Site icon HashtagU Telugu

Jagan Public Meeting at Nandyal : బాబు వస్తే రాష్ట్రంలో కరువే – నంద్యాల సభలో జగన్ కీలక వ్యాఖ్యలు

Jagan Viveka Siddam

Jagan Viveka Siddam

నంద్యాల (Nandyal ) సభలో మరోసారి చంద్రబాబు (CHandrababu) ఫై జగన్ (Jagan) విరుచుకపడ్డారు. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర అయితే, మోసాల చంద్ర‌బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలని జగన్ పిలునిపిచ్చారు.గతంలో చంద్రబాబు అబద్దాలు, మోసాలు చూశాం. ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నా. మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయమని కోరుతున్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయండి.బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? నారావారి పాలన రాకుండా చేసేందుకు మీరంతా సిద్ధమా? అంటూ ప్రజలను కోరారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ప్రొద్దుటూరు లో మేమంతా సభ లో ప్రతిపక్ష పార్టీల ఫై ఘాటైన విమర్శలు , ఆరోపణలు చేసిన జగన్..ఈరోజు నంద్యాల సభలోను అదే మాదిరి విరుచుకపడ్డారు. ముఖ్యంగా చంద్రబాబు ఫై కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు వస్తే కరువు వస్తుందని సీఎం జగన్​ అన్నారు.

చంద్రబాబు పేరు చెబితే కరువు కాటకాలు, బషీర్​ బాగ్​ కాల్నులు గుర్తొస్తాయన్నారు. 2014 లో రంగురంగుల హామీలు ఇచ్చారన్నారు. ఆడబిడ్డ పుడితే రూ. 24 వేలు ఇస్తామన్నారు.. ఒక్కరూపాయి ఇచ్చారా …. రైతు రుణమాఫీ.. డ్వాక్రా రుణాలు మాఫీలు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం చేయలేదన్నారు. సూపర్​ సిక్స్​ అంటూ మళ్లీ కొత్త హామీలు ప్రకటిస్తున్నారన్నారు. పేదల బతుకుల్లో మార్పు కోసమే నా ఆరాటం అని జగన్​ అన్నారు. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం. ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికలు మోసాల బాబుకు చివరి ఎన్నికలు కావాలి. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామ‌ని సీఎం వైయ‌స్‌ జగన్ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రైతులు, వృద్ధులు, సామాజికవర్గాల వారీగా ఆలోచన చేయండి. అంధులు కూడా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్లి మీ ఇల్లాలు, మీ పిల్లలు, మీ అవ్వా తాతలతో ఆలోచన చేయండి. ఎవరి వల్ల, ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది? మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉంది? అనేది ఆలోచన చేయండి. ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అంటూ సీఎం జగన్ ప్రజలను కోరారు. మరోసారి ఫ్యానుకు రెండు ఓట్లు వేసి, ఇతరులతోనూ వేయించి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్ సభ స్థానాలు… మొత్తంగా 200కి 200 స్థానాల్లో గెలిపించి డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా? అని ప్రజలను అడిగారు. దీనికి సభకు వచ్చిన వారంతా సిద్ధం అంటూ చెప్పుకొచ్చారు.

Read Also : Danam : కేటీఆర్ మాటలు నచ్చలేదు..బిఆర్ఎస్ లో ఏ నేతకు స్వేచ్ఛ ఉండదు – దానం