చుతూ వివాద‌స్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ళిత క్రిస్టియ‌న్లను(Christian) బీసీ కేట‌గిరీ కింద ఉండే వారు. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం ద‌ళితుల‌ను క్రిస్టియ‌న్లుగా మార్చ‌డానికి అనువుగా ఉండేలా నిర్ణ‌యం ఉంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీ భావిస్తున్నాయి. అంతేకాదు, బోయ‌, వాల్మీకుల‌ను ఎస్టీలుగా చేస్తూ మ‌రో వివాద‌స్ప‌ద నిర్ణ‌యాన్ని తీసుకుని అసెంబ్లీలో ఆమోదించారు.

ద‌ళిత క్రిస్టియ‌న్ల‌ను ఎస్సీలుగా చేర్చుతూ వివాద‌స్ప‌ద నిర్ణ‌యం(Jagan Rule)

రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి ఎప్ప‌టి నుంచో వ‌ర్గీక‌ర‌ణ అంశం పెండింగ్ లో ఉంది. కాపులను బీసీలుగా గుర్తించే అంశం కూడా వివాద‌స్ప‌దంగా మారింది. ఏపీ ఉమ్మ‌డి సీఎంగా చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌, క్రిమీలేయ‌ర్ అంశాల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు విడిపోయిన ఏపీలో ఎస్సీ మాల ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని టీడీపీ ఇప్పుడు ముట్టుకోవ‌డంలేదు. ఇక క్రిమీలేయ‌ర్ అంశం చాలా కాలంగా చ‌ర్చ‌లో ఉన్న‌ప్ప‌టికీ దాని గురించి స‌మీక్షించ‌డానికి కూడా రాజ‌కీయ పార్టీల‌కు ధైర్యం (Jagan Rule) లేకుండా ఉంది. ఫ‌లితంగా రిజ‌ర్వేష‌న్ పొందిన ఎస్సీ కుటుంబాలే మ‌ళ్లీమ‌ళ్లీ ల‌బ్దిపొందుతున్నారు. రిజ‌ర్వేష‌న్ ఫ‌లాల‌ను అందుకోలేని ద‌ళితులు చాలా మంది ఉన్నారు. అందుకే, క్రిమీలేయ‌ర్ ఉండాల‌ని చాలా సార్లు మేధావులు చ‌ర్చించారు. అలాంటి ఉప‌యోగ‌క‌ర‌మైన అంశాన్ని ప‌క్క‌న‌ప‌డేసి దళిత క్రిస్టియ‌న్ల‌ను ఎస్సీలుగా మార్చుతూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Rule) తీసుకున్న నిర్ణ‌యం మ‌త మార్పిడుల‌ను ప్రోత్స‌హించేలా ఉంది.

కాపులను బీసీలుగా గుర్తించే అంశం కూడా వివాద‌స్ప‌దం

ఆదివాసీలు, గిరిజ‌నులు ఎస్టీలుగా ఆనాదిగా ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఇప్ప‌టికీ ఆ జాతులు వెనుక‌బ‌డి ఉన్నాయి. వాళ్ల‌కంటే మెరుగ్గా ఉండే బోయ‌, వాల్మీకుల‌ను ఇప్పుడు ఎస్టీలుగా మార్చుతూ అసెంబ్లీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ (Jagan Rule) బిల్లును ఆమోదించింది. అంటే, ఇక నుంచి ఎస్టీల్లో ఎక్కువ పోటీత‌త్త్వం పెర‌గ‌నుంది. ఆదివాసీలు, గిరిజ‌నులు ఇక నుంచి వాల్మీకులు, బోయ‌ల‌తో పోటీ ప‌డాల్సి వ‌స్తోంది. వాస్త‌వంగా ఏపీలోని వాల్మీకులు, బోయ‌లు ఆర్థిక స్థితిగ‌తులు, సామాజిక స్థితిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఆదివాసీలు, గిరిజ‌నుల కంటే మెరుగ్గా క‌నిపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వాల్మీకులు, బోయ‌ల‌ను ఎస్టీలుగా చేర్చుతూ ఆదివాసీలు, గిరిజ‌నుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను త‌క్కువ చేస్తూ వివాద‌స్ప‌ద నిర్ణ‌యం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్నార‌ని ఆ వ‌ర్గాల నేత‌ల అభిప్రాయం.

Also Read : Jagan MLC : అమ్మో `తాడేప‌ల్లి`..ఇప్పుడెళ్లారో.!

కాపుల‌ను బీసీలుగా మార్చాల‌ని విడిపోయిన ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబు బిల్లును ఆమోదించారు. అందుకోసం మంజునాథ‌న్ క‌మిటీని వేసి, ఆ క‌మిటీ సిఫార‌స్సుల మేర‌కు బీసీలుగా కాపుల‌ను మార్చుతున్నానంటూ బిల్లు పాస్ చేశారు. దాన్ని కేంద్రానికి పంపారు. ఫ‌లితంగా బీసీలు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మీద ఆనాడు తిర‌గ‌బడ్డారు. బీసీల‌కు అన్యాయం చేస్తూ చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం అధికారాన్ని నేల‌మ‌ట్టం చేసింది. ఉమ్మడి ఏపీలో ఉండ‌గా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు క‌ట్టుబడిన చంద్ర‌బాబు ఇప్పుడు దాని నుంచి వెన‌క్కు జ‌రిగారు. ఆ అంశాన్ని అంటు జ‌గ‌న్ ఇటు చంద్ర‌బాబు ఇద్ద‌రూ ప‌క్క‌న పెట్టేశారు. దానికి కార‌ణం ఏపీలోని ద‌ళితుల్లో(Christian) మాల ఓట్లు క్రీయాశీల‌కంగా ఉన్నాయి. మాదిగ ఓట‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ మాల కంటే త‌క్కువ‌గా ఉండ‌డ‌మే వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని అట‌కెక్కించార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

చ‌ర్చిల‌ను క‌ట్టిస్తూ ఫాస్ట‌ర్ల‌కు గౌర‌వ వేత‌నం

ఏక‌స‌భ్య క‌మిటీని వేసి ద‌ళిత క్రిస్టియ‌న్ల‌ను ఎస్సీలుగా మార్చుతూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Rule) ఆమోదించారు. దీంతో ఇప్ప‌టికే క్రిస్టియ‌న్ ముద్ర‌వేసుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద మిగిలిన మ‌తాల వాళ్లు గుర్రుగా ఉన్నారు. పంచాయ‌తీ నిధుల‌తో చ‌ర్చిల‌ను క‌ట్టిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం ఇటీవ‌ల ఆయ‌న తీసుకున్నారు. అంతేకాదు, ఫాస్ట‌ర్ల‌కు గౌర‌వ వేత‌నం ఇస్తూ క్రిస్టియ‌న్ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఇమాంల‌కు గౌర‌వ వేత‌నం ఇస్తూ మ‌సీదుల‌ను పెంచుతున్నారు. మ‌త‌, కుల ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాల‌ను చేస్తూ ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు తెర‌లేపారు.

Also Read : Jagan in Tirupur Sabha: నేనే హీరో.. వాళ్ళు విలన్లు! తిరువూరు సభలో జగన్

తాజాగా ద‌ళిత క్రిస్టియ‌న్ల‌ను(Christian) ఎస్సీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించ‌డాన్ని బీజేపీ వ్య‌తిరేకిస్తోంది. ఈ రెండు వివాద‌స్ప‌ద బిల్లును కేంద్రానికి పంపిస్తున్న‌ట్టు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Rule) ప్ర‌క‌టించారు. రాజ్యాంగం ప్ర‌కారం 50శాతం రిజ‌ర్వేష‌న్లు దాట‌కూడ‌దు. అందుకే, రాష్ట్రాలు రిజ‌ర్వేష‌న్ల మీద బిల్లులు పంపించిన‌ప్ప‌టికీ వాటికి కేంద్రం అనుమ‌తి ఇవ్వ‌దు. అందుకే, రిజ‌ర్వేష‌న్ల బాల్ ను కేంద్రం కోర్టులోకి నెట్ట‌డం ద్వారా రాజ‌కీయ ప‌బ్బం గడుపుకోవ‌డం ప్రాంతీయ పార్టీల‌కు అలవాటుగా మారింది. స‌మాజంలో మాత్రం అల‌జ‌డి సృష్టించే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాల‌కు తెర‌లేప‌డం గ‌మ‌నార్హం.

Also Read : YCP MLA : ఉద‌య‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆఫీసులో ఫ్లెక్సీల తొలిగింపు.. అందుబాటులో లేని ఎమ్మెల్యే మేక‌పాటి