పౌరుషాల పల్నాడు (Palnadu ) గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని..ఇక పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు జగన్. ఈరోజు బుధువారం పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల (Varikapudisela Project) ఎత్తిపోతల పథకం పనులకు జగన్ శంకుస్థాపన చేసారు. అనంతరం ఏర్పాటు చేసినబహిరంగ సభలో పాల్గొన్న జగన్.. పల్నాడుకు కృష్ణా జలాలు అందించబోతున్నామన్నారు. పల్నాడు రూపురేఖలను సమూలంగా మార్చేందుకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇదే సందర్భంగా టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)పై విమర్శలు గుప్పించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశామని .. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని జగన్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. టీడీప పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలే అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి చంద్రబాబు ఒక్క మంచి కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా? అని ప్రశ్నించారు. కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పిన్నతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా? అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు.
ఈ ప్రాజెక్టును దశలవారిగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తాం. ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందింబోతున్నామన్నారు. పౌరుషాల పల్నాడును అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రోజు ఇంతటి చిక్కటి చిరునవ్వులు, ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు.
Read Also : Pitch Swap For Semis: సెమీస్ ముంగిట బీసీసీఐపై సంచలన ఆరోపణలు.. పిచ్‌ను మార్చేశారంటూ కథనాలు..!?