Site icon HashtagU Telugu

Jagan Reverse Attack : చంద్ర‌బాబుపై రివ‌ర్స్ స్కెచ్ వేసిన జ‌గ‌న్

Jagan Reverse Attack

Cbn Jagan

Jagan Reverse Attack : అంతా రివ‌ర్స్ ఆప‌రేష‌న్. 40ఏళ్ల రాజ‌కీయ జీవితంలో బ‌హుశా చంద్ర‌బాబు ఇలాంటి ప‌రిణామం వ‌స్తుంద‌ని ఊహించి ఉండ‌రు. టెక్నిక‌ల్ గా ఎప్పుడూ ఏ త‌ప్పు చేయ‌లేద‌ని అసెంబ్లీ సాక్షిగా చంద్ర‌బాబు చెప్పారు. ఇప్పుడూ అదే చెబుతున్నారు. స్కిల్ డ‌వ‌లెప్మెంట్ కు సంబంధించి జ‌రిగిన ఎంఓయూలు, స్కిల్ సెంట‌ర్లు, ట్రైనింగ్ అయిన విద్యార్థులు క‌ళ్లెదుట క‌నిపిస్తున్నారు. అయినప్ప‌టికీ, కొంద‌రు 371 కోట్ల‌ని, మ‌రికొంద‌రు 3వేల కోట్ల‌ను వైసీపీ లీడ‌ర్లు దుమ్మెత్తిపోస్తున్నారని టీడీపీ వాదిస్తోంది. దానిలో నిజానిజాలు ఎలా ఉన్నా, ప‌క్కా స్కెచ్ వేసి చంద్ర‌బాబును ఇరికించేశారు. ఇదంతా రివ‌ర్స్ ఆప‌రేష‌న్లో జ‌రిగింద‌ని టీడీపీ ఆల‌స్యంగా గ్ర‌హించింద‌ట‌.

పై కోర్టు నుంచి కింద కోర్టు వ‌ర‌కు స్కెచ్ (Jagan Reverse Attack)

సుప్రీం కోర్టు బెంచ్ నుంచి ఏసీబీ కోర్టు వ‌ర‌కు ఏమి జ‌రుగుతుంది? దానికి విరుగుడు ఏమిటి? అనే దానిపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సర్కార్ బాగా క‌స‌ర‌త్తు చేసింది. సాధార‌ణంగా కింది కోర్టు నుంచి పై కోర్టు వ‌ర‌కు ఎవ‌రైనా ఆలోచిస్తారు. కానీ, పై కోర్టు నుంచి కింద కోర్టు వ‌ర‌కు స్కెచ్ ఎలా ఉండాలి? అనే దానిపై ఏపీ సీఐడీ ప్ర‌ణాళిక బాగా వేసింద‌ని టీడీపీ అనుమానిస్తోంది. ఏ రోజు చంద్ర‌బాబును అరెస్ట్ చేయాలి? ఎక్క‌డ అరెస్ట్ చేయాలి? ఏ కోర్టులో ఎప్పుడు ప్ర‌వేశ పెట్టాలి? త‌దిత‌ర ప్ర‌ణాళిక‌ను ప‌క్కాగా వేసింది. కొమ్ములు తిరిగిన లాయ‌ర్లు ఢిల్లీ, లండ‌న్ నుంచి వ‌చ్చినప్ప‌టికీ స్కెచ్ ప్ర‌కారం ఏపీ సీఐడీ  (Jagan Reverse Attack) అంతా న‌డుపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అంతా సీఐడీ అనుకున్న విధంగా జ‌రుగుతోంది.

రెండు రోజుల క‌స్ట‌డీ చంద్రబాబు

రెండు రోజుల క‌స్టడీకి చంద్ర‌బాబును సీఐడీ తీసుకోనుంది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు మేర‌కు రెండు రోజుల క‌స్ట‌డీ చంద్రబాబు అనుభ‌వించాలి. కీల‌క‌మైన మూడు తీర్పులు శుక్ర‌వారం చంద్ర‌బాబుకు ప్ర‌తికూలంగా రావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న రిమాండ్ పొడిగింపు తొలి తీర్పు. రెండు రోజుల పాటు రిమాండ్ ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. ఆ త‌రువాత రెండు గంట వ్య‌వ‌ధిలోనే లిస్ట్ కాలేద‌నుకున్న క్వాష్ పిటిష‌న్ ను తిర‌స్క‌రిస్తూ హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. పెండింగ్ లో పెట్టిన క‌స్ట‌డీ పిటిష‌న్ మీద తీర్పును ఏసీబీ కోర్టు వెల్ల‌డిస్తూ తీర్పు ఇచ్చింది. ఇక చంద్ర‌బాబు లాయ‌ర్లు ఇచ్చిన మెమో మీద మాత్ర‌మే ఏసీబీ కోర్టు స్పందించాల్సి ఉంది.

సీఐడీ క‌స్ట‌డీకి రెండు రోజులు పాటు ఇస్తూ తీర్పు చెప్పిన త‌రువాత చంద్ర‌బాబు లాయ‌ర్లు మెమో దాఖ‌లు ప‌రిచారు. అరెస్ట్ చేసిన రోజు ఉద‌యం నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌ర‌కు (24 గంట‌లు) చంద్ర‌బాబు సీఐడీ క‌స్ట‌డీలో ఉన్నారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న్ను విచారించిన స‌మ‌యంలో ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగింది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత మీడియా సంస్థ‌కు చెందిన ఫోటో గ్రాఫ‌ర్, వీడియో గ్రాఫ‌ర్ విచార‌ణ సంద‌ర్బంగా అక్క‌డే ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డం అనుమానాల‌కు క‌లిగిస్తోంది. వాటిని ఆధారంగా చూపుతూ సీఐడీ క‌స్ట‌డీలో చంద్ర‌బాబుకు ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త లేద‌ని మెమో వేయ‌డం జ‌రిగింది. దానిపై ఏసీబీ కోర్టు ఏమి చెబుతుంది? అనేది చూడాలి(Jagan Reverse Attack)

Also Read : Jagan Delhi sketch : `ఆప‌రేష‌న్ గ‌రుడ‌`కు ఢిల్లీలో జ‌గ‌న్ ప‌దును?

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌న్నీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అనుకున్న విధంగా జ‌రుగుతూ వ‌స్తున్నాయి. సుప్రీం కోర్టుకు ఇప్పుడు చంద్ర‌బాబు కేసు వెళ్లింది. అక్క‌డ ఇచ్చే తీర్పు ఆయ‌న‌కు అనుకూలంగా లేక‌పోతే మాత్రం రాజ‌కీయంగా టీడీపీకి గ‌డ్డుకాల‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే, ఏపీ సీఐడీ విచార‌ణ దూకుడు పెంచ‌నుంది. మ‌రో వైపు లోకేష్ ను ఈకేసు తో పాటు ఫైబ‌ర్ నెట్ కేసులో జైలుకు పంప‌డానికి సిద్దం అయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాబోవు ఎన్నిక‌ల‌ను లీడ్ చేయ‌డానికి పార్టీ ప‌రంగా కొంత ఇబ్బంది ప‌డుతుంది. ఇదే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కావ‌ల్సింది. సో..ప‌క్కా స్కెచ్ తో వెళుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రివ‌ర్స్ అటాక్  (Jagan Reverse Attack)చేశార‌న్న‌మాట‌. అంటే, సుప్రీం కోర్టు నుంచి క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో చంద్ర‌బాబును అరెస్ట్ చేసే వ‌ర‌కు టైమ్ అండ్ డేట్స్ ఫిక్స్ చేశార‌న్న‌మాట‌.

Also Read : Chandrababu – CID Custody : రెండు రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు

ఈనెల 8వ తేదీన శుక్ర‌వారం రాత్రి చంద్ర‌బాబును అరెస్ట్ చేయ‌డం, ఆదివారం రాత్రి దాటే వ‌ర‌కు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు, ఆ త‌రువాత మ‌ళ్లీ శుక్ర‌వారం వ‌చ్చే వ‌ర‌కు క్వాష్‌, క‌స్ట‌డీ పిటిష‌న్ల తీర్పు రావ‌డం ఆ దేవుని స్క్రీప్ట్ . సోమ‌వారం సుప్రీం కోర్టులో క్వాష్ తిర‌స్క‌రించ‌డాన్ని స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌బోతున్నారు. దాని మీద తీర్పు కూడా శుక్ర‌వారం వ‌ర‌కు సాగుతుందా? అది కూడా దేవుని స్క్రిప్ట్ ప్ర‌కారం ఉంటుందా? అనే చ‌ర్చ టీడీపీ వ‌ర్గాల్లో ఉంది. మొత్తం మీద అరెస్ట్ నుంచి సుప్రీం కోర్టుకు వ‌ర‌కు వెళ్ల‌డం కాదు, సుప్రీం కోర్టు నుంచి నంద్యాల అరెస్ట్ వ‌ర‌కు రివ‌ర్స్ స్కెచ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ర‌చించింద‌ని ఎల్లో టీమ్ కు ఇప్పుడు బోధ‌ప‌డుతుంది. ఆ దేవుని స్క్రీప్ట్ ఎఫెక్ట్ అలా ఉంది మ‌రి.!