3 Capitals:చంద్ర‌బాబు స‌భ‌కు పోటీగా జ‌గ‌న్ `రాయ‌ల‌సీమ గ‌ర్జ‌న‌`!

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు(chandrababu naidu) స‌భ‌లు విజ‌య‌వంత‌మైన చోట వైసీపీ స‌భ‌ల‌ను పెడుతోంది.

  • Written By:
  • Publish Date - December 5, 2022 / 03:49 PM IST

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు (Chandrababu Naidu) స‌భ‌లు విజ‌య‌వంత‌మైన చోట వైసీపీ పోటీగా బ‌హిరంగ స‌భ‌ల‌ను పెడుతోంది. ఏపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై టీడీపీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళుతుంటే, విచిత్రంగా మూడు రాజ‌ధానుల(3 capitals) కోసం బ‌హిరంగ స‌భ‌ల‌ను అధికార పార్టీ నిర్వ‌హిస్తోంది. రాష్ట్రంలోని పాల‌న‌, అభివృద్ధి, నేరాలు, ఘోరాల గురించి చ‌ర్చ‌కు రాకుండా భావోద్వేగాల్ని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నానికి జ‌గ‌న్(jagan) పార్టీ తెర‌తీసింది. ఆ క్ర‌మంలో శ్రీ బాగ్ ఒప్పందాన్ని గుర్తు చేస్తూ న్యాయ రాజ‌ధాని రాయ‌ల‌సీమ‌కు( rayalaseema capital) కావాలని సోమ‌వారం స‌భ‌ను నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా కార్య‌నిర్వ‌హ‌ణా రాజ‌ధాని(visakha capital) కావాల‌ని బ‌హిరంగ స‌భ‌ను పెట్టారు. ఆ స‌భ‌కు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజ‌ర‌య్యారు. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు మూడు రాజ‌ధానులు(3 capitals) కావాల‌ని కోరుకుంటున్నార‌ని హ‌డావుడి చేశారు. ఆ స‌భ‌కు కొన్ని రోజుల ముందు అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర హైలెట్ అవుతూ వ‌చ్చింది. అమ‌రావ‌తి టూ అర‌స‌వెల్లి మ‌హాపాద‌యాత్ర‌ను మ‌ధ్య‌లోనే అడ్డుకుంటూ వైసీపీ శ్రేణులు హ‌ల్ చ‌ల్ చేశారు. ఉత్త‌రాంధ్రకు అడుగుపెడుతోన్న స‌మ‌యంలో రైతుల యాత్ర‌ను అడ్డుకుంటే వాళ్ల మీద దాడికి య‌త్నంచారు. దీంతో అర్థాంత‌రంగా వాళ్ల పాద‌యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. వెంట‌నే విశాఖ కేంద్రంగా స‌భ‌ను నిర్వ‌హించ‌డం ద్వారా మూడు రాజ‌ధానుల(3capitals) డిమాండ్ ను వైసీపీ మ‌రింత పెంచింది.

చంద్ర‌బాబు స‌భ‌కు పోటీగా

రెండు వారాల క్రితం చంద్ర‌బాబు క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అక్క‌డ జ‌నం ఆయ‌న‌కు నీరాజ‌నం ప‌లికారు. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల ఆయ‌న వెంట న‌డిచారు. ఆయ‌న నిర్వ‌హించిన స‌భ అనూహ్య విజ‌యాన్ని అందుకుంది. ఆ సంద‌ర్భంంగా అమ‌రావ‌తి(amaravathi) ఏపీ రాష్ట్రానికి ఏకైక రాజ‌ధాని అనే విష‌యాన్ని బ‌ల్ల‌గుద్ది చెప్పారు. అక్క‌డ ప్ర‌జ‌ల నుంచి సానుకూల స్పంద‌న కూడా వ‌చ్చింది. కానీ, వైసీపీకి చెందిన కొంద‌రు న్యాయ‌వాదులు చంద్ర‌బాబు(chandrababu naidu)ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసి రాయ‌ల‌సీమ‌కు న్యాయ రాజ‌ధాని అంటూ డిమాండ్ చేశారు. ఆ సంఘ‌ట‌న‌ను జ‌గ‌న్ పార్టీ ఫోక‌స్ చేసింది. కానీ, రాయ‌ల‌సీమ వాసులు చంద్ర‌బాబు(chandrababu naidu) వెంట ఉన్నార‌డానికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నంగా క‌ర్నూలు స‌భ నిలిచింది. ఫ‌లితంగా సంస్థాగ‌తంగా వైసీపీ మార్పులు చేసుకుంది. కో ఆర్డినేట‌ర్ల‌, ప్రాంతీయ కో ఆర్డినేట‌ర్ల నుంచి జిల్లా స్థాయి ఇంచార్జిల వ‌ర‌కు భారీగా మార్చేసుకుంది. ప్ర‌జా బ‌లం చంద్ర‌బాబుకు మాత్ర‌మే కాదు, త‌మ‌కూ రాయ‌ల‌సీమ‌(rayalaseema)లో ఉంద‌ని నిరూపించుకునేందుకు పోటీగా సోమ‌వారం వైసీపీ స‌భ‌ను నిర్వ‌హించింది. రాయలసీమ గర్జన సభ కు కేంద్ర‌బిందువుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సభలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంట‌నే ఆయ‌న అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డం యాదృశ్చికం.

భూములు ఇచ్చిన రైతులు..

అమ‌రావ‌తి(Amaravathi)కి భూముల ఇచ్చిన రైతులు త్యాగ‌ధ‌నులు అయితే శ్రీశైలానికి భూములు ఇచ్చిన రాయ‌ల‌సీమ రైతులు మ‌హానుభావులంటూ వైసీపీ లీడ‌ర్లు ఆ స‌భ నుంచి కొనియాడారు. ఆ రైతుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వాలు ఎందుకు స‌హాయం చేయ‌లేద‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబు స‌భ‌కు పోటీగా పెట్టిన వైసీపీ స‌భ ఆద్యంత‌మూ నాటీక‌యంగా సాగింది. ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున జ‌నాన్ని త‌ర‌లించింది. బ‌స్సుల్లో బ‌ల‌వంతంగా డ్వాక్రా సంఘాల మ‌హిళ్ని తీసుకొచ్చారు. య‌థాలాపంగా వైసీపీ స‌భ జ‌రిగింద‌ని టీడీపీ చెబుతోంది. చంద్ర‌బాబు(chandrababu naidu) క‌ర్నూలు, ఏలూరు , గోదావ‌రి జిల్లాల స‌భ‌ల‌తో పోల్చుకుంటే పులిని చూసి న‌క్క‌వాత పెట్టుకున్న‌ట్టేన‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

ఒక వైపు `బాదుడే బాదుడు` మ‌రో వైపు `ఇదేం ఖ‌ర్మ‌..మ‌న‌రాష్ట్రానికి` కార్య‌క్ర‌మాల‌తో టీడీపీ నేత‌లు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళుతున్నారు. వాళ్ల‌కు ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ధ‌తు క‌నిపిస్తోంది. ఒంగోలు మ‌హ‌నాడు విజ‌య‌వంతం అయిన‌ప్ప‌టి నుంచి క్ర‌మంగా టీడీపీ ప్ర‌జాద‌ర‌ణ పెరిగింది. మినీ మ‌హానాడుల‌ను నిర్వ‌హించిన చంద్ర‌బాబు(chandrababu naidu) రోడ్ షోల‌కు జ‌నం ఎగ‌బ‌డ్డారు. ఆ త‌రువాత బాదుడేబాదుడు ప్రోగ్రామ్ చాలా చోట్ల హిట్ అయింది. దానికి కొన‌సాగింపుగా ప్ర‌స్తుతం `ఇదేం ఖ‌ర్మ..మ‌న రాష్ట్రానికి` ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల అటెన్ష‌న్ అంతా చంద్ర‌బాబు(chandrababu naidu) స‌భ‌ల వైపు మ‌ళ్లింది. దీంతో పోటీగా మూడు రాజ‌ధానుల(3 capitals) అంశాన్ని ప్రాంతాలవారీగా తీసుకెళ్ల‌డానికి వైసీపీ ప‌లు ప్ర‌య‌త్నాల‌ను చేస్తోంది. మూడేళ్ల ప‌రిపాల‌న‌, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితులు, నిరుద్యోగం త‌దిత‌ర అంశాల‌పై జ‌నం చ‌ర్చించుకోకుండా భావోద్వేగ రాజ‌కీయాల‌కు వైసీపీ ప‌దును పెడుతూ చంద్ర‌బాబు స‌భ‌ల‌కు పోటీగా స‌భ‌ల‌ను పెట్ట‌డం గ‌మ‌నార్హం.

Also Read:  Failure Politician: జ‌న‌సేనాని ఫెల్యూర్ స్టోరీ! ప‌వ‌న్ త‌డ‌బాటు పాలిటిక్స్ !