Site icon HashtagU Telugu

Jagan Pulivendula Politics : అరెస్ట్ ల‌తో జ‌గ‌న్ `మ‌రో ఛాన్స్` స్కెచ్

Jagan Pulivendula Politics

Jagan Day

Jagan Pulivendula Politics :  ఏపీలో అరెస్ట్ ల వ‌ర‌కు రాజ‌కీయం ప‌రిమిత‌మా? ప్ర‌జా సొమ్మును రిక‌వ‌రీ చేస్తారా? కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ హ‌డావుడి ఉంటుందా? జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆలోచ‌న ఏమిటి? అనే దానిపై విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆధారాల్లేని కేసులో ఇరికించార‌ని చంద్ర‌బాబు అండ్ టీమ్ చెబుతోంది. ఆధారాల‌తోనే అరెస్ట్ చేశామ‌ని జ‌గ‌న్ అండ్ కో మీడియా ముఖంగా ఊద‌ర‌కొడుతోంది. ఆరోప‌ణ‌లను కేసుల రూపంలోకి తీసుకొచ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిరూపించ‌గ‌ల‌రా? అంటే ఏమో అంటున్నారు కొంద‌రు వైసీపీ నేత‌లు.

ఆరోప‌ణ‌లను కేసుల రూపంలోకి తీసుకొచ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Pulivendula Politics )

సుదీర్ఘ రాజకీయాల్లో చంద్ర‌బాబు ఎప్పుడూ టెక్నిక‌ల్ గా త‌ప్పు చేయ‌లేదు. ఆ విష‌యాన్ని ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో అసెంబ్లీ వేదిక‌గా చెప్పారు. ఈసారి కూడా స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసులో త‌ప్పు చేయ‌లేద‌ని కోర్టుల్లో వాదిస్తున్నారు. ఆయ‌న లాయ‌ర్లు కూడా అదే కోణం నుంచి పిటిష‌న్లు వేస్తున్నారు. కేసును క్వాష్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. స్కిల్ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు బెయిల్ కోసం ప్ర‌య‌త్నం చేయ‌లేదు. త‌ప్పు డు కేసు పెట్టార‌ని మాత్ర‌మే లూథ్రా ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వ‌ర‌కు వాదించారు. అక్టోబ‌ర్ మూడో తేదీన క్వాష్ పిటిష‌న్ మీద తీర్పు వ‌స్తుంద‌ని టీడీపీ చూస్తోంది. ఆలోపుగా లోకేష్ ను కూడా జైలుకు పంపాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం (Jagan Pulivendula Politics)  ప్ర‌య‌త్నం చేస్తోంది.

41ఏ కింద నోటీసులు ఇవ్వ‌డానికి సీఐడీ ఢిల్లీ

అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్ కేసుల్లో ఇప్ప‌టికే పిటీ వారెంట్ల‌ను సీఐడీ జారీ చేసింది. అందుకే వాటి మీద ముంద‌స్తు బెయిల్ కోసం చంద్ర‌బాబు న్యాయ‌వాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిష‌న్ల‌ను దాఖ‌లు ప‌రిచారు. వాటి మీద విచార‌ణ చేసి న్యాయం చేయాల‌ని కోరుతున్నారు. ఇదే స‌మ‌యంలో స్కిల్ కేసులో నిందితుడిగా ఉన్న లోకేష్ ముందస్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈనెల 4వ తేదీ వ‌ర‌కు అరెస్ట్ చేయొద్ద‌ని హైకోర్టు ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఇక ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, ఫైబ‌ర్ నెట్ కేసులు ఉన్నాయి. ఏ14గా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఉన్న ఆయ‌న‌కు 41ఏ కింద నోటీసులు ఇవ్వ‌డానికి సీఐడీ( Jagan Pulivendula Politics) ఢిల్లీ వెళ్లింది.

Also Read : CM Jagan : వైఎస్ఆర్ వాహ‌నమిత్ర నిధులు విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్‌

ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, ఫైబ‌ర్ నెట్, స్కిల్ కేసుల్లో చంద్ర‌బాబు, లోకేష్ ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం టార్గెట్ చేసింది. ఇవే అంశాల‌ను ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆరోప‌ణ‌లుగా టీడీపీ మీద సంధించారు. అప్ప‌ట్లో అసెంబ్లీ వేదిక‌గా వాటికి సంబంధించిన జీవోలు, వివ‌రాల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తెలియ‌చేసింది. ప్ర‌భుత్వం మారిన త‌రువాత కూడా ప్ర‌తిప‌క్ష హోదాలో ఆనాడు జ‌రిగిన అన్ని అంశాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు.

మూడేళ్లుగా ఈ మూడు అంశాల‌పై ఆరోప‌ణ‌ల‌ను చేస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఇప్పుడు జైలు దిశ‌గా ప్ర‌తిప‌క్ష నేత‌ల్ని పంపుతున్నారు. ఎన్నిక‌ల్లో హామీల్లో భాగంగా చంద్ర‌బాబు,లోకేష్ అండ్ బ్యాచ్ ను ఒకే జైలులో పెడ‌తామ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. అంతేకాదు, ప్ర‌జాధ‌నాన్ని రిక‌వ‌రీ చేసి చూపిస్తాన‌ని శ‌ప‌థం చేశారు. ఆ క్ర‌మంలోనే ఇప్పుడు అరెస్ట్ ల ప‌ర్వాన్ని కొన‌సాగిస్తున్నారా? అంటే ఔనంటున్నారు కొంద‌రు వైసీపీ నేతలు. మ‌రి, ప్ర‌జా సొమ్ము రిక‌వ‌రీ మాటేమిటి? అంటే మాత్రం మొఖంచాటేయ‌డం గ‌మ‌నార్హం. అంటే, ఇప్పుడు పెడుతున్న‌వ‌న్నీ రాజ‌కీయ క్షక్ష‌పూరిత కేసుల‌న్న‌మాట‌.

Also Read : Adani Meets CM Jagan : సీఎం జగన్ తో అదానీ భేటీ..