Tirumala Laddu Controversy : పాప ప్రక్షాళన పూజకు జగన్ సిద్ధం ..టీడీపీ కౌంటర్

Tirumala Laddu Controversy : రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా జగన్‌ అన్నారు

Published By: HashtagU Telugu Desk
Jagan Tpt

Jagan Tpt

Jagan Reddy calls for Temple Pooja : తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ వివాదం సాగుతున్న క్రమంలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ (Jagan) తిరుమల సందర్శనకు రానుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని జగన్‌ పిలుపునిచ్చారు.

కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారు. రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు (Chandrababu) అబద్ధాలు ఆడుతున్నారని ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా జగన్‌ అన్నారు. ”తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిస్తోంది” అని జగన్‌ ట్వీట్‌ చేశారు. జగన్ శ్రీవారిని దర్శించుకొని పాప ప్రక్షాళన పూజ చేయనున్నారు.

జగన్ ట్వీట్ కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ‘నీ కుటుంబం విగ్రహారాధన చేయదు. ఒక్కసారి కూడా భార్యను తీసుకుని పట్టు వస్త్రాలు ఇవ్వలేదు. భార్య గుడికి రాదని ఇంట్లోనే స్వామి వారి ఆలయం సెట్టింగ్ వేశావ్. లడ్డూలో జంతు కొవ్వు కలిపావ్. స్వామి వారంటే నమ్మకం, భక్తి లేని నీ లాంటి వాడా ఈ పిలుపు ఇచ్చేది?’ అని మండిపడింది.

Read Also : Pawan Kalyan : ‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడం’ ఏంటో – ప్రకాష్ రాజ్ ట్వీట్

  Last Updated: 25 Sep 2024, 07:48 PM IST